27, మార్చి 2015, శుక్రవారం

comment on Communist parties


నాకు ఒక డౌట్ వస్తుంది.
ఏమిటంటే పరోక్షంగా నో, ప్రత్యక్షంగానో కమ్యునిస్ట్ పార్టీల నాయకుల కార్యకర్తల సహయం లేకుండా చంద్ర బాబు నాయుడు, టి.డి.పి,-- కే.సి.అర్ టి.ఆర్ ఎస్. ---జగన్ మోఅహన్ రెడ్డి వై. ఎస్. ఆర్ .సి.పి ఇంత కాలం ఉండగలవా, నిలవ బడ గలవా. . లేదనిపిస్తోంది. కమ్మ కమ్యునిస్టులు, రెడ్డి కమునిస్తుల, దొర కమునిస్తుల సహాయం పరోక్షంగా నో, ప్రత్యక్షంగానో లేకుండా ఆ పార్టీలు ఇంత కాలం ఉండలేవు. ఎందుకంటేఈ పార్టీలకు ఒక రాజకీయ సిద్దాంత భూమిక లేదు. గాంధీ, ,నెహ్రు, లోహియ , అంబేద్కర్ మార్క్స్ ఇంకేమయిన రాజకీయ సిద్దంత భూమిక లేదు. అయిన ఇంతకాలం ఉన్నయంటే వీళ్ళే ఆ పార్టీలకు అక్ష్సిజన్. కమూనిస్ట్ పార్టీలు తమ ను నాసనం చేసుకుంటూ వీళ్ళను వీళ్ళ పార్టీలకు పరోక్షంగా నో, ప్రత్యక్షంగానో సహాయం చేసారు. అభి వృద్ది చేసారు. అదే కుల వ్యవస్థ. ప్రభావం.
బ్రాహ్మణ, వైశ్య, రాజుల కమ్యునిష్టుల వలన బి. జే. పి ఇక్కడ పునాది వేసు కోగాలుగుతుంది. నాకు తెలిసన కమ్యునిస్టు సోదరులు/ అభిమానులు అభి మానులు కూడా బి.జే.పి మోడీ , కి ఓటు వేసారు. ఎనుకంతే సోనియా గాంధి ఇటలీ అంట. అది వారి కమ్యునిస్టు సోదరులు/ అభిమానుల సిద్దాంతం. సిగ్గు పడాలి. ఇందిరా గాంధి పార్శి పిరోజ్ గాంధిని చేసుకుంది. తరువాత రాజీవ్ గాంధి ఇటలి క్రిస్టియన్ సోనియా గాంధిని చేసుకున్నాడు. అది అభివృద్ధి కరమయిన విషయం ఇక్కడ రాబర్ట్ వాడ్ర అవినీతిని సంర్దిస్తున్నట్లు కాదు. ఆ ఓటు వేసిన కమ్యునిస్టు సోదరులు/ అభిమానులు రాబర్ట్ వాడ్ర అవినెతి గురించి చెప్పలేదు. సోనియా ఇటలీ అని వేస్సారు. మన కుల రహిత, మత రహిత అంతర్జాతీయ దృక్పధం ఏమయింది.
నేను కూడా మొదటిసారి టి.డి.పి ఓటు వేసాను. ఎందుకంటే ఆనాడు ఎన్ టి. అర్ మద్యాన్నీ రద్దు చేస్తాన్నాడు. అందుకే వెసాను. తరువాత వేయలేదు.ఓటే వేయలేదు.క్రీందటి సారి ఆప్ కు వోట్ వేసాను. అవినీతికి వ్యతిరేకంగా, ఎన్నికల్లో డబ్బు, మందు, బహుమతులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపాన్నీ ఇస్తుంది కాబట్ట్టి.
ఇపుడు కమ్మ కమ్యునిస్టులు, రెడ్డి కమునిస్తులు , దొర కమునిస్తులు వారి అనుయాయులు ఆ పార్టీలను లేకుండా చేస్తేనే ఈ రాష్ట్రాల్లో, దేశం లో కమ్యునిస్ట్ పార్టీలను తిరిగి చూడగలం. ఆ కర్హవ్యన్నీ ప్రజాస్వామ్యం కోసం, దేశం కోసం రాజ్యంగం కోసం నిర్వహించాలి.
ఇది పెద్ద కష్టమయిన పని కాదు.
1) ముందుగా లెఫ్ట్ ఫ్రంట్, లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఏర్పడటం.
2) అన్ని సీట్లకు పోటిచేయడం.
3 ) డబ్బు, మందు, బహుమతులకు వ్యతిరేకంగా తీవ్రంగా పని చేయడం.
4 ) అవినీతిపై తీవ్రంగా నిరంతర పోరాటం. పార్టీలో కూడా అవినీతి పై. నిరంతర పోరాటం.,
ఒక రెండు సంవత్సరాల అమ్ ఆద్మీ పార్టీ ఒక పెద్ద బి.జె . పి ని ఓడించగలిగింది. 70 సంవత్సరాల కమ్యూసష్టు పార్టీ/ పార్టీలు చేయలేవా. ఎన్నో త్యాగాలు చేసిన పార్టీలు చేయలేవా.
చేయగలవు
ఐక్యత, పట్టుదల, నిజమయిన పోరాట దృక్పదం కావలి.అవన్నీ ఉన్నయీ. కాని ఈ దేశం లో ఉన్న కులం కమ్యునిస్ట్ పార్టీలను నాశనం చేసింది.
ఆ పార్టీలను ఓడిస్తేనే నిజమయిన వామ పక్ష ఐక్యత కోరుకున్నట్లు, పని చేస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. ఆ కర్తవ్యాన్నీ మోయల్సిందే. చేసిన తప్పులకు అదే పరష్కారం. అదే విప్లవం. అదే మార్పు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి