TDP,TRS,YSRCP, BJP, Congress, ఇంకా ఇతర పార్టీల నాయకుల్లారా, వారి అనుంగు మిత్రులారా,
ఎందుకు BC లు చట్ట సభలలో ప్రాతినిద్యం వహించ లేక పోతున్నారు? ఎందుకు కమ్మ, రెడ్డ్లు, దొరలు, బ్రాహ్మనలు, రాజులు, ఇంకా ఇతర ఆధిపత్య కులాల వాళ్ళే చట్ట సభలలోకి వెళ్ళ గలుగుతున్నారు? SC లు, STలు రాగాలుగు తున్నారంటే వారికి ప్రాతినిద్యం వుండే విధంగా రాజ్యాంగం ప్రకారం రాగాలుగుతున్నారు. అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కృషి. మీ కృషి కాదు.
మరి BC లకు ఎందుకు చట్ట సభలల్లో 52 శాతం ప్రాతినిద్యం ఉండేటట్లు చట్టం చేయ లేకపోయారు.
BC లు స్త్రీలు, ఎస్.సి, ఎస్.టి లు రాజకీయంగా ఎదిగితేనే దేశం బాగుంటుందని ప్రముఖ సోషలిస్ట్ నాయకులు రామ మనోహర్ లోహియా చెప్పారు కదా. ఎందుకు వారిని అనుసరించ లేకపోయారు.
సరే BC లు చట్ట సభలలో ఉండాలా. కులాలు ఏమిటి? అని అడుగుతారు. సరే కులాలు వద్దు.
రాజ్యాంగం లో ప్రజస్వామ్యం , సోషలిజం , సామజిక న్యాయం ఉన్నాయి వాటికొరకు మీరేమయిన కృషి చేసారా.
మరి మీ ప్రభుత్వాలు ఏమి చేసినాయి. చూడండి.
1 మద్యం అమ్మకం.
2. ప్రభుత్వ పరిశ్రమలు మూత వేయడం.
3. విద్య ప్రవేటికరణ . ప్రభుత్వ స్కూల్స్ ను మూత వేయడం.
4. వైద్యం ప్రవేటికరణ. ప్రభుత్వ వైద్య శాలలు నిర్వీర్యం చేయడం.
5.ఎన్నికలలో డబ్బు మద్యం బహుమతులు పంచి ప్రజాస్వామాన్ని చంపేయడం .
6. మీ ఆస్తులు, మీ వాళ్ళ, మీ అనుయాయలు ఆస్తులు పెంచు కోవడం.
ఇవి కొన్ని ముఖ్యమయిన విషయాలు. వాటిని రాసాను.
BC లు మీరు మీ పార్టీల లోనె ఉండండి కాని ఎందుకు BC లకు చట్ట సభలలో ప్రాతినిద్యం లేదని అడగండి. ప్రశ్నించండి. దానికి ఏమి చేస్తారో అడగండి.
BC కుల నాయకుల్లారా, BC సంఘాల నాయకుల్లరా మీరు చట్ట సభలలో 52 శాతం ప్రాతినిద్య సాధనకొరకు కృషి చేయండి. ప్రచార కార్యక్రమలు చేయండి. సదస్సులు పెట్టండి. ఆందోళనలకు సిద్దంకండి. BC లను సిద్దం చేయండి.మేము ఇండియన్ లేబర్ పార్టీ (అంబేద్కర్ ఫూలే) పార్టీ లోకి రమ్మనడం లేదు. వస్తే సంతోషం కాని మీరు ఆధిపత్యకులాల వాళ్ళకు భజనలు మాని ప్రశ్నిం చండి. ఉద్యమించండి.
BC లు చట్ట సభల్లోకి వస్తే సోషలిజం వస్తుందని, ప్రజస్వామ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడం లేదు. కొంత మార్పు వస్తుంది.
రావాలని ఆశించాలి
చట్ట సభలల్లో BC లకు 52 శాతం ప్రాతినిద్యం కొరకు నిజాయతితో పని చేసి చట్టం తేవాలి.
రాజ్యాంగం వర్ధిల్లాలి.
ప్రజా స్వామ్యం వర్ధిల్లాలి.
జై సద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జై.
జోహార్ మహాత్మా జ్యోతి భా ఫూలే జోహార్.
జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్
జోహార్ రామ మనోహర లోహియా జోహార్.
జోహార్ కామ్రేడ్ మారోజ వీరన్న జోహార్.
జోహార్ అమర వీరులకు జోహార్.
కామేశ్వరరావు
కో ఆర్డినేటర్
BC రిజర్వేషన్ల సాదన వేదిక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి