14, ఆగస్టు 2021, శనివారం

75వ స్వాతంత్ర దినోత్సవం

 

దేశానికి పట్టిన కేన్సర్లనుండి మనదేశాన్ని విముక్తి చేయాలి.

మనం ఈనాడు 75వ స్వాతంత్ర్యదినోత్సవం జరుపుకుంటున్నాము. స్వాతంత్ర్యం ఎంతోమంది త్యాగఫలితం.  ఖుదీరాం బోస్, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్,  ఉద్దం సింగ్ ఉరి కంబాలను ముద్దు పెట్టుకున్నారు.  అల్లూరి సీతారామరాజు తుపాకీ గుండ్లకు బలిఅయ్యారు .ఇంకా ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసారు. జైల్లో మగ్గారు. లాటి దెబ్బలు తిన్నారు. మన స్వాతంత్ర పోరాటంలో గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభాయి పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఎంతోమంది జైలు జీవితం  గడిపారు. వారి అందరి కృషి ఫలితమే. స్వాతంత్ర్యం . మరి వారందరి పోరాటాల ద్వారా ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్య  భారతావనిలో ఏమి జరుగుతుంది.

 

వ్యవసాయిక రంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్య వైజ్ఞానిక, అనేక రంగాలలో కొంత అభివృద్ధి జరిగింది. కాని జరగాల్సినంత జరిగిందా అంటే జరగలేదు అని చెప్పవలిసిందే. అవినీతి, రాజకీయాలలో అవినీతి నిరుద్యోగం, ఇంకా నిరక్షరాస్యత, మతోన్మాదం దేశాన్ని పట్టి పీడుస్తున్నయి. మన ప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు అవినీతి పరులను ఎలక్త్రిక్ స్తంభాలకు కట్టి ఉరి వేయాలన్నారు. మనం ఆ స్థాయికి ఎదిగామా అని ప్రశ్నించు కోవాలి.

 

నిరక్ష్యరాస్యత , నిరుద్యోగం, ఆకలి చావులు, ఆత్మ హత్యలు,. స్త్రీల ఫై , దళితులపై, దుర్మార్గాలు. చూస్తూనే ఉన్నాము. శ్రమజీవులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.  ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. శ్రామికులను కాంట్రాక్టర్లకు  దోపిడి  క్తులకు బలిచేస్తున్నారు ఉచిత విద్యా, ఉచిత వైద్యం అందటం లేదు . బాల కార్మిక వ్యవష్ట కొనసాగుతుంది.  పరిస్థితులు మారాలి . మన స్వాతంత్ర సమరయోధులు కన్న కలలు నిజమయినట్లు

 

ప్రజాస్వామ్యాన్నీ , రాజ్యాంగాన్నీ , కాపాడు కోవలసిన బాద్యత, ప్రజా తంత్ర వాదులు, కార్మిక సంఘాలు, దేశభక్తులపైన ఉంది. స్వేచ్ఛా, సమత , మమత ప్రగతి, శాంతి, నిజాయతీ ల కొరకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మొదట్లో కాంగ్రెస్, కమ్యునిష్టు , సోషలిస్టు   పార్టీలు తమ విధానాల్లో సిద్ధాంతాలలో తేడాలున్నా దేశప్రగతి కోసం అవినీతి లేకుండా కృషిచేసారు. తరువాత కాలంలో రాజకీయ పార్టీలే అవినీతి పరులకు దుర్మార్గులకు, రౌడీలకు, వ్యాపారవేత్తలకు టికెట్లు ఇచ్చి పార్లమెంటరీ ప్రజస్వామ్యానికి దేశాన్ని అధోగతి పాలుచేస్తున్నాయి.  రాజకీయ పార్టీలు డబ్బు మద్యము బహుమతులు పంచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యము చేస్తున్నాయి . పూర్వ ఎన్నికల ముఖ్య అధికారి  జే.ఎం. లింగ్డో గారు వీళ్ళు దేశానికీ పట్టిన కాన్సర్లు. మనదేశానికి పట్టిన కేన్సర్లనుండి మన దేశాన్ని విముక్తి చేయాలి.  క్యాన్సర్లను తీసివేసినపుడే ప్రజస్వామ్యము వర్ధిల్లుతుంది. స్వాతంత్ర్య  సమర యోధులకు నిజమయిన నివాళి అర్పించినట్లవుతుంది.  మన భారత రాజ్యాంగం రాసేటప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు రాజకీయ ప్రముఖులు అంబేద్కర్, నెహ్రు, పటేల్, రాజగోపాల చారి, రామ మనోహర్ లోహియా,  మొదలయిన వారు, డబ్బు, మద్యం బహుమతులు పంచేవాళ్ళు రాజకీయాలలోకి వస్తారని ఊహించలేదు. ముందు తరం వారు తమకన్నా ప్రజాస్వామ్యం కోసం, సోషలిజం కోసం, లౌకికతత్వం కోసం సార్వభౌమత్వం కోసమే పనిచేస్తారని ఆశించారు.  కాని ఆశయాల కోసం ఈ నాటి రాజకీయ నాయకులు పనిచేయడం లేదు.  ప్రజాస్వామ్యాన్నీ , రాజ్యాంగాన్నీ, కాపాడు కోవలసిన బాద్యత, ప్రజాతంత్ర వాదులు, కార్మిక సంఘాలు, దేశభక్తులపైన ఉంది,  సమత, మమత ప్రగతి, శాంతి, నిజాయతీల కొరకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.

ఇంకా బానిసత్వాన్ని సమర్ధించే నాయకులు వారి వంది మాగధులు ఉన్నారు. అలాంటి వారివలన ఈ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వాళ్ళకు మనం ఏమి నివాళి అర్పిస్తున్నా దండలు వేసి జన గణ మన పాడేసి, జండా ఆవిష్కరించేసి అయి పోయింది అంటున్నాము. ఈ నాడు కొంతమంది నాయకులకు మన స్వాతంత్ర్య జెండాను ఆవిష్కరించే అర్హత కూడలేదు. అయినా మన దేశంలో, సమత కోసం, మమత కోసం, ప్రగతికోసం కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషి లో భాగంగా ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారు .  స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ఇంక సమత కోసం, మమత కోసం, ప్రగతికోసం కృషి చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి జోహార్లు చెబుతూ, వారి బాటలో నడవడమే  మన కర్తవ్యము .

 

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్లు ఎన్నికల నిబంధనావాలి, రాజ్యాంగం ప్రకారం  నేరస్తులు వారిని శిక్షించాలి 

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.

రాజ్యాంగాన్ని కాపాడాలి.

రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలను అమలు చేయాలి

ప్రవేటికరణను అపాలి

భూములను పరిశ్రమలను జాతీయం చేయాలి.

సంపూర్ణ అక్షరాస్యత కావాలి.

విద్యా,  వైద్యాన్ని  ప్రభుత్వమే నడపాలి.

మద్యాన్ని బందుచేయాలి.

మూతబడిన పరిశ్రమలను తెరవాలి.

రైతుల కౌల్ దారుల సమస్యలను పరిష్కరించాలి

ప్రవేట్ సంస్థలలో రిజేర్వేషన్లను అమలు చేయాలి.

చట్ట సభలల్లో BC లకు 52 శాతం ప్రాతినిద్యం కల్పించుటకు రాజ్యాంగ సవరణ చేయాలి.

సామజిక ఆర్ధిక అసమానతలను నిర్మూలించాలి

డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళను, పార్టీలను ఓడించండి.

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

సార్వభౌమత్వం వర్ధిల్లాలి.

సోషలిజం వర్ధిల్లాలి.

లౌకికతత్వం వర్ధిల్లాలి .

రాజ్యాంగం వర్ధిల్లాలి.

ఖుదీరాం బోసు, ఉద్దంసింగ్ జోహార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ జోహార్

జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్

జోహార్ అమరవీరులకు జోహార్

         రాజ్యాంగ పరిరక్షణ వేదిక

________________________________________________________________________________________వి.కామేశ్వర రావు  కన్వీనర్ 9849008986  -- 14.8.2021

4, ఆగస్టు 2021, బుధవారం

library

 

ఈ పుస్తకాలు విశాలాంధ్ర, ప్రజాశక్తి, మైత్రి, నవోదయ, సహచర, సమాంతర, నవతెలంగాణ, మన తెలంగాణ మొదలైన అభ్యుదయ, పుస్తకాల షాపులనుండే కొన్నాను.
మన రాష్ట్రం లోను, దేశం లోను టన్నుల కొద్దీ సాహిత్యం వచ్చింది.
అదే నా ఆస్తి అనుకుంటాను.
కానీ నా వద్ద ఉన్న పుస్తకాలలో, పత్రికలలో, డబ్బు, మద్యం, బహుమతులు పంచే వారు నేరస్థులని, వారిని శిక్షించాలని ఎక్కడా లేదు. కనీసం రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల నిబంధనవాలి ప్రకారం నేరస్థులని కనిపించదు.
ఎందుకు రాయలేదు. అంత అభ్యుదయ సాహిత్యమే విప్లవ సాహిత్యమే. ఎందుకు సినిమాలలో కనిపించదు. నారాయణ మూర్తి గారి సినిమాలలో కూడా ఆ డైలాగు ఉండదు.
అంతెందుకు నేను రాసిన జిజ్ఞాస తరంగాలు లో కూడా నేనె రాయలేదు. 2016 నుండి సోషల్ మీడియాలో రాస్తునట్లు బలంగా రాయలేదు.
కారణం ఏమిటి.
సాహిత్యం ఆధిపత్య కులాలు సృష్టించి నవి. అదే మూసలో బహుజనులు పడిపోయారు. నేను కూడా పడి పోయాను నేను కూడా 2016 నుండే సోషల్ మీడియాలో రాస్తున్నాను.
మాజిఎన్నికల కమిషనర్ జె.ఎం లింగ్డో గారు విసుగుపుట్టి రాజకీయ నాయకులు క్యాన్సర్లని అని అన్నారు. అంతవరకు అన్నారు. వాటిని తొలగించాదానికి మార్గం చూపించి నట్లు కనబడలేదు.
ఇక నుంచైనా సాహిత్యకారులు, మేధావులు, వ్యాసాలు రాసేవారు డబ్బు మద్యం, బహుమతులు పంచేవారు నేరస్థులని, వారిని కఠినంగా శిక్షించాలని, దేశాన్ని , రాజ్యాంగాన్ని కాపాడాలని రాయవలసిందిగా విజ్ణప్తి.
ఆ విధంగా రాసిన పుస్తకాన్ని నేను నాలైబ్రరీలో పెట్టు కోవాలని కొరిక.
నేనే FB పోస్ట్ లను ప్రింట్ చేసుకుంటున్నాను. దానిని నేను సోషల్ మీడియా లో పెడతాను. అందులో నేను బలంగా చెబుతున్న ఈ విషయం వస్తుంది.
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.
డబ్బు, మద్యం, బహుమతులు పంచేవారు నశించాలి.
రాజ్యాంగం వర్ధిల్లాలి.
విప్లవం వర్ధిల్లాలి.
కామూ
4.8.2018
Mourya Boya
2 Comments
Like
Comment

1, ఆగస్టు 2021, ఆదివారం

దేశాన్ని విముక్తి చేయాలి

 మనదేశాన్ని దేశం లో ఉన్న దేశద్రోహులనుండి దేశాన్ని విముక్తి చేయాలి..

-----------------------------------
రాజ్యాంగం లో ప్రజాస్వామ్యానికి సోషలిజనికి ఎంతో ప్రాధాన్యతని ఇచ్చారు. వాటిని దేశద్రోహులు తుంగలో తొక్కుతున్నారు.
ఎన్నికలల్లో డబ్బు మద్యము బహుమతులు పంచె వాళ్ళు నేరస్తులు , దేశద్రోహులు . ఆ పార్టీలను నిషేదించాలి. అపుడే మన దేశంలో ప్రజాస్వామ్యానికి , సోషలిజానికి పునాదులు పడతాయి
ఈ పని ఎన్నికల కమిషన్, , పోలిస్ వ్యవష్ట, గౌరవ కోర్ట్లులు చేయగలవు . చేయాలి..
కాని చేయడం లేదు.
ఇది వాస్తవం.
కారణలు కులం.
ఈ కర్తవ్యాన్ని తీసుకోవాల్సిన ఈ దేశ కమ్యునిష్టు పార్టీలు ప్రజస్వామ్య వాదులు వదిలి వేసారు. విచారకరం .
కారణం . కులం.
అయిన మార్పు ఆగదు.
మహాకవి గురజాడ అన్నట్లు దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయ్ . దేశం లో మనుష్యలు ఉన్నారు. మార్పు కోరే మనుష్యులు ఉన్నారు.
అందరూ దేశాన్ని నాశనం చేస్తున్న పీడక కులాల వాళ్ళ బానిసలు కాదు. చెంచాలు కాదు. వాళ్ళ పార్టీల తోకలు కాదు. , వాళ్ళ పార్టీల అనుచరులు కాదు.
దేశాన్ని విముక్తి చేస్తారు . పార్లమెంట్ , అసెంబ్లీ లను ఈ పీడక కులాల వాళ్ళ నుండి , ఆ పార్టీలనుండి.విముక్తి చేస్తారు.
విముక్తి చేయాలి. విముక్తి జరుగుతుంది.
నిజమయిన ప్రజస్వామ్య , సోహలిష్టు శక్తులు ముందుకు వస్తాయి
చేయాల్సిన ఎన్నికల కమిషన్, , పోలిస్ వ్యవష్ట, గౌరవ కోర్ట్లులు చేయకపోతే తుపాకులు పట్టుకోవాల్సి వస్తే పట్టుకుంటారు.. బాంబులు పట్టుకుంటారు. పార్లమెంట్ , అసెంబ్లీ లను పీడక కుల దుర్మార్గుల నుండి, పార్టీల నుండి విముక్తి చేస్తారు. దీని కొరకు తుపాకులు పట్టుకోవాల్సి వస్తే , బాంబులు పట్టుకోవాల్సి వస్తే దానికి కారణం ఎన్నికల కమిషన్, పోలిస్ వ్యవష్ట , గౌరవ కోర్టులే అవుతాయి..
అంబేద్కర్ గారే చెప్పారు. రాజ్యాంగం విఫల మయితే తనే రాజ్యాంగాన్ని తగల పెడతాను అన్నారు. రాజ్యాంగం విఫల మవడానికి కారణం రాజ్యాంగం కాదు.. దానిని అమలు చేయాల్సిన మనుష్యలు.. అంటే పార్లమెంట్ , అసెంబ్లీ ల సభ్యులు. .
ఎన్నికల కమిషన్, పోలిస్ వ్యవష్ట , గౌరవ కోర్టులు పార్లమెంట్ , అసెంబ్లీ ల లోకి డబ్బు , మద్యము , బహుమతులు పంచె వాళ్ళను అడుగు పెట్టనేయకుండా చేస్తారని ఆశిద్దాం.
లేకపోతె ఈ దేశ ద్రోహులనుండి. , దోపిడి దారులనుండి, కాపాడు కోవడానికి ప్రజస్వామ్య శక్తులు , సోషలిష్టు శక్తులు , దేశ బక్తులు నడుం బిగించాలి.. పిడికిలి బిగించాలి. ఉద్యమించాలి. పోరాటం చేయక తప్పదు . దానికి కారణం ఎన్నికల కమిషన్, పోలిస్ వ్యవష్ట , గౌరవ కోర్టులే అవుతాయి
తప్పుదు
దేశాన్ని విముక్తి చేయాలి .
డబ్బు మద్యము బహుమతులు పంచేవాళ్ళు , పార్టీలు నశించాలి.
ప్రజస్వామ్యము వర్ధిల్లాలి.
సోహలిజం వర్ధిల్లాలి
రాజ్యాంగం వర్ధిల్లాలి.
విప్లవం వర్ధిల్లాలి.
జోహార్ అమర వీరులకు జోహార్.
జోహార్ భగత్ సింగ్ , రాజగురు సుఖదేవే. జోహార్.
జోహార్ ఉద్దం సింగ్. జోహార్.
జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్.
కామేశ్వరరావు
కన్వీనర్
రాజ్యాంగ పరి రక్షణ వేదిక
2.8.2021
No photo description available.
13 Shares
Like
Comment
Share

10, ఏప్రిల్ 2021, శనివారం

wokers party

 

కొన్ని గ్రూప్ లలో వర్కర్స్ పార్టీ ఎపుడు స్తాపించ బడింది. ఎప్పటినుంచి పనిచేస్తుందని కొంతమంది కోపంతో అడుగుతున్నారు.
వాళ్ళు వర్కర్స పార్టీ పోస్టులు చూసి, కోపంతో అడుగు తున్నారు. కొంత విషయం ఈ గ్రూప్ పేస్ బుక్ లో పెట్ట్టాను.
అయిన ఇంకా కొంత వివరంగా చెప్పాలనిపించింది
1936 లోనే బాబాసాహెబ్అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని బ్రాహ్మణ ధర్మానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ విధానానికివ్యతిరేకంగా స్తాపించి 19 42 వరకు నడిపారు. తరువాత 1942 లో కొన్ని కారణాలు వలన ( రాయవచ్చు కానిరాయడం అనవసరం) మనుధర్మానికి వ్యతిరేకంగా, దళితజాతీయవాదంతో షెడ్యూల్ కేష్టు ఫెడరేషన్ మార్చారు. తరువాత 1952 లో దళితబుద్ధిష్ట్ మూవ్మెంట్ తో, దళితజాతీయ వాద దృక్పధం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను స్తాపించారు.
పశ్చిమ బెంగాల్ లో ప్రొఫెసర్ జ్యోతి భట్టాచార్య నాయకత్వంలో ఎం. .ఎన్ రాయ్ నాయకత్వంలో ఉన్న రాడికల్ డెమాక్రటిక్ పార్టీనుండి విడి, పోయి 19 43 నుండి ఉన్న డెమక్రటిక్ వాన్ గార్డ్ను వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా మార్చుకొని పని చేసారు. యునైటెడ్ ఫ్రంట్ ప్ర బుత్వంలో 19 6 7 నుండి1969 వరకు జ్యోతి భట్టాచార్య విద్యశాఖమంత్రి గా పని చేసారు. తరువాత కమ్యునిష్ట్ వర్కర్స్ పార్టీ గా వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా గా చీలి కొంతకాలం పనిచేసాయి. తరువాత కాలంలోకమ్యునిష్టు వర్కర్స్ పార్టీ, 1993 వర్కర్స్ పార్టీగా పేరుమార్చు కొని పనిచేయడం జరిగింది. 1998 లో జ్యోతిభట్టాచార్య చనిపోవడం జరిగింది. తరువాత పార్టీ కొనసాగలేదు. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా 20 11 లెఫ్ట్ ఫ్రంట్ లోఉండి శక్తీకొలది పని చేసింది. .
1947నుండి మహారాష్ట్ర లో పెజెంత్స్ అండ్ వర్కర్స్ పార్టీ కేశవ రావ్ జేడె మార్క్ సిద్ధాంతం తో స్తాపించారు . ఇప్పుడు ఈపార్టీ మహారాష్ర లోపని చేస్తుంది.
1991 మాజీ రాష్ట్రపతి వి.వి. గిరిగారు లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా ను స్తాపించి పని చేసారు.
తెలంగాణా రాష్ట్రం లో TDP, లోను TRS లోను కార్య కర్త్తగా పనిచేసిన భాస్కర్ శ్రమజీవి పార్టీని స్తాపించి తన శక్తీ కొలది పని చేస్తున్నారు.
ప్రపంచంలోబ్రిటన్ లోలేబర్ పార్టీ, డెన్మార్క్ లో, అమెరికాలో ఐర్లాండ్ లో సింగ పూర్ లో ఇంకా ప్రపంచ వ్యాపింతంగా వర్కర్స్ పార్టీలు ఉన్నాయి.
1947 డాంగేనాయకత్వంలో భారత కమ్యునిష్టు పార్టీ USSR కమ్యునిస్టు పార్టీని సలహా ల కోసంవెళితే స్టాలిన్ నాయకత్వం లో ఉన్న USSR కమ్యునిస్టు పార్టీ భారత్ కమ్యూనిష్ట్ పార్టీ నాయకులకు కమ్యునిస్టు పార్టీపేరు మార్చి లేబర్ పార్టీ గా కాని వర్కర్స్ పార్టీ గా కాని పేరు మార్చిపని చేయమని సలహా కూడా ఇచ్చారు. కాని మన నాయకులు విని వచ్చారు. కాని సలహాను స్వీకరించ లేదు. బహుశా అంబేద్కర్ అప్పటికే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి పని చేస్తున్నారు.
వర్కర్స్ పార్టీకి లేబర్ పార్టీలకు దేశంలోను ప్రపంచంలోను గొప్పచరిత్ర ఉంది. తెలుగురాష్ట్రాలలోఉన్న భూస్వామ్య వర్గాలకు వారి బానిసలకు అర్ధంకాదు. డబ్బు మందు బహుమతులు పంచె వారికి ఏమి తెలుస్తుంది.
కార్మికులు బానిసలు కాదు చైతన్య దీపాలు. మౌనంగా ఉండలేరు
నేను స్తాపించిన వర్కర్స్ పార్టీ సమానత్వం, అబివృద్ది, మమత, న్యాయం, శాంతి ఆశయాలతో పని చేస్తుంది. వర్కర్స్ పార్టీ పనిచేయడంఅంటే ఏంతోకష్టం. అందులో ఫ్యూడల్ భావ జాలం గల దేశంలోపనిచేయడం ఎంతో కష్టం. అయిన చాల మంది చేసారు. చేస్తున్నారు. మేము చేస్తాం.
విజయం ఆలస్యం అయిన దేశం కార్మికులదే . ప్రపంచం కార్మికులదే.
MY PEOPLE ALONE CAN ESTABLISH SOCIALISM IN INDIA UNDER THE RULE OF PEASANTS AND WORKERS ---- Dr. Baba Saheb Ambedkar.
అదే భావంతోవర్కర్స్ పార్టీ పనిచేస్తుంది.
వర్కర్స్ పార్టీ లు లేబర్ పార్తీలు ఇంకా పుట్టాలి. ఫ్యూడల్ భావజాలాన్నీ, సామ్రజ్యవాద భావజాలన్నీ ఓడించాలి. .
కమ్యునిస్టు పార్టీలుచేస్తే సంతోషమే. కాని వాస్తవం లో జరగలేదు. చేస్తాయని ఆశిద్దాం.
సమత, ప్రగతి, మమత, న్యాయం, శాంతి వర్ధిల్లాలి.
వర్కర్స్ పార్టీ నిర్మాణంలోబాగాస్వాములుకండి. ఫ్యూడల్ భావజాలాన్నీ, సామ్రజ్య వాద భావజాలన్నీ ఓడించ డానికి ముందుకు రండి.
దేశంలో ప్రజా స్వామ్యన్నీనెల కోల్పండి