74 వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.
కానీ స్వాతంత్ర దినోత్సవం నాడు ఇంకా పాడవోయి భారతీయుడా అని పాట పాడుకుంటున్నాము
ఈ పాట ఎపుడు ఆపేస్తామో అర్ధం కావడం లేదు.
మనం ఈనాడు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మన స్వతంత్రం ఎంతోమంది త్యాగ ఫలితం. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఉరి కంబాలను ముద్దుపెట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు తుపాకీ గుండ్లకు బలి అయినారు. ఇంకా ఎంతో మంది ప్రాణత్యాగాలు పోరాటంలో చేసారు. జైల్లో మగ్గారు. లాటీ దెబ్బలు తిన్నారు. మన స్వతంత్రం పోరాటంలో గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభాయి పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఎంతోమంది జైలు జీవితం గడిపారు. వారి అందరి కృషి ఫలితమే స్వతంత్రం. మరి వారి పోరాటాల ఫలితంగా వచ్చిన స్వతంత్ర భారతావనిలో ఏమి జరుగుతుంది.
వ్యసాయిక రంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్య వైజ్ఞానిక, అనేక రంగాలలో కొంత అభివృద్ధి జరిగింది. కాని జరగాల్సినంత జరిగిందా అంటే జరగలేదు అని చెప్పలిసిందే. అవినీతి, రాజకీయాలలో అవినీతి నిరుద్యోగం, ఇంకా నిరక్షరాస్యత, మతన్మాదం దేశాన్ని పట్టి పీడుస్తున్నాయి. దేశాన్ని పట్టి పీడుస్తున్నాయి.
మన ప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు అవినీతి పరులను ఎలక్రటిక్ స్తంబాలకు కట్టి ఉరి వేయాలన్నారు. కాని మనం ఆ స్తాయికి ఎదిగామా అని ప్రశ్నించు కోవాలి.
నిరక్ష్యరాస్యత , నిరుద్యోగం, ఆకలి చావులు, ఆత్మ హత్యలు,. స్త్రీ ల ఫై , దళితులపై, దుర్మార్గాలు. చూస్తోనే ఉన్నాము.
ప్రజాస్వామ్యాన్నీ , రాజ్యాంగాన్నీ , కాపాడు కోవలసిన బాద్యత, ప్రజా తంత్ర వాదులు, కార్మిక సంఘాలు, దేశాభక్తులపైన ఉంది.స్వేచ్ఛా, సమత , మమత ప్రగతి, శాంతి, నిజాయతీ ల కొరకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
రాజకీయ పార్టీలు డబ్బు మద్యము బహుమతులు పంచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యము చేస్తున్నారు. శాడిస్టులు గా తయారయ్యారు. పూర్వ ఎన్నికల అధికారి జె.ఎం. లింగ్డో గారు చెప్పినట్లు ఈ దేశంలోని రాజకీయ నాయకులు దేశానికీ పట్టిన క్యాన్సర్లు. క్యాన్సర్లను తీసివేసినపుడే ప్రజస్వామ్యము వర్ధిల్లుతుంది. స్వాతంత్ర సమర యోధులకు నిజమయిన నివాళి అర్పించినట్లవుతుంది. అదే నిజమయిన నివాళి.
ప్రజాస్వామ్యాన్నీ , రాజ్యాంగాన్నీ , కాపాడు కోవలసిన బాద్యత, ప్రజా తంత్ర వాదులు, కార్మిక సంఘాలు, దేశభక్తులపైన ఉంది.స్వేచ్ఛా, సమత , మమత ప్రగతి, శాంతి, నిజాయతీ ల కొరకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
వైద్యము ప్రవేటు అయిపొయింది. WHO సూచనల ప్రకారం వెయ్యిమందికి ఒక డాక్టరు ఉండాలి. ఇంతవరకు మనం అందుకో లేకపోయాము.. కేరళలో మాత్రం చేయగలిగారు. కరొనను కట్టడి చేయగలిగారు. ఇతర రాష్ట్రాలు సిగ్గుపడాలి. మన తెలుగు రాష్ట్రాలు ఇంకా సిగ్గుపడాలి.
ఇంకా బానిసత్వాని, సమర్ధించే నాయకులు వారి వంది మాగధులు ఉన్నారు. అలాంటి వారివలన ఈ స్వతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వాళ్ళకు మనం ఏమి నివాళి అర్పిస్తున్నాము. దండలు వేసి, జన గణ మన పాడేసి, జండా అవిష్కరించేసి అయి పోయింది అంటున్నాము. ఈనాటి కొంతమంది నాయకులకు మన స్వతంత్ర జెండాను ఆవిష్కరించే అర్హత కూడలేదు.
అయిన మన దేశంలో, సమత కోసం, మమత కోసం, ప్రగతికోసం కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారు. వారి కి మన నివాళి.
స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ఇంక సమత కోసం, మమత కోసం, ప్రగతికోసం కృషి చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి జోహార్లు చెబుతూ, వారి బాటలో నడడమే ఈనాటి మన కర్తవ్యము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి