8, ఫిబ్రవరి 2015, ఆదివారం

on land

నన్ను మీరు కన్నారా సృష్టించారా.
మీరెవరు నన్ను నాశనం చేయడానికి.

నన్ను మీ చెత్త పట్టలా కాగితాల్లో పెట్టుకొని,
హత్య చేయడానికి మీరెవరు.

నాకు నీళ్ళు పోసి, పెంచి,
మీకు అన్నం పెట్టేటట్లు చేస్తున్న
కూలీలకు, రైతులకు చెందిన దానిని.
మీ చెత్త పట్టా కాగితాలకు చెందిన దానిని కాను.

మీ దుర్మర్గామయిన వ్యాపార
లావా దేవిలలో నన్ను ఇపుడు బలిచేస్తే,
భవిషత్ లో జరిగే నష్టాలకు
మీరే కారకులవుతారు.

భవిషత్ తరం మిమ్మల్ని క్షమించందు.
నేను కూడా మిమ్మల్ని నాశనం చేస్తాను.

ఎందుకంటే మీరు నన్ను
మీ చెత్త పట్టాల కాగితాల్లో ఉంచుకొని
నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కనుక.

నా కోసం నిజాయతీగా పోరాటం చేస్తున్న వారందరికి
నమస్సులు.
========

మీకు అన్నం పెట్ట్టిన భూమాతను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి