నిన్నటి హిందూ లో Feroze biography brings up Indira's role in ousting EMS govt. చదివిన తర్వాత అభిప్రాయం రాయలని రాస్తుంటే నాహృదయం లోనించి వచ్చిన వాక్యాలు
ఫిరోజ్ గాంధి ఇందిరాగాంధీ తో "Where are the principles of the Congress? Are we going to be dictated by a caste monster we have produced.." అని ఆనాటి కాంగ్రెస్ గురించి అన్నట్లు గానే ఉంది.
నంబు త్రిపాద్ ఎన్నికల ద్వారా వచ్చిన ప్రభుత్వాన్ని నెహ్రు, ఫిరోజ్ గాంధి పడ వెయ కూడదు అని చెప్పిన ఇందిరాగాంధీ రద్దు చేయించారు. ఇందిరాగాంధీ మీద కాంగ్రెస్ లోని కుల వాదులు బాగా పని చేసారా. చివరికి తండ్రి, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫిరోజ్ గాంధి ప్రజా స్వామిక వాదులు మాట కూడా వినలేదంటే ఏమి జరిగి వుంటుంది. చివరికి ఫిరోజ్ గాంధికి దూరం కూడా అయింది. ఇది 1957 జరిగిన సంఘటన. అపుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు కదా.
ఆనాటి కేరళ ప్రభుత్వం మహాత్మాగాంధీ బొమ్మలు పాటశాలలో తీసివేసి మార్క్స్ , లెనిన్ బొమ్మలు పెట్టడం అది నేరంగా హిందూ సమజం భావించింది. కాంగ్రెస్ పార్టీలోని హిందుత్వ శక్తులు ఇందిరా గాంధిని వాడు కో గలిిగాయి. తండ్రి, భర్త దానిని తప్ప్పుగా చూడక పోయిన ఇందిరాగాంధీ చేత ఆ ప్రభుత్వాన్ని కూల గొట్ట గలిగారు.
నా ఇంట్లో ఇప్పటికి మహాత్మాగాంధీ బొమ్మ లేదు. కాని లైబ్రరిలో మహాత్మాగాంధీ రాసిన My experiment with truth ఉంది
ఆ తరువాత ఇందిరా గాంధీని దేశం కోసం భారత కమ్యునిస్టు పార్టీ ఎమర్జెన్సీ లో మద్దత్తు ఇచ్హి నిలబెట్టడం జరిగింది ఇతర కమ్యునిష్టు పార్టీలు వ్యతి రేకించి నాయి. కాని భారత కమ్యునిష్టు పార్టీ చేసినది. ఈనాటి పరిస్తితులు చూస్తుంటే చంద్ర రాజేశ్వర రావు, డాంగే గార్లు నాయకత్వం లో ఉన్న కమ్యునిస్టు పార్టీ తీసుకున్న సరి అయినది అనిపిస్తోంది.
ప్రముఖ సోషలిస్ట్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయం ఏర్పడకుండా కాంగ్రెస్స్ పార్టీ ప్రభుత్వాన్ని పడవేయ కూడదు. పడవేసే పరిస్తితి తీసుకు రాకూడదు. అసలు1951 లోనే నెహ్రు నెహ్రు తను ప్రధాన మంత్రి గా ఉండను అని అనేసారు.
నేను కాలేజి లో ఉన్నపుడు చైర్మెన్ మావో మా చైర్మన్ అనే వాడిని. చాలా కాలం మా ఇంట్లో అపుడు భగత్ సింగ్ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో తరిమిల నాగిరేడ్డి, బొమ్మలే ఉనాయి. ఇపటికే మహాత్మాగాంధీ బొమ్మ లేదు. పుస్తకాలే వున్నాయి.
కాని ఆనాటి నంబు త్రిపాద్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పాటశాలలో మహాత్మాగాంధీ బొమ్మ తీసి వేయడం, కేరళలో ప్రతి పక్షం లో ఉన్న కాంగ్రెస్ కు ఇబ్బంది ఏర్పడి ఉండవచ్చు. తండ్రి నెహ్రు ,భర్త ఫిరోజ్ గాంధి వ్యతిరేకించ లేదు. ఇందిర గాంధి మహత్మా గాంధి మీద ఉన్న ప్రేమతో కావచ్చు పాటశాల లో మహత్మా గాంధి బొమ్మ తీసి వేయడం సహించ లేకపోయి ఉండవచ్చు . చివరికి తండ్రి, భర్త వారిస్తున్న కేరళ ప్రభుత్వాన్ని పడ వేయడానికి కారణం అయింది. భర్తకు దూరం అయింది.
చరిత్ర లో ఎన్నో విషాద ఘట్టాలు . విజయాలు కని పిస్తాయి. ఓటములు కనిపిస్తాయి. గెలుపులు కని పిస్తాయి మార్పులు కనిపిస్త్తాయి. ఇదొక నిరంతర సంఘర్షణ. వర్తమానం లో ఆ గుణ పాటాలు తీసుకోవాలి.
ఇపుడు మా ఇంట్లో ఇపుడు గౌతమ బుద్దుడు, భగత్ సింగ్, మహాత్మా జ్యోతి రావు ఫులే అంబేద్కర్, సద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామీ, మారోజు వీరన్న ఫోటోలు ఉన్నాయి.
ఇప్పటికీ మా ఇంట్లో మహాత్మాగాంధీ బొమ్మలేదు . అయిన మహాత్మ గాంధి మహాత్ముడే. వారికి నా నమస్సులు
-------------------కామూ
-----------------------------------------------------------------
చరిత్ర చదివన తర్వాత వర్తమానం చూస్తుంటే రాహుల్ గాంధి కాంగ్రెస్ పార్టీ బాద్యత తీసుకోకుండా ఉంటే సరి పోతుoదనిపిస్తోంది.
కాకాపొతే కేరళ లో ఉన్న కాంగ్రెస్ కోసం ఆ బాద్యత తీసుకోవాల్సి వస్తుందేమో.
ఇపుడు మొత్తం బాద్యత కాంగ్రెస్ పార్టీ కి ఉన్నంత చరిత్ర ఉన్న కమ్యునిస్టు పార్టీల మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ను వ్యతిరేకిచండి, అని నూరి పోసిన కమ్యునిష్టు పార్టీలే ఆ బాద్యత తీసుకోవాలి. అది వారి బాద్యత
అంబేడ్కరిష్టులకు అంతా బాద్యత మోయలేవు.
కాని కమ్యునిస్టు పార్టీలు తీసుకునేటట్లు కనిపించడం లేదు.
--------------కామూ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి