మనీషా ఈ దేశపు రాష్ట్రపతి, PM, CM, మంత్రులు, MP లు MLAలు కలెక్టర్లు, పోలీసులు, రాజ్యాంగం వృధా.
అయినా మనీషా నీ కాలిన శరీరపు రేణువులు గాలిలో వచ్చి దేశభక్తుల హృదయాలలో చేరి అణుబాంబులు గా తయారవుతున్నాయి.
అవును మనీషా
మావి కన్నీళ్లు కాదు.
మా కన్నీళ్ళలోకి వచ్చిన నీ శరీరపు రేణువులు మా కన్నీళ్లను అణుబాంబులుగా మారుస్తున్నాయి.
ఖచ్చితంగా ఈ అణుబాంబులు ఊరుకోవు.
న్యాయం చేస్తాయి.
నిన్ను చంపిన ఈ మనువాదానికి సమాధి కడతాయి.
సమ సమాజానికి పునాదులు వేస్తాయి.
మనిషా బ్రతికి ఉన్నందుకు క్షమించు మనీషా.
న్యాయం కోసం బ్రతుకుతూ యుద్ధం చేస్తాము మనిషా.
సమసమాజాన్ని సృష్టిస్తాం మనిషా.
ఇదే మా నివాళి మనీషా.
మా మనీషా.
🙏🙏🙏✊✊✊
---కాము
5.10.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి