మనీషా హత్య
ఇలాగ దేశం లో రేపులు హత్యలు, హత్య కాండలకు కారణాలు దేశం లో కొనసాగుతున్న మను వాదం.
ఈ మనువు విగ్రహం రాజస్థాన్ హై కోర్టు ఆవరణలో ఉంది. దేనిని 1989 లో పెట్టారు. VP సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్ప్పుడే రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు పెట్టారు.
ఎందుకు పెట్టారంటే VP సింగ్ గారు మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నారని దానిని నిరోధించడానికి ఆ ఆలోచన ను ప్రజల్లో రానీయకుండా ఉండడటానికి చేస్తున్న పనులలో ఇదొకటి . తరువాత అద్వానీ రథయాత్ర. . PV గారు ప్రధానిగా బాబ్రీ మసీద్ కూల్చి వేత వీటిని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలోని మనువాదులు ఉన్నారని తెలియడం లేదా.
ఎందుకంటే దేశం మనువాద భావ జాలం తో వుంది. అందుకే బాబ్ సాహెబ్ అంబెడ్కర్ గారు అమానుష మను ధర్మ శాస్త్రాన్ని తగల పెట్టారు..
కాంగ్రెస్ పార్టీ , కమ్యూనిష్టు పార్టీలు అక్కడ మనువు విగ్రహాన్ని తీయగలవా. . తీయలేవు. కాకపోతే హై కోర్టును ఇంకొక చోటకు మార్కిజాహ్ గలవు. ఇది వాస్తవం
మనువును ఓడించాలి. రాజకీయ పార్టీలు కృషి చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా కృషి చేయాలి. మనువును ఓడించగలిగితేనే ఇటువంటి అత్యాచారాలు, హత్యచారాలు కొంత వరకు అగగలవు. ఇంకా కొన్ని దశాబ్దాలు పట్టవచ్చేమో.
🙏🙏🙏✊✊✊
మనీషా నిన్ను ఈ దేశపు మనుధర్మం కాల్చి బూడిద చేసింది.
అమ్మ నాన్నలకు కూడ శవాన్ని ఇవ్వలేదు ఈ దేశపు మనుధర్మం.
మన దేశంలో మన బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాదు మనీషా.
దుర్మార్గమయిన మనుధర్మమే అమలవుతుంది మనీషా.
మనీషా ఈ దేశపు రాష్ట్రపతి, PM, CM, మంత్రులు, MP లు MLAలు కలెక్టర్లు, పోలీసులు, రాజ్యాంగం వృధా.
అయినా మనీషా నీ కాలిన శరీరపు రేణువులు గాలిలో వచ్చి దేశభక్తుల హృదయాలలో చేరి అణుబాంబులు గా తయారవుతున్నాయి.
అవును మనీషా
మావి కన్నీళ్లు కాదు.
మా కన్నీళ్ళలోకి వచ్చిన నీ శరీరపు రేణువులు మా కన్నీళ్లను అణుబాంబులుగా మారుస్తున్నాయి.
ఖచ్చితంగా ఈ అణుబాంబులు ఊరుకోవు.
న్యాయం చేస్తాయి.
నిన్ను చంపిన ఈ మనువాదానికి సమాధి కడతాయి.
సమ సమాజానికి పునాదులు వేస్తాయి.
మనిషా బ్రతికి ఉన్నందుకు క్షమించు మనీషా.
న్యాయం కోసం బ్రతుకుతూ యుద్ధం చేస్తాము మనిషా.
సమసమాజాన్ని సృష్టిస్తాం మనిషా.
ఇదే మా నివాళి మనీషా.
మా మనీషా.
🙏🙏🙏✊✊✊
---కాము
5.10.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి