గౌతమ బుద్ధుడు ఎక్కడ దేవతలు రాక్షసులు అనే పదాలు వాడలేదు. చివరికి దేవుడ్ని గురంచి కూడా ఎక్కడ చేప్పినట్లు కనిపించదు. నేను చదివినంత వరకు.
మరి చంద్రబాబు నాయుడు బుద్దుడు బొమ్మ పెట్టి దేవతలు, రాక్షసులు అంటాడు. బుద్దుడిని వ్యాపారం చేయాలను కుంటే గౌతమ బుద్దుడు చెప్పిన విషయాలు చెప్పి వ్యాపారం చేయవచ్చు. కాని బుద్దుడు బొమ్మ పెట్టి ఏమేమి మాట్లాడిన బుద్దిష్టులు వూరు కోవాల్సిన అవసరం లేదు.
అసలు గౌతమ బుద్దుడు, తన రాజదానిని, తన భార్య యసోదర , కొడుకు రాహులను వదిలి ప్రజలు బాధలకు కారణాలు ఏమిటి అని అన్వేష నకు వెళ్తాడు.
బుద్దుడు, చంద్ర బాబు నాయుడు లాగ ప్రపంచం లో ఎక్కడ లేని విధంగా రాజధాని నిర్మాణం, అదే ప్రజల సమస్యలకు పరిష్కారం అని చెప్పలేదు. అసలు తనకున్న రాజధాని నే వదలి పోయాడు.
ఎపుడ యితే బుద్దుడు బొమ్మ పెట్టారో ఇలా తప్పకుండా ప్రశ్నిస్తాం
చంద్ర బాబు నాయుడు , లోకేష్ బాబు, నారయణ బొమ్మలు పెట్టు కొని చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు రావు. ఎవరు వేయరు. వీళ్ళ బొమ్మలు మార్కెట్ కు పనికి రావు కదా.
తరువాత దేవతలు, రాక్షసులు అనే పదాలు వాడితే ఎక్కడో తిరుపతిలోనో, మంగళగిరి పానకాల దేవాలయం వద్దనో, ఏ హిందూ దేవాలయం వూర్లో నో రాజధానిని కట్టు కోవచ్చు కదా. ఎందుకు అమరావతిని తీసుకొని బుద్దుడికి గోరి కడతాడు. ముఖ మంత్రి అయితే ఏమయినా చేయవచ్చు. ఏమయినా మాట్లాడవచ్చు అంటే ఎవరు ఒప్పు కోవాల్సిన అవసరం లేదు. అసలు బుద్దిస్తులు అసలు ఒప్పుకోరు.
అసలు బుద్దుడు ఉంటె చంద్ర బాబు నాయుడు ఏమిటి నువ్వు చేస్తుంది. అని అడుగుతాడు. అసలు పంట భూములను ఎవరు నాశనం చేయమన్నాడు. నేను చెప్పలేదు కదా. ఎందుకు నా పేరు వద్దు కుంటావు అని అడుగుతాడు.
అపుడు చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి గా బుద్దుడ్ని ఎన్కౌంటర్ తో చంపేయమంటాడెమో..
కాని లార్డ్ బుద్దా, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో ఎన్కౌంటర్ లో చంపేస్తే చని పోయే వాడు కాదు. బుద్దుడు. ప్రపంచ ప్రజల హృదయాల్లో ఉంటాడు. కాని చంద్ర బాబు నాయుడు కొంతమంది కి అజ్ఞానపు ఆనందాన్నిస్తూ , ప్రజలను పేదలను, ఇతర ప్రాంత ప్రజలకు విషదానిచ్చే నిర్మించే రాజదాని లో అసలు ఉండడు
అసలు చంద్ర బాబు నాయడు కు బుద్దుడు అక్కర లేదు. బుద్దుడ్ని ఎంతవరకు వ్యాపరం చేయ వచ్చో అంతవరకూ చేస్తాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కదా.
అది సరి అయింది కాదు.
దేవతలు రాక్షసులు బుద్ధా ఎక్కడ చెప్పలేదు.
బుద్దుడు అందరికి మంచి చేయమన్నాడు. BE QUICK TO DO GOOD అని బుద్దుడు చెప్పాడు. అందరికి మంచి చేయమన్నాడు
అసలు బుద్దుడు కోరికలే దుహ్కానికి మూల కారణం అని చెప్పారు. అంటే తాళాలు లేని ప్రపంచ మే శాంతి కి ఆనందానికి మార్గం అని భావన.
రాజ కుమారుడు బుద్దుడు ఒంటరిగా ఎక్కడకయినా వెళ్ళగలదు. చంద్ర బాబు నాయడు పోలిసులు, 14 4 సెక్షన్ ఏమి లేకుండా వెల్ల గలడా .
బుద్దుడ్ని వ్యాపరం చేయకండి. అనే మా విన్నపం.
చేస్తే మటుకు ఇలాగె రాస్తాము.
చంపినా మా శవాలు కూడా ఇలాగే రాస్తాయి.
బుద్ధం శరణం గచ్చామి.
ధర్మం శరణం గచ్చామి.
సంఘం శరణం గచ్చామి.
-------వర్కర్స్ పొలిటికల్ సింగ్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి