20, మార్చి 2015, శుక్రవారం

ugadi kavitha

ఏమిటో ఉగాది వస్తుంది. అందరు కవితలు రాస్టారు.
నాకు రాయాలని ఉండదు.
ప్రయత్నిస్తుంటే
నాముందుకు ఆత్మహత్య ఘోషలు.
హంతకుల హత్యలు.
అరాచక వాదుల, అవినీతిపరుల హత్యలు దురాగతాలు.
మార్పు కోసం ప్రయత్నిస్తున్న కామ్రేడ్స్, దేశభక్తుల, ప్రజాతంత్ర వాదుల చావులు.
నిజాయతి పరుల చావులు నిరాశతో ఆత్మహత్యలు
నాముందుకు వచ్చి మాగురించి ఏమిటి అని
నా తలకాయ మీద కొడుతున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న హంతకులు.
మన ప్రియమయిన రాజ్యంగాన్నీ తగల బెడుతున్న దుర్మార్గులు,
కళ్ళముందు కనిపిస్తుంటే
ఏమి శుభాకాంక్షలు తెలిపేది.
అంత హిపోక్రసీ నావల్ల కావడం లేదు.
ఏమి చెప్పమంటారు.
శుభాకాంక్షలు.
బహుశా నాశవం కూడా చెప్పలేదేమే. శుభాకాంక్షలు.
ఏమో ఎదురు చూడండి
నా శవం చెబుతుందేమో.
నాకు తెలియదు నా శవం ఏమి చేస్తుందో.
----------------------
నా శవం కూడా శుభాకాంక్షలు
చెప్పనంటుంది..
------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి