December 31, 2019 ·
Shared with Public
ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే UPSC, SSC, RRB, SPSCs, DSC, బ్యాంకు పరీక్షలు మొదలయిన పరీక్షలు పాసయినా, పోలిస్ క్లియరెన్స్ కావలి. ఎలెక్షన్ కమిషన్ అధికారులు, ఉద్యోగులు కూడా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే పోలీస్ క్లియరెన్స్ కావాలి.
గ్రూప్ డి పోస్టుల నుండి IAS అధికారుల వరకు పోలీసు క్లియరెన్స్ ఉంటేనే ఉద్యోగాలలో చేరగలరు.
కాని MLA, MP స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నికలకు ఎవరయినా ఎన్ని కేసులు ఉన్న పోటీ చేయవచ్చు.
వాళ్లు గెలిచిన తర్వాత PM, CM లు మంత్రు లయితే ఆ చెత్త గాళ్ళ ఫైళ్లు ప్రభుత్వ ఉద్యోగులు మోయాలి. వాళ్లను MP, MLA లను కాపాడాలి.
వాళ్ళను, ఇష్టం ఇష్టంలేకపోయినా గౌరవించాలి.
ఏమిటీ ఈ పరిస్థితి. దీనిని మార్చాలి.
ఎలెక్షన్ కమిషన్ MP, MLA, స్థానిక సంస్థల ప్రతినిధులకు పోటీ చేస్తున్న అభ్యర్థులనుండి పోలీస్ క్లియరెన్సు సరిఫికేట్ తీసుకోవాలి. ఇంకా ఇన్కమ్ టాక్స్, ACB, CBI, నుండి ఎటువంటి కేసులు లేవని సర్టిఫికెట్ తీసుకోవాలి.
క్లియరెన్స్ లేకపోతే వాళ్లకు పోటీ చేసే అర్హత లేదని ప్రకటించాలి.
గెలిచిన తర్వాత ACB, CBI, పోలీసుల కేసులలో ఉంటె మంత్రులు, MP, MLAలు వారిని వెంటనే డిస్క్వాలీఫై చేసే విధంగా చట్టం చేయాలి.
దేశాన్ని ఈ చెత్త రాజకీయ నాయకుల నుండి రక్షించాలి.
పూర్వ ఎన్నికల కమిషనర్ JM లింగ్డో గారు రాజకీయ నాయకులు క్యాన్సర్లు అని అన్నారు. వారిని తొలగించడానికీ కృషి జరగాలి. పైన చెప్పిన విధంగా చేయవచ్చు. చేయాలి.
పూర్వ ఎన్నికల కమిషనర్ TN శేషన్ గారు కూడ గొప్ప కృషి చేసారు.
ఇంకా చేయాలి.
పైన చెప్పిన విధంగా చేసి ఈ చెత్త రాజకీయ నాయకుల నుండి దేశాన్ని కాపాడాలి.
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.
రాజ్యాంగం వర్ధిల్లాలి.
డబ్బు మద్యము బహుమతులు పంచె వాళ్ళు నశించాలి
జోహార్ బాబాసాహెబ్ అంబెడ్కర్.
కామేశ్వర రావు
గ్రూప్ అడ్మిన్
రాజ్యాంగ పరిరక్షణ వేదిక
FB గ్రూప్
30D Nagarjuna, Rajamallaiah Uppuleti and 28 others
1 Comment
113 Shares
Share