9, మార్చి 2015, సోమవారం

on Irom sharmila


8.3 .2015 న సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో శాంతి కొరకు పొలికేక పుస్తకం ఆవిష్కరించ బడింది. అంతర్జాతీయ మహిళా పోరాతదినం సందర్భంగా ఇరోం షర్మిల పోరాటానికి సంఘీభావం తెలియచేస్తూ పుస్తక ఆవిష్కరణ జరిగింది.
నేను కూడా పాల్గనడం జరిగింది.
ఒక షర్మిల రాసిన ఒక కవిత ను కూడా పోస్ట్ చేసాను చదవండి.
------------------------
కాని నాకు అనేక ప్రశ్నలు.
మే ౩, 2000 నుండి నిరహార దీక్ష చేస్తున్నారు. ఆత్మా హత్య నేరం క్రింద జైల్లో పెట్టడం ఆహారాన్ని ముక్కు ద్వారా అందిస్తున్నారు.
వారి డిమండ్ 1958 భారత ప్రభుత్వం సాయధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానీ ఉపసంహరించాలి. మే 2 న, 10 మంది పౌరులను విచక్షణారహితంగా సాయుధ బలగాలు కాల్చి వేసాయీ. ఆ కాల్పులకు నిరసిస్తూ అ చట్టాన్నీ ఉపసంహరించాలని డిమండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఇప్పటికి ఆత్మా హత్య నేరం క్రింద జైల్లో పెట్టి ఆహారాన్ని ముక్కు ద్వారా అందిస్తున్నారు.
ఇప్పటికి వరకు ఎ పార్టీ కి ఓటు వేయలేదు. కాని 2014 లో అమ్ ఆద్మీ పార్టీ కి ఒటువేయాలని నిర్ణయించుకొని ప్రకటించారు. కాని కుదర లేదని తెల్సింది.
ప్రశ్నలు:
భారత దేశానికి రాష్టపతి, ప్రధాన మంత్రి, మంత్రులు పార్లమెంటు, అసెంబ్లీలు ఉన్నాయీ.అయిన పరిష్కారం కాలేదు.
పద్మశ్రీలు, పద్మ విభీషుణులు, భారత రత్నాలు. దాదాపుగా 1000 సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు, నటి నటులు ఉన్నారు. దాదాపు 10000 రచయత్రిలు, రచయితలు ఉన్నారు. కొన్ని వేలమంది ప్రజాతంత్ర వాదులు, ఉద్యమ కార్యకర్తలు ఉన్నారు. అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయీ. అనెఅ వేలమంది మేధావులు ఉన్నారు. అయిన పరిష్కారం కాలేదు.
యూనివర్సిటీలు ఉన్నాయీ.అయిన పరిష్కారం కాలేదు.
టి.విలు, పత్రికలు ఉన్నాయి అయిన పరిష్కారం కాలేదు.
కోర్టులు ఉన్నాయి అయిన పరిష్కారం కాలేదు.
ఏమిటి భారత దేశం ఏమయింది.
చని పోయిందా అనే ప్రశ్న వస్తుంది.
సమాధానం చెప్తారా. పరిష్కారం చూపిస్తారా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి