Kameswara Rao Velpuri toForum for Lal Neel labour parties
100 సంవత్సరాలయిన కమ్యూనిష్టు పార్టీ మనదేశంలోఎందుకు విజయవంత కాలేదు
____________________________________
కమ్యూనిష్టు పార్టీ అఫ్ ఇండియా స్థాపించి 100 సంవత్సరాలయింది..
ఇక కమ్యూనిష్టు పార్టీలు సంవత్సరీకాలు జరుపుతాయి. పండగలు జరుపుతాయి.
నాకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి
సోవియట్ యూనియన్ లో కమ్యూనిష్టు పార్టీ స్థాపించి ఉద్యమించి 19 సంవత్సరాలకె కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకొచ్చారు లెనిన్, స్టాలిన్, ట్రాట్స్కీ నాయకత్వంలో విజయాన్ని సాదించారు
చైనా లో కమ్యూనిష్టు పార్టీ అఫ్ చైనా ను స్థాపించి మావో చొఎంలై, లింపియావో , లీషావచి నేతృత్వంలో ఉద్యమించి 28 సంవత్సరాలకు కమ్యూనిష్టు పార్టీని అధికారం లోకి తీసుకు వచ్చారు.
యునైటెడ్ పార్టీ అఫ్ క్యూబన్ సోసిలిస్ట్ రెవల్యూషన్ (United Party of the Cuban Socialist Revolution) కాస్ట్రో , చేగువేరా నేతృత్వంలో 7 సంవత్సరాలల్లోనే అధికారం లోకి వచ్చి తరువాత 1965 లో కమ్యూనిస్టు పార్టీగ మార్చుకున్నారు .
మరి మన దేశం లో కమ్యూనిష్టు పార్టీ ఎందుకు 100 సంవత్సరాలయిన అధికారం లోకి రాలేక పోయింది. కేరళ , వెస్ట్ బెంగాల్ త్రిపుర రాష్ట్రాలలో అధికారం లోకి వామ పక్ష ఐక్య సంఘటన , వామ పక్ష ప్రస్వామ్య ఐక్య సంఘటన ప్రభుత్వాలు ఏర్పడి నాయి. వెస్ట్ బెంగాల్ త్రిపురలో ప్రభుత్వాలను కోల్పోవడం జరిగింది.
52 సంవత్సరాల నక్సల బరి ఉద్యమ ప్రాభవంతో ఏర్పడిన ML పార్టీలు ఎక్కడ విజయవంతంఅయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి .
కామ్రేడ్స్ డాంగే PC జోషి , చండ్ర రాజేశ్వర రావు , రణదీవె , సుందరయ్య , చారు మజుందార్, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వర రావు, కొల్ల వెంకయ్య ,కొండపల్లి సీతారామయ్య ,బర్ధన్ గార్ల కృషి ఎందుకు విజయవంత మయి కమ్యూనిష్టు పార్టీ అధికారం లోకి రాలేక పోయింది.
సురవరం సుధాకర్ రెడ్డి, ప్రకాష్ కారత్ , సీతారాం ఏచూరి , ఇంకా ఇతర ML పార్టీల , మావోయిష్టు పార్టీల నాయకుల కృషి ఎందుకు ఇతర దేశాల కమ్యూనిష్టు పార్టీలు విజయ వంతమయినట్లు విజయ వంతం కావడం లేదు
ఏమయినా పేర్లు మరచి పోతే క్షమించండి
మరి మన దేశం లో 100 సంవత్సరాలయిన మన దేశంలో కమ్యూనిష్టు పార్టీ చరిత్ర వున్న ఎందుకు విజయవంతం అయి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయాయి.
ఎన్ని త్యాగాలు. వేలకొద్దీ అమరవీరులు .
ఈ దేశం లోని కమ్యూనిష్టు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆలోచించు కోరా. ప్రశ్నించు కోరా , ఏడుపు రాదా .
మన దేశంలో విజయవంతం కాలేక పోవడానికి కారణాలు కావాలి.
అసలు కామ్రేడ్ స్టాలిన్ , CPSU , 1947 లోనే కమ్యూనిష్టు పార్టీ పేరు లేబర్ పార్టీ గా పేరు మార్చుకొని పని చేయండి అని సలహాను ఆనాటి సిపిఐ నాయకులు డాంగే , జోషి ఎందుకు ప్రక్కన పెట్టారు..
కారణాలు నన్నే చెప్పమంటారు. సరే నేనే చెబుతాను ఆ దేశాల్లో క్రిష్టియన్, బౌద్ధ మతము వారికి ఉపయోగ పడినాయి. మన దేశం లో ఉన్న మను ధర్మము పీడక కుల హిందూ మతం మన వాళ్లకు మైనస్ పాయింట్. ఎన్ని త్యాగాలు చేసిన వృధా . ఈ విషయం మన నాయకులకు తెలుసు కానీ చెప్పరు . ఇది నాకు తెల్సిన సత్యము.
సాధించింది చీలికలు పేలికలు . బీజేపీ ని అధికారంలోకి తేవడం చంద్ర బాబు నాయుడ్ని, జగన్ మహ రెడ్డిని, కేసీఆర్ పెరగడానికి ఉపయోగ పడటం పీడక కుల నాయకులు వాళ్ళ పార్టీల అభివృద్ధికి ఉపయోగ పడటం
మీరు కూడా కారణాలు చెప్పండి. రాయండి
జోహార్ అమర వీరులకు జోహార్
విప్లవం వర్ధిల్లాలి
సోషలిజం వర్ధిలాలి
పీడక కులాల అప్రజాస్వామ్యము నశించాలి
కామేశ్వర రావు
ఇండియాన్ లేబర్ పార్టీ
అధికార ప్రతినిధి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి