31, ఆగస్టు 2014, ఆదివారం

అమ్మ చనిపోయిన రోజు.

1955 సo వత్సరం లో(తెలుగు సంవత్సరం ప్రకారం)  ఈ రోజు మా  అమ్మ చనిపోయిన  రోజు.

నేను ఎపుడు వ్యక్తిగత విషయాలు నా బ్లాగ్లో కాని,  పేస్ బుక్ లో కాని రాయను..

కాని ఎందుకో అమ్మ గురించి తలచుకుంటూ వ్రాయ లేకుండా పొతున్నాను.

నాకు మా అమ్మ ఫోటో కూడా లెదు.  నాకు అపుడు రెండున్నర సంవత్సరాలు

మా అమ్మ టి బి తో చనిపొయింది. ఆ రోజుల్లో మందులు లెవు.

టైపు చేస్తుంటే ఏడుపు వస్తుంది.

చీరాల బేర్ హాస్పిటల్ లో వైద్యం చెయించారు  మా నాన్న. ప్రయత్నం జరిగింది.

మా అమ్మది  పావులూ రు. అక్కడ ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. అది పెద్ద దేవాలయం. ఆ దేవా లయం చుట్టు ప్రదక్షనలు చేసేది అని చెప్తారు మా చుట్టాలు . అలాగే మా ఊ రు దుద్దుకూరు. అక్కడ బ్రహ్మం గారి గుడి ఉంది. దాని చుట్టు ప్రదక్షనలు చేసేది అని చెప్తారు మా చుట్టాలు..

మన పిల్లలు ఎమన్నా బాధ పడితే ఎంత బాధ పడతాము. నేను మా పిల్లలు బాధ పడితే ఏంతో బాధ పదతాను. సహజం .

మా అమ్మ వీడు (అంటే నేను) ఏమవుతాడు అని ఎంత బాధ పడి  ఉంటుంది. తన మెదడు నరాలు చిట్లి పోయి ఉంటాయి అని పిస్తుంది. తను ఆంజనేయస్వామి భక్తురాలు. బ్రహ్మం గారి భక్తురాలు. తను చనిపోతానని  తెల్సి నాకోసం ప్రార్ధిస్తూ చనిపొయింది( మా అమ్మ  ముస్లిం గా పుట్టిఉంటే అల్లా ని ప్రార్ధించేది. క్రిస్టియన్ గా  పుట్టిఉంటే జీసస్ని ప్రార్ధించేది. బుద్ధి ష్టు ఉంటే  బుద్ధుడిని  ప్రార్ధించేది. అలా ... ) తను చనిపోతానని  తెల్సి నాకోసం ప్రార్ధిస్తూ చనిపొయింది.

అపుడు మా అమ్మ పరిస్తితి ఊహిస్తుo టే నాకు ఏడుపు వస్తుంది.  మౌనం అయి పోతున్నాను.

నాకు మా అమ్మ పాదాలకు నమస్కారం చేయాలని, మా అమ్మవడి లో పడుకోవాలని ఉంటుంది.  అది అసాద్యం. బహుశా  చనిపోయినతర్వాత సా ద్యమవుతుందా. తెలియదు.

నాకు అని పిస్తుంది. నేను కస్టాలు పడ్డాను. సమస్యలు ఎదుర్కొన్నాను. అయిన ఓ డి పొలెదు. బహుశ మా అమ్మ  తను చని పోయిన,  నా చుట్టూ ఎల్లప్పడు ఉంటూ కాపడుతుందని అనిపిస్తోంది. లేకపోతె నేను ఏమిటి ఇన్ని పనులు చేయడమేంటి. నాకే ఆశ్చర్యం ఏస్తుంది.  నేను ఎదుర్కున్న సమస్యలకు చుట్టాలు, స్నేహితులు, కామ్రేడ్స్ ఎంతోమంది సహకారం ఇచ్చారు. అయిన మా అమ్మ ఎపుడు నా చుట్టూ ఉండి ఉంటుంది.

నేను కస్టాలను ప్రేమించాను. అందుకే అనందాన్ని పొందాను. ఆనందం వేరు. సుఖాలు వేరు. నాకు ఆనందమే కావలి. అది ఎల్లపుడు మా అమ్మ ఇస్తుo దని పిస్తోంది . మా అమ్మ ఎపుడు నా చుట్టూ ఉండి ఉంటుంది.

కాని మా అందరి చుట్టాలు మా పాప సృజన, మా అమ్మలాగ ఉంటుంది అంటారు. బహుశా మా అమ్మ మా భార్య కడుపులోకి వచ్చిందేమో అనిపిస్తుంది. ఆ విధంగా నాకు ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది. చెప్పానుగా మా అమ్మ ఎల్లప్పుడు నాచుట్టు ఉండి కాపాడుతూ ఉంటుందని. లేకపోతె నేనేమిటి ఇన్ని పనులు చేయడమేంటి. చేయగలగాడమేమిటి.

చాల మంది హేతు వాది  స్నేహితులకు ఏమిటి కామేశ్వరరావుకు అమ్మ పిచ్హి  పట్టిందను కుంటారు.

నిజమే అమ్మ పిచ్చి పట్టింది. మా అమ్మకు కాళ్ళకు  నమస్కారం చేయాలని ఎపుడు ఉంటుంది. నా కది తీరదు.

మా అమ్మకు కాళ్ళకు  నమస్కారం చేయాలని ఎపుడు ఉంటుంది. నా కది తీరదు. తీరదు. తీరదు.

మా అమ్మను స్మరించుకుంటూ..  .... కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.  

నాకు నమ్మకం లేకపోయిన, ఈ రోజు మా అమ్మనమ్మి  నిరంతరం ప్రార్ధించే ఆంజనేయ స్వామికి , బ్రహ్మం గారికి టెంకాయలు కొట్టి మా అమ్మను స్మరించుకోవడం జరిగింది.

మా అమ్మకు నమస్సులు...
మా అమ్మ  పాదాలకు నమస్సులు....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి