COMMENTS

మన రాష్ట్రంలో కమ్యునిస్టు పార్టీల నాయకులు ఎందుకు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడం లేదు. ఉద్యమాలు అప్పుడు కలుస్తాము. తర్వాత విడిపోతాము. తరువాత, టి.డి.పి, ఒకసారి, కాంగ్రెస్ కు ఒక సారి, కలవడం ఎందుకు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఆస్తులు పెంచడానికి ఎందుకు ఉపయోగ పడాలి. కమ్యునిస్టు పార్టీల ప్రేమికులను, అభిమానులను ఎందుకు నిరాశ పరచాలి. ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, భవిషత్, నిజంగా కోతుకుంటుంటే త్వరగా లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలి. అహంకారాలు అడ్డువస్తే వాటిని పూడ్చి పెట్టండి. కమ్యునిజం లో అహంకారానికి తావులేదు. అది మనువాదంలో, అగ్రకుల ఆహంకారంలో ఉంది.కాంగ్రెస్ ను తిడుతూ కూర్చోవడం మన పనిగా భావించడం జరుగుతుంది. అది కాదు.ప్రజలకు కావలసినది లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ .   రాష్ట్రంలో కమ్యునిస్ట్ స్టు పార్టీలు, ఆర్.పి ఐ , లోకసత్తా, ఆమ్ ఆద్మీ,  బి.ఎస్.పి ఇతర దళిత, బి.సి పార్టీలను కలుపుకొని టి.డి. పి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్, టి. ఆర్. ఎస్, కాంగ్రెస్స్ పార్టీలకు వ్యతిరేకంగా ఒక లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి ఈరాష్ట్ర ప్రజలకు సరి అయిన మార్గాన్ని చూపించగలరని ప్రజలు కమ్యునిస్టు పార్టీల అభిమానులు, ప్రేమికులు ఆసిస్తూ వున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి