16, నవంబర్ 2014, ఆదివారం

no suicide.

నేను చావను బ్రతుకుతాను.
నేను బ్రతుకుతాను.
నేను మీ ఇంట్లో అంట్లు తోముతూ బ్రతుకుతాను.
మీ ఇంట్లో పాకి పని చేసి బ్రతుకుతాను. 
వీధులు చిమ్ముతూ బ్రతుకుతాను,
నాగళ్ళు చేస్తూ బ్రతుకుతాను, 
శిల్పాలు చెక్కుతూ బ్రతుకుతాను,
కంచాలు మంచాలు చేస్తూ బ్రతుకుతాను, 
పొలాలు దున్నుతూ బ్రతుకుతాను.
పేపర్లు వేస్తూ బ్రతుకుతాను.
పాటాలు చెబుతూ బ్రతుకుతాను.
రచనలు చేస్తూ నాటకాలు వేస్తూ బ్రతుకుతాను.
ఉద్యమాలు చేస్తూ బ్రతుకుతాను. 
తుపాకులు తీసుకొని బ్రతుకుతాను.
చేగువీరలాగా విప్లవకారుల్లాగా బ్రతుకుతాను.
భగత్ సింగ్, రాజగుర్ , సుఖదేవ్ లాగ ఉరితాల్లను ముద్దుపెట్టుకుంటాను.
బ్రతుకుతాను బ్రతుకుతాను బ్రతుకుతాను 
నీవు నాతొ ఉన్న లేకపోయినా బ్రతుకుతాను 
చంపితే చస్తాను. లేకపోతె చావను.
సమత కోసం 
మమత కోసం
ప్రగతి కోసం 
బ్రతుకుతాను .
చావల్సివస్తే చస్తాను..
ఎవర్ని నాతొ చావమని అడగను 
బ్రతకండి బ్రతకండి బ్రతకండి 
సమత కోసం 
మమత కోసం
ప్రగతి కోసం 
అందరు బ్రతకండి. 
పోరాటమే బ్రతుకు. 

శివసాగర్ చెప్పినట్లు 
అమ్మ నన్ను కన్నందుకు విప్లవాభినందనాలు. 
*****
ఇది కవితని చెప్పను. ఎందుకంటే 
టి అమ్మేవాల్లుకు పేపర్ అమ్మేవాల్లకు 
..........................
అందరికి అర్ధం అవుతుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి