14, ఆగస్టు 2021, శనివారం

75వ స్వాతంత్ర దినోత్సవం

 

దేశానికి పట్టిన కేన్సర్లనుండి మనదేశాన్ని విముక్తి చేయాలి.

మనం ఈనాడు 75వ స్వాతంత్ర్యదినోత్సవం జరుపుకుంటున్నాము. స్వాతంత్ర్యం ఎంతోమంది త్యాగఫలితం.  ఖుదీరాం బోస్, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్,  ఉద్దం సింగ్ ఉరి కంబాలను ముద్దు పెట్టుకున్నారు.  అల్లూరి సీతారామరాజు తుపాకీ గుండ్లకు బలిఅయ్యారు .ఇంకా ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసారు. జైల్లో మగ్గారు. లాటి దెబ్బలు తిన్నారు. మన స్వాతంత్ర పోరాటంలో గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభాయి పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఎంతోమంది జైలు జీవితం  గడిపారు. వారి అందరి కృషి ఫలితమే. స్వాతంత్ర్యం . మరి వారందరి పోరాటాల ద్వారా ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్య  భారతావనిలో ఏమి జరుగుతుంది.

 

వ్యవసాయిక రంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్య వైజ్ఞానిక, అనేక రంగాలలో కొంత అభివృద్ధి జరిగింది. కాని జరగాల్సినంత జరిగిందా అంటే జరగలేదు అని చెప్పవలిసిందే. అవినీతి, రాజకీయాలలో అవినీతి నిరుద్యోగం, ఇంకా నిరక్షరాస్యత, మతోన్మాదం దేశాన్ని పట్టి పీడుస్తున్నయి. మన ప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు అవినీతి పరులను ఎలక్త్రిక్ స్తంభాలకు కట్టి ఉరి వేయాలన్నారు. మనం ఆ స్థాయికి ఎదిగామా అని ప్రశ్నించు కోవాలి.

 

నిరక్ష్యరాస్యత , నిరుద్యోగం, ఆకలి చావులు, ఆత్మ హత్యలు,. స్త్రీల ఫై , దళితులపై, దుర్మార్గాలు. చూస్తూనే ఉన్నాము. శ్రమజీవులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.  ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. శ్రామికులను కాంట్రాక్టర్లకు  దోపిడి  క్తులకు బలిచేస్తున్నారు ఉచిత విద్యా, ఉచిత వైద్యం అందటం లేదు . బాల కార్మిక వ్యవష్ట కొనసాగుతుంది.  పరిస్థితులు మారాలి . మన స్వాతంత్ర సమరయోధులు కన్న కలలు నిజమయినట్లు

 

ప్రజాస్వామ్యాన్నీ , రాజ్యాంగాన్నీ , కాపాడు కోవలసిన బాద్యత, ప్రజా తంత్ర వాదులు, కార్మిక సంఘాలు, దేశభక్తులపైన ఉంది. స్వేచ్ఛా, సమత , మమత ప్రగతి, శాంతి, నిజాయతీ ల కొరకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మొదట్లో కాంగ్రెస్, కమ్యునిష్టు , సోషలిస్టు   పార్టీలు తమ విధానాల్లో సిద్ధాంతాలలో తేడాలున్నా దేశప్రగతి కోసం అవినీతి లేకుండా కృషిచేసారు. తరువాత కాలంలో రాజకీయ పార్టీలే అవినీతి పరులకు దుర్మార్గులకు, రౌడీలకు, వ్యాపారవేత్తలకు టికెట్లు ఇచ్చి పార్లమెంటరీ ప్రజస్వామ్యానికి దేశాన్ని అధోగతి పాలుచేస్తున్నాయి.  రాజకీయ పార్టీలు డబ్బు మద్యము బహుమతులు పంచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యము చేస్తున్నాయి . పూర్వ ఎన్నికల ముఖ్య అధికారి  జే.ఎం. లింగ్డో గారు వీళ్ళు దేశానికీ పట్టిన కాన్సర్లు. మనదేశానికి పట్టిన కేన్సర్లనుండి మన దేశాన్ని విముక్తి చేయాలి.  క్యాన్సర్లను తీసివేసినపుడే ప్రజస్వామ్యము వర్ధిల్లుతుంది. స్వాతంత్ర్య  సమర యోధులకు నిజమయిన నివాళి అర్పించినట్లవుతుంది.  మన భారత రాజ్యాంగం రాసేటప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు రాజకీయ ప్రముఖులు అంబేద్కర్, నెహ్రు, పటేల్, రాజగోపాల చారి, రామ మనోహర్ లోహియా,  మొదలయిన వారు, డబ్బు, మద్యం బహుమతులు పంచేవాళ్ళు రాజకీయాలలోకి వస్తారని ఊహించలేదు. ముందు తరం వారు తమకన్నా ప్రజాస్వామ్యం కోసం, సోషలిజం కోసం, లౌకికతత్వం కోసం సార్వభౌమత్వం కోసమే పనిచేస్తారని ఆశించారు.  కాని ఆశయాల కోసం ఈ నాటి రాజకీయ నాయకులు పనిచేయడం లేదు.  ప్రజాస్వామ్యాన్నీ , రాజ్యాంగాన్నీ, కాపాడు కోవలసిన బాద్యత, ప్రజాతంత్ర వాదులు, కార్మిక సంఘాలు, దేశభక్తులపైన ఉంది,  సమత, మమత ప్రగతి, శాంతి, నిజాయతీల కొరకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.

ఇంకా బానిసత్వాన్ని సమర్ధించే నాయకులు వారి వంది మాగధులు ఉన్నారు. అలాంటి వారివలన ఈ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వాళ్ళకు మనం ఏమి నివాళి అర్పిస్తున్నా దండలు వేసి జన గణ మన పాడేసి, జండా ఆవిష్కరించేసి అయి పోయింది అంటున్నాము. ఈ నాడు కొంతమంది నాయకులకు మన స్వాతంత్ర్య జెండాను ఆవిష్కరించే అర్హత కూడలేదు. అయినా మన దేశంలో, సమత కోసం, మమత కోసం, ప్రగతికోసం కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషి లో భాగంగా ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారు .  స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ఇంక సమత కోసం, మమత కోసం, ప్రగతికోసం కృషి చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి జోహార్లు చెబుతూ, వారి బాటలో నడవడమే  మన కర్తవ్యము .

 

డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్లు ఎన్నికల నిబంధనావాలి, రాజ్యాంగం ప్రకారం  నేరస్తులు వారిని శిక్షించాలి 

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.

రాజ్యాంగాన్ని కాపాడాలి.

రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలను అమలు చేయాలి

ప్రవేటికరణను అపాలి

భూములను పరిశ్రమలను జాతీయం చేయాలి.

సంపూర్ణ అక్షరాస్యత కావాలి.

విద్యా,  వైద్యాన్ని  ప్రభుత్వమే నడపాలి.

మద్యాన్ని బందుచేయాలి.

మూతబడిన పరిశ్రమలను తెరవాలి.

రైతుల కౌల్ దారుల సమస్యలను పరిష్కరించాలి

ప్రవేట్ సంస్థలలో రిజేర్వేషన్లను అమలు చేయాలి.

చట్ట సభలల్లో BC లకు 52 శాతం ప్రాతినిద్యం కల్పించుటకు రాజ్యాంగ సవరణ చేయాలి.

సామజిక ఆర్ధిక అసమానతలను నిర్మూలించాలి

డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళను, పార్టీలను ఓడించండి.

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.

సార్వభౌమత్వం వర్ధిల్లాలి.

సోషలిజం వర్ధిల్లాలి.

లౌకికతత్వం వర్ధిల్లాలి .

రాజ్యాంగం వర్ధిల్లాలి.

ఖుదీరాం బోసు, ఉద్దంసింగ్ జోహార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ జోహార్

జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్

జోహార్ అమరవీరులకు జోహార్

         రాజ్యాంగ పరిరక్షణ వేదిక

________________________________________________________________________________________వి.కామేశ్వర రావు  కన్వీనర్ 9849008986  -- 14.8.2021

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి