16, అక్టోబర్ 2014, గురువారం

on Nithin Ghadkare.statement

నితిన్ ఘడ్కరి. ఒక మంత్రి. చాల కాలం బి.జే.పీ కి అద్యక్షులు.
మహారాష్ట్ర ఎన్నికల సభలో మాట్లాడిన మాటలు తినండి, తాగండి, ఓటేయండి. అని పిలుపు ఇవ్వడం దేనికి సంకేతం. బి.జే.పీ ఈ దేశ, రాజ్యాగం మీద, ఎలక్షన్ కమిషన్ మీద గౌరవముందా, అనే ప్రశ్న నాకే కాదు అందరికి రావాలి.
నితిన్ ఘడ్కరి ఎలక్షన్ కమిషన్ ను చాలెంజి చేస్తున్నాడు. ప్రజాస్వామ్యాని పరిహసిస్తున్నాడు. ఒక నియంతగా మాట్లాడుతున్నాడు.
ఏమి చేయాలి. ఇలాంటి వారిని.
ఎన్నికల నిబంధనల కనుగుణంగా 171 బి.ఇ ప్రకారం ఒక సంవత్సరం జైల్లో పెట్టాలి. ఇది సరిపోతుందా. సరిపోదు. దెశ ద్రోహం క్రింద జైల్లో పెట్టాలి.
ఇది ఎన్నికల కమిషన్ కు , దేశభక్తులకు ప్రజస్వామ్యా వాదులకు ఓక చాలెంజి.
మీరు ఏమి చేస్తారు. అని ఛాలెంజ్ చేస్తున్నాడు మంత్రి హోదాలో ఉన్న ఒక అరాజకీయ, అరచాకీయ వాది.
ఇపుడు అయన ఛాలెంజ్ చేసాడు. మనమేమి చేయాలి అని దేశభక్తులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించుకోవాలి. కార్యాచరణ రుపొందించు కోవాలి.
అంబేద్కర్, భగత్ సింగ్, గాంధి నెహ్రు మొదలైన వారు రావాలని కోరుకోవడం సరి అయినది కాదు. మనమే అంబేద్కర్, భగత్ సింగ్, గాంధి నెహ్రు లాగ కావాలి.కార్యాచరణ రూపొందించు కోవాలి. దేశాన్ని కాపాడుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి