21, అక్టోబర్ 2020, బుధవారం

on acquiring of land

 

అమరావతి రాజధానికి అని గుంటూరు, కృష జిల్లాలోరైతులు దాదాపుగా 34500 ఎకరాలు ఇవ్వడం స్వచ్చందంగా ఇవ్వడం జరిగిందని మంత్రులు చెబుతున్నారు. రైతులునుంచి ఎక్కువ వ్యతిరేకత రాలేదు అనిచెప్పడం జరుగుతుంది. వాస్తవమే అని అనిపించవచ్చు.
కాని మల్లన్న సాగర్ వద్ద రైతులు గ్రామ ప్రజలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నందిగ్రామ్ వద్ద ఎందుకు రైతులు ఎందుకు తుపాకికాల్పులకు వ్యతిరేకంగా నిలిచారు.
కొంత పరిశీలన అవసరం.
కృష్ణ, గుంటూరు జిల్ల్లలలో దాదాపుగా 90 శాతం భూమి అగ్ర కులస్తుల చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా కమ్మ భూస్వాములచేతిలోనే ఉంటుంది. పట్ట కాగితాలు వాళ్ళ చేతిలో వుంటాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అమలుచేసిన కౌల్దార్ చట్టాలుకాని, భూ పరిమితి చట్టాలు కాని ఆంధ్రప్రదేశ్ అమలుకాలేదు. అమలుకావు కూడా. ఎందుకంటే అన్నిపార్టీల నాయకులు టిడిపి , వై.ఎస్.ఆర్ సి పి, బిజెపి , కాంగ్రెస్, లోకస త్తా, ఆప్ , చివరికి కమ్యునిష్టు పార్టీల నాయకులతోసహా వారే కాబట్టి అమలు చేయరు. అమలు కోసం విజయ వంతం అయేవరకు పోరాటాలు చేయరు
కమ్మ భూస్వాముల కుటుంబాలు 3దశాబ్దాలు గా అభివృద్ధి అవడానికి ఆభూములు ఉపయోగ పడినాయి. వారిపిల్లలు ఎక్కువమంది ఇతరదేశాలలో స్తిరపడటం, వ్యయసాయేతర రంగాలలోఅభివృద్ది అవడం జరిగింది. భూములు కౌలుకు ఇవ్వడం చేస్తూ వచ్చిన సొమ్మును తీసుకోవడమ జరిగింది. అసలు వారికి ఆ కౌలు కూడా అవసరం కూడాలేదు. ఎందుకంటే బాగానే అభివృద్ధి అవడం జరిగింది. ఏవో కొన్ని కుటుంబాలు వ్యయసాయం చేస్తూ జీవిస్తున్నారు. అందువలన ఎక్కువమంది ఇపుడు ఆ పట్టా కాగితాలు ప్రభుత్వం చేతిలో పెట్టి డబ్బులు తీసుకోవడం ఇచ్చిన పాకేజి తీసుకోవడం జరిగింది. అన్ని పార్ర్తీల నాయకులు కూడా తీసుకున్నారు ఇంకా పార్టీల ఆఫీసులకు కూడా స్తలాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
ఇది వాస్తవం వ్యయసాయన్నీ వద్దను కోవడం సరి కాదు. ముక్యంగా ప్రభుత్వం ఆ విదంగా ఆలోచించడం సరి కాదు. తిండి ఎట్లా
కాని ప్రభ్తుత్వం ఆ బూములమీద పని చేసిన జీతగాండ్లు, వృత్తి దారులు, కౌలు దారులు, వ్యయసాయ కూలీలు నిమ్న కులస్తులు వారి పని గురించి వారి ఆత్మ గౌరవం గురిం ఛి పట్టించు కోవడం జరగలేదు. యు పి ఎ ప్రభుత్వం లో ఉన్న సామజిక వారు కొంత సామజిక స్పృహ కలిగిన వాళ్ళు 20 13 లో మంచి చట్టం చేసారు. దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు . అంతే కాదు కేంద్ర ప్రభుత్వం నియంచిన శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన రేపోర్ట్ ను అసలు పట్టించుకోలేదు . ఒక ప్రభుత్వం ఇలా చేయడం సరి కాదు.
ఎదో ఒక వ్యాపార వేత్త, ఎదో కులపోల్లు చేసారు అంటే సరే కాని ప్రభుత్వమే ఈ విధంగా చేయడం సరి కాదు. వాళ్ళ సామాజిక వర్గం అధికారం లో ఉంది కౌల్ దారు చట్టం అమలు చేయకుండా , అమలు కానీయకుండా, పట్టా కాగితాలు చేతిలో పెట్టుకొని ఇతర సామజిక వర్గాల ప్రజలకు ఆత్మగౌరవం లేకుండా చేయడం వారికి ఉపాది లేకుండా చేయడం, దుర్మార్గం. దీనికి కారణం అన్ని పార్టీల నాయకులు ఆ సామజిక వర్గా నికే చెందిన వారు కావడం వలన ఇంత సామాజిక కోణం అర్ధం కావాడం లేదు. అందుకే 20 13 చట్టాన్నీ, శివరామ కృష్ణన్ రిపోర్ట్ ను ప్రక్కన పెట్టిన పెద్దగా పట్టించు కోలేదు. అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భూ సేకరణ సులభం అయిపోయింది .
కాని ఇది సరి కాదు.
బెంగాల్ లో కోల్ దారు చట్టం అమలు చేయడం వలన భూమి అందరి చేతిలో ఉంది. వారి జీవనా దారం భూమి. అందువలన ప్రతిఘటన వచ్చింది.
మల్లన్న సాగర్ కోసం జరుగుతున్న భూ సేకరణ కూడా ప్రజల నుంచి వ్యతిరేక తకు కారణం వారి జీవనాదారం భూమి.
అందుకనే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేసిన 20 13 చట్టం ప్రకరం భూసేకరణ చేయడం సరి అయినది. అంతే కాని వ్యాపార వేత్తలాగా చేయడం సరి కాదు.
ప్రజలకు ఇతర సామాజిక ప్రజలకు, గ్రామీణ పేదలకు, వృత్తి దారులకు విచారాన్ని మిగల్చడం సరి కాదు. మన ప్రియమయిన రాజ్యంగా స్పూర్తికి వ్యతిరేకం.
దీనిని నిజమైన దేశభక్తులు , ప్రజాతంత్ర వాదులు , దళితలు, బిసిలు , కూలీలు, గ్రామీణ పేదలు, కార్మిక వర్గం ప్రజలు అధ్యనం చేసి 20 13 భూ సేకరణ చట్టం ప్రకారమే భూ సేకరణ జరుపుటకు ఆందోళన లు చేయాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌల్ దారు చట్టం అమలు చేయలేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు ప్రబుత్వం చేసిన భూసేకరణ కౌల్ దారు చట్ట వ్యతి రేక మయినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శివరామ కృష్ణన్ రిపోర్ట్ ప్రకారమే రాజదానిని నిర్మించాలి. అంతే కాని వ్యాపారం, టెండర్ల ఓపెనింగ్ చేయడం కాదు ప్రభుత్వాలు చేయాల్సింది. ప్రజలకు ఆత్మా గౌరవ జీవితాల్ని అందించాలి.
దీనిపై చరిస్తారని ఆశిస్తున్నాను.
కామేశ్వరరావు
ఇండియన్ లేబర్ పార్టీ (అంబేద్కర్ , పూలే )
అధికార ప్రతినిధి .

No photo description available.
Image may contain: 1 person, smiling
No photo description available.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి