పౌరహక్కుల నేత, మానవహాక్కులనేత మహామనిషిబాలగోపాల్ అక్టోబర్ 8, 2009 న చనిపోయారు. వారికి నివాళులు
రాజ్యహింసతోపాటు ప్రైవేటుహింసను ఆయన వ్యతిరేకించాడు. పౌరహక్కుల సంఘం నుంచి ఆయన 1996లో విభేదించి బయటకొచ్చి మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ను ఏర్పాటుచేశారు. ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసీ నక్సలైట్లు రాజ్యహింసకు వ్యతిరేకంగా హింసా కార్యక్రమాలు చేపట్టడాన్ని ఆయన ఖండించారు. రాజ్యహింసతో పాటు ప్రజలపై గుండాలు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు చేసే హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించారు. ఆ తర్వాత క్రమంలో విప్లవపార్టీల వైఖరిని తప్పుబట్టారు. ప్రజలకు చేరువకావడంలో ఎం.ఎల్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఆయన రాసిన 'నక్సల్బరీ ఉద్యమం, గమ్యం, గమనం', 'చీకటి కోణం' పుస్తకాలు సంచలనం సృష్టించాయి.
ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన హత్యానేరం నమోదు చేయాలని ఆయన గట్టిగా వాదించి విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టని పల్లె లేదు, పట్టణం లేదు. అరణ్యాల నుంచి జనారణ్యాల వరకూ ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆయనతప్పనిసరిగా ఆ ప్రాంతానికి వెళ్లి అధ్యయనం చేసేవారు. అందుకే మన భౌగోళిక, నైసర్గిక స్థితిగతులపై ఆయనకున్న జ్ఞానం అపారం. కాలుష్యం, విద్యా వ్యాపారం, సెజ్‌లు, నిర్వాసితులు, మురికివాడలు, కాశ్మీర్ సంక్షోభం, మైనారిటీ హక్కులు, మహిళా హక్కులు, విద్యార్థి హక్కులు, సంప్రదాయ వృత్తులు, అణుపరిజ్ఞానం, గిరిజనుల ఆనారోగ్యం.. ఇలా మన రాష్ట్రం, దేశం ఎదర్కొంటున్న ఏ సమస్యపైన అయినా ఆయన లోతైన అవగాహన కనబరుస్తూ మాట్లాడేవారు.
వారికి నివాళులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి