21, జనవరి 2022, శుక్రవారం

rajyanagam

 

రాజ్యాంగ వ్యతిరేక శక్తుల నుండి రాజ్యాంగాన్ని దేశాన్ని కాపాడుకోవాలి.

మిత్రులారా ,

మన రాజ్యంగ ప్రవేశిక లో  సార్వభౌమత్వం , సోషలిజం, ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం ఉన్నాయి. ఈ దేశం లోని రాజకీయ నాయకులు పీఠిక కూడా చదవరు. ఇలాంటి విలువలుగల రాజ్యాంగం మరేదేశంలోను లేదని రాజకీయ కోవిదులు అంటుంటారు .  సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలలో మతప్రసక్తి రాకూడదు. రాజకీయ నాయకుడు, పాలకులు తాము నమ్మే మత విధానాల్ని సామాజిక వేదికల మీద సామాజిక కార్యకలాపాలలో చొప్పిస్తున్నారు. మతోన్మాదాన్ని పెంచుతున్నారు. లౌకిక తత్వం లేకుండా చేస్తున్నారు.

రాజ్యంగ పీఠిక లో ప్రజాస్వామ్యం వుంది.  మన దేశం లోని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు అంటే  డబ్బు, మద్యం , బహుమతులు పంచడం అనే స్థాయికి దిగజార్చారు.  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యము చేస్తున్నారుశాడిస్టులు గా తయారయ్యారుపూర్వ ఎన్నికల అధికారి జె.ఎంలింగ్డో గారు చెప్పినట్లు ఈ దేశంలోని రాజకీయ నాయకులు దేశానికీ పట్టిన క్యాన్సర్లు. మనదేశానికి పట్టిన కేన్సర్లనుండి మన దేశాన్ని విముక్తి చేయాలి క్యాన్సర్లను తీసివేసినపుడే ప్రజస్వామ్యము వర్ధిల్లుతుంది.

మన రాజ్యంగ పీఠిక లో సోషలిజం ఉంది. అందుకొరకు అందరూ కృషి చేయాలి..  దేశంలో అసమానతలు పెంచి వేసారు. దేశంలోని రాజకీయ పార్టీలు అసలు కృషి చేయడం లేదు. సోషలిజం కోసం కృషి చేయాలి.

మన రాజ్యంగ పీఠికలో సార్వభౌమత్వం ఉంది. దేశాన్ని అప్పులో ముంచి వేసారు.  రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకొచ్చి సార్వభౌమత్వం లేకుండా చేస్తున్నారు. దేశాన్ని ఆధార పడేటట్లు చేస్తున్నారు  

 బ్రిటీష్ సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల నుంచి ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితంగా  స్వాతంత్ర్యం సిద్ధించుకున్నాక 20 ఆగష్టు, 1947 నాడు అంబేడ్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా తయారీ సంఘం  ఏర్పడింది. రాజ్యాంగ సభను ఉద్దేశించి జవహర్ లాల్ నెహ్రు తన ప్రసంగంలో  మన రాజ్యంగ లక్ష్యం ఆకలితో అలమటిస్తున్న పజలకు ఆహారాన్ని ఇవ్వడం, తగినన్ని గుడ్డలు లేనివారికి గుడ్డలు ఇవ్వడం  ఈ దేశంలోని ప్రతి పౌరుడు అన్ని విధాల అభివృద్ధి చెందే అవాసాలు కల్పించడమని పేర్కొన్నారు.. ఆ లక్ష్యం ఇంకా చేరలేదు. రాజ్యంగ రచనా సంఘం అద్యక్షుడిగా వారు ఆశించిన స్వేఛ్చ , సమానత్వం, సౌభాత్రుత్వం పునాదులపై నిర్మించిన రాజ్యాంగం  ఈ దేశ పాలకులు అమలు చేయడం లేదు.   ఈ దేశ పాలకులు రాజ్యంగ వ్యతిరేక శక్తులుగా తయారయ్యారు.  అటువంటి . రాజ్యంగ వ్యతిరేకులపై ఉద్యమించాలి . రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కృషి  ప్రజస్వామ్య వాదులు, లౌకిక వాదులు, సోషలిస్ట్లులు కృషి చేయాలి. అందుకొరకు ఎన్నికలల్లో  పెద్ద మార్పులు తీసుకు రావాలి. అందుకొరకు ఉద్యమించాలి. మనకు రాజ్యాంగాన్ని గౌరవించే ప్రబుత్వాలు, MP , MLA లు ఉండాలి  అందుకొరకు తగిన కృషి జరగాలి. ఎపుడు ఆర్ధిక పోరాటాలే కాదు  రాజకేయ వ్యవస్థ మార్పు కొరకు  పోరాటాలు జరగాలి. అందుకొరకు  రాజ్యాంగాన్ని గోరువించే పార్లమెంట్ ,అసెంబ్లీ లు ఏర్పడాలి.  

MLA, MP లకు పోటీచేసే వాళ్లకు ఆర్ధిక నేర చరిత్ర ఉండకూడదు ప్రభుత్వ  ఉద్యోగంలో  చేరాలంటే UPSC, SSC, RRB, SPSCs, DSC,  బ్యాంకు పరీక్షలు  మొదలయిన  పరీక్షలు పాసయినా,  పోలిస్ క్లియరెన్స్  కావలి.   ఎలెక్షన్ కమిషన్ అధికారులు, ఉద్యోగులు  కూడా  ఉద్యోగంలో  జాయిన్  అవ్వాలంటే  పోలీస్  క్లియరెన్స్  కావాలి. గ్రూప్ డి పోస్టుల నుండి  IAS  అధికారుల వరకు పోలీసు క్లియరెన్స్  ఉంటేనే ఉద్యోగాలలో చేరగలరు. కాని  MLA,  MP  స్థానిక  సంస్థల ప్రతినిధులు  ఎన్నికలకు  ఎవరయినా  ఎన్ని  కేసులు ఉన్న  పోటీ చేయవచ్చు.   వాళ్లు గెలిచిన తర్వాత  PM,  CM లు  మంత్రు లయితే  ఆ అప్రజాస్వామిక వాదుల ఫైళ్లు  ప్రభుత్వ  ఉద్యోగులు  మోయాలి.  వాళ్లను MP,  MLA  లను  కాపాడాలి. వాళ్ళకు ,   ఇష్టం  ఇష్టంలేకపోయినా   గౌరవించాలి.   దీనిని  మార్చాలి.

ఎలెక్షన్  కమిషన్  MP,  MLA,  స్థానిక  సంస్థల  ప్రతినిధులకు పోటీ చేస్తున్న  అభ్యర్థులనుండి  పోలీస్  క్లియరెన్సు  సరిఫికేట్  తీసుకోవాలి.  ఇంకా  ఇన్కమ్  టాక్స్, ACB,  CBI,  నుండి  ఎటువంటి  కేసులు  లేవని  సర్టిఫికెట్  తీసుకోవాలి.

క్లియరెన్స్  లేకపోతే  వాళ్లకు  పోటీ  చేసే  అర్హత  లేదని  ప్రకటించాలి. గెలిచిన తర్వాత  ACB, CBI, పోలీసుల కేసులలో   ఉంటె   మంత్రులు,  MP,  MLAలు  వారిని  వెంటనే  డిస్క్వాలీఫై  చేసే విధంగా చట్టం  చేయాలి. పార్టీలు  మారితే వెంటనే  MP, MLA లకు అనర్హుడిగా చేయలి

సామాజిక ఉద్యమాల్లో , ప్రజా ఉద్యమాల్లో, కార్మిక ఉద్యమాల్లో, , మహిళా ఉద్యమాల్లో , ప్రజాతంత్ర ఉద్యమాల్లో , ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై జరిగిన ఉద్యమాల్లో కేసులు ఉంటె వాటిని కేసులుగా భావించ కూడదు.  ఆ కేసులను పోటి చేయడానికి అనర్హత గా చూడ కూడదు.

ACB , CBI , IT , ఆర్ధిక పరమయిన నేరాలు , అప్రజాస్వామిక చర్యల వలన కేసులు ఉన్న వారిని ఎనికల్లో పాల్గొనడానికి అనర్హులు. గెల్చిన తరువాత  దొరికినా వారిని అనర్హులుగా చేసేటట్లు చట్టం తేవాలి. బ్యాంకు లోన్లు ఎగ గొడుతున్న వాళ్ళు  పవిత్రమయిన పార్లమెంట్  అసెంబ్లీ లలో ఉండే అర్హత లేదు. దీనికొరకు ఒక చట్టం తేవాలి. PM ,మంత్రులు ,పార్లమెంట్ సభ్యలు  లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఏమిటి వీళ్ళు చేసేది. మంచి దేశం కోసం మంచి చట్టాలు చేయడానికే కదా.

 పార్లమెంట్ లో చట్టం  చేయించే టట్లు , మేధావులు, కృషి చేయాలి. ఉద్యమాలు రావాలి. ప్రజాస్వామ్య ఉద్యమాలు రావలి. రైతాంగ ఉద్యమాల లాగా రావాలి.  అపుడే బాబా సాహెబ్ అంబేద్కర్ , భగత్ సింగ్, ఉద్దం సింగ్ , షోయెబ్ ఖాన్  అమరవీరుల ఆశయాలు నెరవేరుతాయి .

కేసులు లేని వ్యక్తులు,  పార్లమెంట్ అసెంబ్లీ లలో ఉండాలి. దేశాన్ని  ఈ అప్రజాస్వామిక , రాజ్యంగ వ్యతిరేక శక్తుల  రక్షించాలి. పూర్వ ముఖ్య  ఎన్నికల  కమిషనర్  JM  లింగ్డో  గారు  రాజకీయ  నాయకులు  క్యాన్సర్లు  అని  అన్నారు.  వారిని  తొలగించడానికీ  కృషి  జరగాలి.  పైన  చెప్పిన  విధంగా   చేయాలి. పూర్వ ముఖ్య ఎన్నికల  కమిషనర్  TN  శేషన్ గారు  కూడ  గొప్ప  కృషి  చేసారు.  ఇంకా  చేయాల్సిఉంది చాలా వుంది.  రాజ్యాంగాన్ని దేశాన్ని కాపడుకోవాలి  

నిరక్ష్యరాస్యత , నిరుద్యోగంఆకలి చావులుఆత్మ హత్యలు,. స్త్రీల ఫై , దళితులపైదుర్మార్గాలుచూస్తూనే ఉన్నాము. శ్రమజీవులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.  ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. శ్రామికులను కాంట్రాక్టర్లకు , దోపిడీ శక్తులకు బలిచేస్తున్నారు ఉచిత విద్యా, ఉచిత వైద్యం అందటం లేదు బాల కార్మిక వ్యవష్ట కొనసాగుతుంది ఇటువంటి పరిస్థితులు మారాలి  మారాలంటే  రాజ్యంగ వ్యతిరేక శక్తుల  పై ఉద్యమించాలి.  రాజ్యాంగాన్ని దేశాన్ని కాపాడుకోవాలి.

రాజ్యంగ వ్యతిరేక శక్తులు  నశించాలి.   రాజ్యంగం వర్ధిల్లాలి

          రాజ్యంగ పరిరక్షణ వేదిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి