7, జులై 2020, మంగళవారం

అసలు నేరస్థులు
-----------------
6.12.2019న చంపబడిన ఆనలుగురు మీకు కనిపిస్తున్నట్లు నేరస్థులుగా మృగాలుగా నాకు కనిపించడం లేదు.
నాకు
మద్యం షాపులను తెరచినవాళ్లు,
మద్యాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు,
డ్రైవింగ్ లైసెన్సు లేకపోయినా లారీని నడపమన్న లారీల యజమానులు, పట్టుకొని వదిలివేసిన అధికారులు,
పిల్లలకు చదువు చెప్పించని ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు,
రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ, రాజ్యాంగాన్ని అమలు చేయని PM, CM లు, మంత్రులు, MP లు , MLA లు,
డబ్బు మద్యం బహుమతులు పంచుతున్న రాజకీయ నాయకులు, వాటిని తీసుకొని ఓటు వేస్తున్న జనాలు,
చెత్త సినిమాలు తీస్తున్న నిర్మాతలు, దర్శకులు, నటీనటులు,
చెత్త TV ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న ప్రోగ్రామర్లు, TV వాళ్ళు,
నేరాలకు కారణాలు ఏమిటని ప్రశ్నించని వెలికి తీయని న్యూస్ రీడర్స్, చర్చాగోష్టులను పెట్టేవారు.
వాటిని అలాగే చూస్తున్న జనాలు,
కార్మిక పోరాటాలను ఆర్ధిక పోరాటలకే పరిమితం చేస్తున్న కార్మిక నాయకులు,
కోర్టులలో న్యాయమూర్తులను నియమించని,
కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాలు.
పెరుగుతున్న పనిభారానికి అనుగుణంగా న్యాయమూర్తులను పెంచని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,
అందుకొరకు పోరాడని న్యాయమూర్తులు, న్యాయవాదులు,
కోర్టులకు సెలవులు తగ్గించమని కోరని న్యాయమూర్తులు, న్యాయవాదులు,
గ్రామాలు పట్టణాలు బాగుండాలని, పిల్లలు భాగుండాలని ప్రయత్నించని స్థానిక సంస్థల అధ్యక్షులు మేయర్లు,
ఇంకా మంత్రులు, MP లు MLA లు,
పిల్లలకు మోరల్ సైన్స్ చెప్పని ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు,
స్మార్ట్ ఫోన్, నెట్ లో వస్తున్న ప్రోనోగ్రఫీని ఆపలేని ప్రభుత్వం,
కారణాలు జోలికి పోకుండ ఏదో ఒక సంఘటనకు స్పందిస్తూ వచ్చిన జనాలు,
కాండిల్ ర్యాలీలు చేసేవారు,
తల్లి దండ్రులు వెళ్లి పిర్యాదు చేసిన సకాలంలో స్పందించని పోలీసులు,
తమ చుట్టూ ఎన్నో అన్యాయాలు జరుగుతున్న స్పందించని జనాలు.
అన్యాయాలు చేస్తున్న
బాబాలు, స్వామీజీలు, పూజారీలు, పెట్టుబడిదారులు, దోపిడీ కులాలవాళ్ళు,
మన చుట్టూ ఉన్న మానవ మృగాలు. అసలు నేరస్థులు.
ఫేకా , నిజామా ఏదో ఎన్కౌంటర్ లో వీళ్లందరిని చంపేయండి.
అపుడు మీరన్నట్లు, మీరనుకున్నట్టు పిల్లలు, యువకులు నేరస్థులుగా మానవ మృగాలుగా తయారుకారు.
అసలు నేరస్థులే ఉండరు.
ఇంకా రేపులు, హత్యలు ఉండవు.
నేరాలే ఉండవు.
దేశంలో సమత, మమత, శాంతి ఉంటాయి.
బుద్ధం శరణం గచ్ఛామి
ధమ్మం శరణం గచ్ఛామి.
సంఘం శరణం గచ్ఛామి
కాము
7.12.2019

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి