2, మే 2015, శనివారం


28 .4 .2015 న బ్రహ్మం గారి ఆరాధనా. రాస్త్ట్రం లోను, దేశంలోనూ బ్రహ్మం గారి అభిమానులు బ్రహ్మం గారిని దేవుడిగా ఆరాధించేవారు, సామజిక మార్పుకు కృషి చేసిన మహానుభావుడు గా చూసే వారు, విప్లవకారుడిగా, భావించే వాళ్ళు, కమ్యునిజం దార్సినికుడుగా భావించేవాళ్ళు, బ్రహ్మంగారిమఠం కు వెళ్లారు. అలాగే బ్రహ్మంగారి దేవాలయాలకు వెళ్లి నమస్సులు తెలియ చేసారు.
నేను మా వూరు వెళ్లి అక్కడ కడుతున్న గుడిని చూసాను.. ఆక్కడ నేను రూపొంచిన ఫ్లెక్స్ నీ పెట్టాను.
నేను 18 .5 . 2010 న కమ్యునిజం దార్శనికుడు అని రాసాను. నేను వారిని కమ్యునిజం దార్సినికుడుగా భావిస్తాను. దానిని తిరిగి నా జిజ్ఞాస తరంగాలు పుస్తకంలో పూర్తిగా ప్రచురించడం జరిగింది.
ఈ సందర్భంగా తిరిగి పోస్ట్ చేస్తున్నాను. అభిప్రయాలు రాయగలరని ఆశిస్తున్నాను
23.1.2011న హైదరాబాదు సిటీ సెంట్రల్ లైబ్రరీ లో నా పుస్తక ఆవిష్కరణ సభలో. ఈ వ్యాసం మీద, కీర్తి శేషులు .డాక్టర్ సాహిత్య బ్రహ్మ వి.వి.ఎల్ నరసింహారావు గారు. చెబుతూ ( రాసి ఇవ్వడం జరిగింది) " సద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ని కమ్యునిజం దార్శనికుడు గా ప్రస్తావించడం కొంతమందికి విలక్షణంగా కనిపించినా -- బ్రహ్మేంద్రుని సూక్తులలో "బీద ధనవంతులోకటిగా అయ్యే యోగం కూడా వస్తుందనే భావన -17 వ శతాబ్ది నాటికి విశిష్ట మైందే. 19, 20 శతాబ్దాలనాటి కమ్యునిస్టు సిద్ధాంతల్లో ఈ భావం సుప్రసిద్ధ మైందే. కుల మతాతీతమైన విశ్వ మానవ సౌభాతృత్వం వీర బ్రహ్మేంద్రుని సిద్దాoతంలో ప్రధానాంశంమే. దళితుడయిన కక్కయ, మహామ్మదీయుడయిన సిద్దయ ఆయినకు ముఖ్య శిష్యులు కావాడం ఆ సిద్ధాంత ఆచరణ ఫలమే కదా! ఇటువంటి విశాల దృక్పధంతోనే ఈ వ్యాసం రాయడం జరిగింది. వీరన్నట్లు - వీరి జ్ఞానం భవిషత్తు సృష్టిస్తుంది. సూచిస్తుంది" మానవభుద్య రచనశిల్పి శ్రీ వేల్పూరి శ్రీ విశిష్ట జిజ్ఞాస. అంటూ రాసారు.
వారికి నా నమస్సులు.
మీరు నేను రాసిన ఈ వ్యాసం చదవండి. .అభిప్రయాలు రాయగలరని ఆశిస్తున్నాను
Kamu's readings, views and comments's photo.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి