డబ్బు మద్యము బహుమతులు పంచె వారిని ఓడించండి . హైదరాబాద్ లో ప్రజాస్వామయానికి పునాదులు వేయండి.
_________________
మిత్రులారా,
హైదరాబాద్ కొర్పొరేషన్ ఎన్నికలల్లో డబ్బు మద్యము బహుమతులు అన్ని ఎన్నికలల్లో పంచినట్లు పంచుతున్నారు. దీనిని ప్రజస్వామ్యవాదులు , ప్రజలు తిరస్కరించాలి. ప్రజస్వామ్యాన్ని గెలిపంచాలి. వామ పక్ష పార్టీల , శ్రామిక పార్టీల అభ్యర్థులను గెలిపించాలి.
అసలు కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరి అయినది కాదు. ప్రజలను, కార్యకర్తలను , నాయకులను కరోనాకు దగ్గరగా తీసుకు రావడమే. కరోనా బారిన పడటమే. ప్రభుత్వము పాటించుకోకుండా ఎన్నికలు నిర్వహణకు సిద్ధపడింది.
క్రిందటి నెలలో వచ్చిన వర్షాలకు హైదరాబాద్ ఎంత వణికి పోయిందో మనం కళ్లారా చూసాం. బాదాహాలు పడ్డాము . ఇల్లలోకి వచ్చి ఎన్నో బాధాలు పడ్డాము. దీనికి కారణాలు ఏమిటి . ఫ్రభుత్వము ముందు చర్యలు తీసుకోకపోవడమే . హైదరాబాద్ అధ్యయనం చేయడం ప్రభుత్వము విఫలమయింది. దాని ఫలితమే హైదరాబద్ వర్షం వస్తే తట్టుకోలేక పోతుంది.
ఎన్నికలలో డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం వలన ఎన్నికయిన ప్రతినిధులు సంపాదనకే దృష్టి పెడుతున్నారు. అసలు ఎన్నికల నిబంధనావలి ప్రకారం నేరస్తులు వారిని జైల్లో వేయాలి. అందుకొరకు కమ్యూనిష్టులు, అంబేడ్కరిష్టలు , శ్రామికులు , ప్రజాతంత్ర వాదులు అందుకొరకు ప్రచారం చేయాలి. కృషి చేయాలి.
వామ పక్షపార్టీలు హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేయడం జరుగుతుంది.
హైదరాబాద్ ప్రజల సమస్యలపై , ప్రజల సమస్యలపై వామపక్ష పార్టీలు ఎన్నో ఆందోళనలు చేశాయి. చేస్తున్నాయి. ప్రజలు వామపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపిచ వలసిందిగా విజ్ఞప్తి ప్రజస్వామ్యాన్ని గెలిపించండి . డబ్బు మద్యము బహుమతులు పంచె వాళ్ళు నశించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి