29, అక్టోబర్ 2014, బుధవారం

జ్ఞానం లో ఇబ్బంది

జ్ఞానం పెంచుకొనే కొలది, వత్తిడికి లోనవడం జరుగుతుంది. 
భారం పెరిగి పోతుంది. సుఖం కోల్పవడం జరుగుతుంది.
అందుకునేమో తెలుసుకోకుండా ఉండటమే సుఖం అన్నారు కొంతమంది 
కాని జ్ఞానం సుఖాన్నీ ఇవ్వకపోయినా ఆనందన్నీ ఇస్తుంది. 
నా దృష్టిలో సుఖం వేరు - అనందం వేరు. 
కష్టం లో కూడా ఆనందన్నీ చూడగలం. ఆనందం గా ఉండగలం. 
కానీ కష్టం లో సుఖన్నీ చూడలేము. దుఃఖాన్నే చూడగలం 
అదే తేడా. 
కానీ జ్ఞానం ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏడిపిస్తోంది.
కళ్ళ వెంట నీళ్ళు తెప్పిస్తోంది .
కానీ కర్తవ్యాన్నీ గుర్తు చేస్తుంది.
తప్పులు చేస్తుంటే హెచ్చరిస్తోంది..
దెబ్బలు కొడుతుంది.
తట్టుకోలేక మౌనంగా ఉండడమే చేస్తాము.
అదొక భయంకరమయిన పరిస్తితి..
అమ్మో తలచుకుంటేనే భయం వేస్తుంది.
అందుకే మౌనమే శరణ్యం అవుతుంది.
ఎందుకంటే సమాజం మనం అనుకున్న విధంగా ఉండదు. నడవదు.
ఆ ఘర్షణ లో మనిషి నలిగి పోతాడు.
ఆ క్రమంలో మనిషి మౌనాన్నీ ఆశిస్తాడు.
అది తప్పించుకోవడమే కావచ్చు. అది తప్పని పరిస్తితి.
లేకపోతే మరొక ఊబిలోకి పోవడం జరుగుతుంది.
మౌనమే. ఆ పరిస్తీలొ చేయగలిగేది.
అది ద్యానం కావచ్చు. మెడిటేషన్ కావచ్చు.
దానిని తప్పించుకోవడం అంటారు కొంతమంది.
తప్పదు. ఏమిచేస్తాం. అలా అనేవారు తిట్టన భరాయిస్తాo.
అది కూడా మెడిటేషన్ లో భాగం అయిపోతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి