డియర్ మావోయిస్టులారా !
అన్నలు అక్కలు అంటూ మీకు బువ్వ పెట్టిన పాపానికి మా దళిత, గిరిజన, శ్రామిక బతుకుల్నే బలికోరతారా మీరు ? మీ ఉనికి కాపాడుకోడానికి మా వాళ్ళనే చంపాలా.
మీరు చేస్తున్న త్యాగాలకు మా జోహార్లు.. కానీ మీకు బువ్వ పెట్టిన పాపానికి మా దళిత, గిరిజన, శ్రామిక బతుకులే బలికోరతారా మీరు ? ఇదేమి విప్లవం?
తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని దోచుకు తింటున్న ముఖ్యమంత్రులను, మంత్రులను, లక్షల కోట్లు దోచుకున్న ప్రతిపక్ష నాయకులను, విద్యార్థుల రక్తం పేల్చుకు తాగుతూ వేల కోట్లు సంపాదించిన మంత్రులను కనపడ్డవానినెల్ల కాల్చుకు తింటున్న ఎం.పిలను ఎమ్యెల్యేలను చంపడం చేతకాదా మీకు ? ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటు పరం చేస్తున్న PM , CM లను, మంత్రులను ,MP , లను MLA లను చంపడం చేతకాదా మీకు ? డబ్బు , మద్యము బహుమతులు పంచె పార్టీల అధ్యక్షులను, నాయకులను చంపడం చేతకాదా మీకు ?
కష్టమయితే తుపాకులు క్రింద వేసి మౌనముగా వుండండి.. అంతే కానీ మీకు బువ్వ పెట్టిన పాపానికి మా దళిత, గిరిజన, శ్రామికులను చంపకండి.. దానివలన మార్పు రాదు. మాచావులను మీరు లెక్కేసుకుంటే విప్లవం రాదు .
మార్క్స్ , ఎంగెల్స్ , లెనిన్ స్టాలిన్ మావో హొచిమిన్, చేగువేరా, కాస్ట్రో ఆలా అన్నము పెట్టిన వారిని ,దళిత, గిరిజన, శ్రామికులను చంపమని ఎక్కడ రాయలేదే . వారు చేయలేదే . వారు వారి దేశాలలో 20 సంవత్సరాలలోనే విప్లవాలను విజయ వంతం చేసి శ్రామిక వర్గ పాలనను ఏర్పరిచారు.
సెప్టెంబర్ 1947 లోనే CPSU కేంద్ర కమిటీ , CPI నాయకులు డాంగే, పిసి.జోషి లకు కమ్యూనిష్టు పార్టీ పేరును లేబర్ పార్టీ గా మార్చి పని చేస్తే బాగుంటుందని చెప్పిన సూచనను , కుల నిర్మూలన కమ్యూనిష్టు పార్టీ కర్తవ్యము అనే సూచనను ఎందుకు తీసులోలేదు . తీసుకుంటే దేశం ఎపుడో మారిపోయేది కదా. మార్పు ఎపుడో వచ్చేది కదా.
మన దేశంలో కమ్యూనిష్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలయినా , నక్సల్ బరి వెలుగులో 50 సంవత్సరాల క్రిందట ఏర్పడిన ML పార్టీ , ఎందుకు మన దేశంలో శ్రామిక వర్గ పాలనను తీసుకు రాలేక పోయినాయని సమీక్షించు కోవాలి. తరువాత అనేక కమ్యూనిష్టు , విప్లవ పార్టీలు ఏర్పడి శ్రామిక వర్గ పాలనను తీసుకు రాలేక పోయినాయని సమీక్షించు కోవాలి.
అంతే కానీ మీకు బువ్వ పెట్టిన పాపానికి మా దళిత, గిరిజన, శ్రామికులను చంపకండి. దాని వలన విప్లవము రాదు. ప్రజస్వామ్యము రాదు. సోషలిజము రాదు. శ్రామిక వర్గ పాలన రాదు.
విప్లవం వర్ధిల్లాలి .
ప్రజస్వామ్యం వర్ధిల్లాలి.
డబ్బు, మద్యము , బహుమతులు పంచె వాళ్ళు నశించాలి
జోహార్ అమర వీరులకు జోహార్
కామేశ్వర రావు
ఇండియన్ లేబర్ పార్టీ
అంబెడ్కర్ ఫూలే
అధికార ప్రతినిధి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి