10, ఏప్రిల్ 2021, శనివారం

wokers party

 

కొన్ని గ్రూప్ లలో వర్కర్స్ పార్టీ ఎపుడు స్తాపించ బడింది. ఎప్పటినుంచి పనిచేస్తుందని కొంతమంది కోపంతో అడుగుతున్నారు.
వాళ్ళు వర్కర్స పార్టీ పోస్టులు చూసి, కోపంతో అడుగు తున్నారు. కొంత విషయం ఈ గ్రూప్ పేస్ బుక్ లో పెట్ట్టాను.
అయిన ఇంకా కొంత వివరంగా చెప్పాలనిపించింది
1936 లోనే బాబాసాహెబ్అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని బ్రాహ్మణ ధర్మానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ విధానానికివ్యతిరేకంగా స్తాపించి 19 42 వరకు నడిపారు. తరువాత 1942 లో కొన్ని కారణాలు వలన ( రాయవచ్చు కానిరాయడం అనవసరం) మనుధర్మానికి వ్యతిరేకంగా, దళితజాతీయవాదంతో షెడ్యూల్ కేష్టు ఫెడరేషన్ మార్చారు. తరువాత 1952 లో దళితబుద్ధిష్ట్ మూవ్మెంట్ తో, దళితజాతీయ వాద దృక్పధం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను స్తాపించారు.
పశ్చిమ బెంగాల్ లో ప్రొఫెసర్ జ్యోతి భట్టాచార్య నాయకత్వంలో ఎం. .ఎన్ రాయ్ నాయకత్వంలో ఉన్న రాడికల్ డెమాక్రటిక్ పార్టీనుండి విడి, పోయి 19 43 నుండి ఉన్న డెమక్రటిక్ వాన్ గార్డ్ను వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా మార్చుకొని పని చేసారు. యునైటెడ్ ఫ్రంట్ ప్ర బుత్వంలో 19 6 7 నుండి1969 వరకు జ్యోతి భట్టాచార్య విద్యశాఖమంత్రి గా పని చేసారు. తరువాత కమ్యునిష్ట్ వర్కర్స్ పార్టీ గా వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా గా చీలి కొంతకాలం పనిచేసాయి. తరువాత కాలంలోకమ్యునిష్టు వర్కర్స్ పార్టీ, 1993 వర్కర్స్ పార్టీగా పేరుమార్చు కొని పనిచేయడం జరిగింది. 1998 లో జ్యోతిభట్టాచార్య చనిపోవడం జరిగింది. తరువాత పార్టీ కొనసాగలేదు. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా 20 11 లెఫ్ట్ ఫ్రంట్ లోఉండి శక్తీకొలది పని చేసింది. .
1947నుండి మహారాష్ట్ర లో పెజెంత్స్ అండ్ వర్కర్స్ పార్టీ కేశవ రావ్ జేడె మార్క్ సిద్ధాంతం తో స్తాపించారు . ఇప్పుడు ఈపార్టీ మహారాష్ర లోపని చేస్తుంది.
1991 మాజీ రాష్ట్రపతి వి.వి. గిరిగారు లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా ను స్తాపించి పని చేసారు.
తెలంగాణా రాష్ట్రం లో TDP, లోను TRS లోను కార్య కర్త్తగా పనిచేసిన భాస్కర్ శ్రమజీవి పార్టీని స్తాపించి తన శక్తీ కొలది పని చేస్తున్నారు.
ప్రపంచంలోబ్రిటన్ లోలేబర్ పార్టీ, డెన్మార్క్ లో, అమెరికాలో ఐర్లాండ్ లో సింగ పూర్ లో ఇంకా ప్రపంచ వ్యాపింతంగా వర్కర్స్ పార్టీలు ఉన్నాయి.
1947 డాంగేనాయకత్వంలో భారత కమ్యునిష్టు పార్టీ USSR కమ్యునిస్టు పార్టీని సలహా ల కోసంవెళితే స్టాలిన్ నాయకత్వం లో ఉన్న USSR కమ్యునిస్టు పార్టీ భారత్ కమ్యూనిష్ట్ పార్టీ నాయకులకు కమ్యునిస్టు పార్టీపేరు మార్చి లేబర్ పార్టీ గా కాని వర్కర్స్ పార్టీ గా కాని పేరు మార్చిపని చేయమని సలహా కూడా ఇచ్చారు. కాని మన నాయకులు విని వచ్చారు. కాని సలహాను స్వీకరించ లేదు. బహుశా అంబేద్కర్ అప్పటికే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి పని చేస్తున్నారు.
వర్కర్స్ పార్టీకి లేబర్ పార్టీలకు దేశంలోను ప్రపంచంలోను గొప్పచరిత్ర ఉంది. తెలుగురాష్ట్రాలలోఉన్న భూస్వామ్య వర్గాలకు వారి బానిసలకు అర్ధంకాదు. డబ్బు మందు బహుమతులు పంచె వారికి ఏమి తెలుస్తుంది.
కార్మికులు బానిసలు కాదు చైతన్య దీపాలు. మౌనంగా ఉండలేరు
నేను స్తాపించిన వర్కర్స్ పార్టీ సమానత్వం, అబివృద్ది, మమత, న్యాయం, శాంతి ఆశయాలతో పని చేస్తుంది. వర్కర్స్ పార్టీ పనిచేయడంఅంటే ఏంతోకష్టం. అందులో ఫ్యూడల్ భావ జాలం గల దేశంలోపనిచేయడం ఎంతో కష్టం. అయిన చాల మంది చేసారు. చేస్తున్నారు. మేము చేస్తాం.
విజయం ఆలస్యం అయిన దేశం కార్మికులదే . ప్రపంచం కార్మికులదే.
MY PEOPLE ALONE CAN ESTABLISH SOCIALISM IN INDIA UNDER THE RULE OF PEASANTS AND WORKERS ---- Dr. Baba Saheb Ambedkar.
అదే భావంతోవర్కర్స్ పార్టీ పనిచేస్తుంది.
వర్కర్స్ పార్టీ లు లేబర్ పార్తీలు ఇంకా పుట్టాలి. ఫ్యూడల్ భావజాలాన్నీ, సామ్రజ్యవాద భావజాలన్నీ ఓడించాలి. .
కమ్యునిస్టు పార్టీలుచేస్తే సంతోషమే. కాని వాస్తవం లో జరగలేదు. చేస్తాయని ఆశిద్దాం.
సమత, ప్రగతి, మమత, న్యాయం, శాంతి వర్ధిల్లాలి.
వర్కర్స్ పార్టీ నిర్మాణంలోబాగాస్వాములుకండి. ఫ్యూడల్ భావజాలాన్నీ, సామ్రజ్య వాద భావజాలన్నీ ఓడించ డానికి ముందుకు రండి.
దేశంలో ప్రజా స్వామ్యన్నీనెల కోల్పండి