3, అక్టోబర్ 2014, శుక్రవారం

రాజకీయాలు --- అరాజకీయాలు

నాకసలు అర్ధం కావడంలేదు.తలకాయి పగిలిపోతుంది.

ఏ రోజు అయితే నేను అరాజకీయలు, రాజకీయాలు కాదని చెప్పానో,
ఆరోజు నా తలకాయి పగిలి పోతున్నట్లు అనిపిస్తుంది. నాకు అన్నము తినాలనిపించదు..

అందుకే రాస్తున్నాను.నా బాధను తగ్గించుకోవడానికి రాస్తున్నాను. ఎదో మార్పు వస్తుందని కాదు. వస్తే చాల సంతోషo.

మన దేశంలో పద్మశ్రీలు, పద్మావిభీషునులు, భారత రత్నలు, డాక్టరేట్లు, డబ్బు మందు, బహుమతులు పంచే దుర్మార్గమైన రాజకీయ నాయకుల తో పాటు.ఉన్నారు.

మరి ఈ పద్మశ్రీలు, పద్మావిభీషునులు, భారత రత్నలు, డాక్టరేట్లు తీసుకున్నవారంతా ఎందుకు ఈ డబ్బు మందు, బహుమతులు పంచే దుర్మార్గమైన రాజకీయ నాయకులను వ్యతిరేకిస్తు పని చేయరు. పని చేయలేకపోవచ్చు. ఓక ప్రకటన కూడా ఇవ్వరు.

నా కందుకే అనిపిస్తుంది ఈ పద్మశ్రీలు, పద్మావిభీషునులు, భారత రత్నలు ప్రజా స్వామిక వాదులు కాదు. దేశభక్తులు కాదు. తమ కోసం పనిచేసుకొని పద్మశ్రీలు, పద్మావిభీషునులు, భారత రత్నలు, డాక్టరేట్లు తీసుకున్నవారు కూడా దేశ భక్తులు కాదు. స్వార్ధ పరులు.

ఈ డబ్బు మందు, బహుమతులు పంచే దుర్మార్గమైన రాజకీయ నాయకులను, సామాన్యులమైన మేమే వ్యతిరేకించాలా. మీ కెందుకు ఆ బిరుదులూ. మీరు దేశభక్తులు కాదు.దేశ ద్రోహులు. స్వార్ధ పరులు.

సామాన్యుల మైన మేమే దేశ భక్తులం. అక్షర పోరాట యోడులం.
మీరు చేయండి. సహకరించండి. మా మీద భారాన్ని తగ్గిస్తే కృతజ్ఞతలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి