9, ఆగస్టు 2020, ఆదివారం

నేనొక మార్పును

 August 9, 2019

నేను ఒక మార్పును
-------
నేను
నా బొటన వ్రేలును కోల్పోయిన ఏకలవ్యుడిని,
తలకాయ తీయబడిన శంభూకుడ్ని,
దొంగ దెబ్బతో చంప బడిన వాలిని,
ముక్కు చెవులు కోల్పోయిన శూర్పణఖను,
చదువుకు దూరంగా నెట్టబడిన బహుజనుడ్ని,
కారంచేడు చుండూరు, లక్షింపేట... మృత వీరుడ్ని,
దోపిడీ కులస్తుల దాడికి బలి అయిన పూలన్ దేవిని,
స్కాలర్ షిప్ రాక యూనివర్సిటీలో కుమిలి కుమిలి ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ను
మూక దాడిలో చంపబడిన బహుజనుడ్ని,
కొంతమంది దుర్మార్గాల వలన మానసికంగా
చచ్చి పోతున్న కశ్మీర్డ్ని,
దోపిడీ కులాల వాళ్ళ చేత దోపిడీకి గురికాబడి ఏడుస్తూ బ్రతుకు తున్న బహుజనుడ్ని,
........
చివరికి పోరాటం చేస్తామని చేస్తుంటే
మీ ఆధిపత్య కళ్లకు
నేనొక ఉగ్రవాదిని
అవును నేనొక ఉగ్రవాదిని.
గౌతమ బుద్ధుడు
సద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి,
మహాత్మా జ్యోతి బా ఫూలే,
సావిత్రి బాయ్ ఫూలే,
భగత్ సింగ్ రాజగురు, సుఖదేవ్
బాబా సాహెబ్ అంబేద్కర్
కోరుకున్న
సమసమాజ స్థాపనకై, సామాజిక న్యాయ స్థాపనకై,
రాజ్యాధికారం సాధనకై,
నడుం బిగించిన
పిడికిలి బిగించిన
చైతన్య మూర్తిని.
మీ దృష్టిలో
ఉగ్రవాదిని.
కాని నేనొక మార్పును.
మావి కన్నీళ్లు కాదు
తుపాకి గుండ్లు
మావి ఆవేదనలు కావు
అణుబాంబులు
కామూ
9.8.2019
Image may contain: 1 person
1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి