27, నవంబర్ 2014, గురువారం

on Sri. Si.

"కవిత్వానికి బాదే పర్యాయ పదం " అన్నారు మహా కవి శ్రీ శ్రీ.
" కస్ష్టజీవికి అటు ఇటూ ఉండే వాడే కవి" అని స్పష్టంగా చెప్పారు శ్రీ. శ్రీ.
మానవ సమాజం పై ఎంతో గౌరవం.
వారి సామజిక స్ప్రహ ఆకాశం అంత ఎత్తు. -- ఓక సంఘటన రాయాలని, చదివిన దగ్గరనుంచి రాయాలని ఉంది. ఈ రోజు రాస్తున్నాను. ఈ విహయాన్ని, కాశీపతి గారి మధ్యతరగతి మందు హాసం అనే పుస్తకం లోచదివాను. నాకెందుకో పుస్తకం పేరు బాగాలేదు. కానీ చదవాల్సిన పుస్తకం.

1980 లో నిర్మాత దర్శకులు యు. విశ్వేశ్వర రావు తానూ తీయబోతున్న సినిమాకు పాట రాయాలని ఆ రోజు హైదరబాద్ లో ఉన్న శ్రీ. శ్రీ గారి వద్దకు వచ్చి కోరారు. శ్రీ శ్రీ గారు ఆ రోజు అన్నపూర్ణ హోటల్ లో కాశిపతి గారితో ఉన్నారు. పాట, షూటింగ్ వలన ఆ రోజు లో పూర్తి గావాలని చెప్పారు. రాత్రి 8 గంటలకు చెప్పారు.
అందరికి తెలుసు శ్రీ శ్రీ తాగు తారని. తాగి పాటలు రాస్తారని.
శ్రీ శ్రీ గారు రాసారు. పల్లవి ఏమని రాసారు చూడండి.
కులం లేదు.. మతం లేదు.
దరిద్రానికి...
నరం లేదు. జనం లేదు
సమాజానికి. ---అనేది పల్లవి.
విశ్వేశ్వరరావు గారు చెప్పినట్లు రాత్రి మూడు గంటలకు ఇచ్చారు. విశ్వేశ్వరరావు గారు ఫ్లైట్ టైం అందించారు. విశ్వేశ్వర రావు గారు విమానశ్రయానికి వెళ్లిపోయారు.
శ్రీ శ్రీ గారు అలసి నిద్ర పోయారు.
కాని అకస్మాతుగా శ్రీ శ్రీ గారు లేచి తప్పని పరిస్తితులలో, నిద్ర పోతున్న కాశిపతి గారిని లేపి అర్జెంటు గా ఏరో పోర్ట్ కు వెళ్ళాలని లేపారు. పాటలో తప్పు జరిగి పోయింది. అని బాదతో లేపారు.
ఏరో పోర్ట్ లో ప్లైట్ టేకాఫ్ కు రెడి గా ఉంది. శ్రీ శ్రీ గారు, విశ్వేశ్వరరావు గారు శ్రీ శ్రీ గారిని ఎయిర్ లైన్స్ కార్యాలయం వద్ద కలవాలని ప్రకటన చేయించారు.
నేను ఇక్కడ పుస్తకం లోని విషయాలు మొత్తం రాయలేను. ముఖ్యమయిన పేజీ స్కాన్ చేసాను.

శ్రీ శ్రీ గారిని ఎన్నో మాటలు. వి. రా గారు అన్నారు. అవన్నీ నేను రాయలేను.
కానీ శ్రీ శ్రీ గారి బాద తను రాసిన
నరం లేదు. జనం లేదు
సమజానికి. -----దానిపై న తన అభ్యంతరం.
దానికి వివరణ ఏమన్నారంటే. - మనం సమాజానికి నరమూ లేదు జవమూ లేదంటున్నాము. ఇది చాల అభ్యంతరకరం. ..... సమాజం లోని లోపాలను సమస్యలను, సంక్షోభాలను మరే పరిస్తులనై న ఆ సమాజమే పరిష్కరిస్తుంది. అదే సామాజిక చైతన్యం. ...... ఆ సామజిక చైతన్యా న్ని మనం ప్రశ్ని స్తున్నాము. సమాజపు ఉనికేనే సందేహిస్తున్నాము. ఇది హిమాలయం అంత తప్పు. అని వివరించారు.
శ్రీ శ్రీ గారి అభిప్రాయం తో ఏకీభవిం ఛిన విశ్వేశ్వర రావు గారు. రాసిన ఆ పాటను చించి వేసారు.
చూడండి. శ్రీ శ్రీ గారు .తాగినా పాట రాసారు, ఇచ్చారు. నిద్ర పోయారు కొంచెంసేపు. కాని నిద్ర పోకుండా మేల్కొని జరిగిన తప్పు తెలుసు కొని, దానిని చించి వేయడానికి ఆయన పడ్డ తపన, వేదన. అందరికి ఉండాలి. వి.రావు గారు ఎమన్నా భరాయించి, తను రాసిన పాటను చింపే టట్లు చేయడం మామూలు విషయం కాదు. సమాజాన్ని, గౌరవించే వాళ్ళే చేయగలరు.
రచయితలు శ్రీ శ్రిని గౌరవించడం తో సరిపోదు. సమాజం కోసం, సామాజిక మార్పుకోసం వారి పడిన తపన, కృషిని మనం పొందాలి. ఆ విధంగా కృషి చేయడమే శ్రీ. శ్రీ కి మనమిచ్చే నివాళి.
ఇది రాయాలనే ఈ పుస్తకం చదివన నాటినుంచి అనుకుంటున్నాను.నా మెదడు ప్రతి రోజు నన్ను తిడుతుంది.
ఎక్కువయిన నా బరువు దించు కోవడానికి చేసిన ప్రయత్నమే ఇది.
మీకు తెలియడానికి ఆ పుస్తకం లోని పేజీ నీ స్కాన్ చేసి పెట్టాను.(అది మొత్తం 6 పేజీలు).
చదవండి. శ్రీ శ్రీ గారికి సమాజం పట్ల ఎంత గౌరవం.

Photo: "కవిత్వానికి బాదే పర్యాయ పదం " అన్నారు మహా కవి శ్రీ శ్రీ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి