కమ్యూనిష్టు పార్టీ నాయకులు చేసిన ఘోరమయిన చారిత్రక తప్పిదం
1947 సెప్టెంబర్ లోనే మన సిపిఐ నాయకులూ డాంగే గారు PC జోషి గార్లకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ (CPSU ) కేంద్ర కమిటీ భారత దేశంలో కుల సమస్య ఉంది. దానిని పరిష్కరించాలి, లేకపోతే ఇదే పెద్ద సమస్య అవుతుందని చెప్పారు.
ఇంకా ఈ పెద్ద సమస్య పట్ల శ్రద్ద పెట్టాలి అని చెప్పారు.
చదవండి.
నేను మొత్తం PDF కూడా చేసి FB పెట్టాను. మీరు డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసు కోవచ్చు..
CPSU వాళ్లకు మన సమస్య తెలిసి ఇది పెద్ద సమస్య అని తెలిస్తే మన వాళ్లకు ఎందుకు తెలియలేదు.
వాళ్ళు చెప్పిన ఎందుకు పట్టించుకోలేదు. వాళ్ళు అంబెడ్కర్ గారు కాలేదు కదా. ఆనాటి అంతర్జాతీయ కమ్యూనిష్టు నాయకులు కదా.
ఎందుకు కామ్రేడ్స్ డాంగే, PC జోషి ఎందుకు పట్టించు కోలేదు. ఇంకా కమ్యూనిష్టు పార్టీ పేరును లేబర్ పార్టీ గా మార్చుకోండి అని సలహాను ఎందుకు స్వీకరించలేదు . ఎందుకంటే ఇద్దరు బ్రాహ్మణలు కాబట్టి. అని అంటాను. పార్టీలో వాళ్ళు పీడక కులాల వాళ్ళే వున్నారు కాబట్టి CPSU నాయకులు ఇచ్చిన సలహాను స్వీకరించలేదు. చివరికి పార్టీలో చర్చ పెట్టలేదు.
కామ్రేడ్స్ CPSU ఇచ్చిన సలహాను స్వీకరించి పాటించి ఉన్నట్లయితే మన దేశంలో ప్రజస్వామ్యము సోషలిజం ఎపుడో వచ్చి ఉండేవి. అపుడే అంబేద్కర్ను చదివి ఉండేవారం. సామాజిక పోరాటాలను చదివి ఉండేవారం. అంటే మన సీనియర్లు. దేశం మారిపోయి ఉండేది.
ఇడి ఘోర చారిత్రక తప్పిదం . దేశం నష్టపోయింది.
కారంచేడు, చుండూరు పడిరి కుప్పము , లక్షింపేట ........మొదలయినవి జరిగి ఉండేవి కావు. దళితుల మీద అత్యాచారాలు ఎపుడో ఆగిపోయి ఉండేవి. రోహిత్ లాంటి వాళ్ల్లు ఆత్మ హత్య చేసుకుని వుండే వాళ్ళు కాదు. ఇన్ని త్యాగాలు జరిగి ఉండేవి కావు. కాకపోతే అపుడే సంఘర్షణ జరిగి ఉండేది . కానీ ఇపుడు పార్టీలలోనే చర్చకొచ్చింది. సంఘర్షణ పడుతున్నారు. కె.జి సత్యమూర్తి గారు ,ఉసా గారు మారోజు వీరన్న గారు, కంచ ఐలయ్య గారు ,తారకం గారు పద్మారావు గారు మొదలయిన వారు క్రిందటి 80, 90 దశాబ్దాల్లో చర్చలు లెవా దీసేవారు కాదు కదా. బహుశా ఈ చర్చలు CPSU సలహాను ఆనాడే భారత కమ్యూనిష్టు పార్టీ ల నాయకులు పాటించి ఉంటె సీనియర్ కామ్రేడ్స్ ఈ కృషి ఆ రోజే చేసి ఉండేవారు. అసలు ఈనాడు మనం వేస్తున్న ప్రశ్నలు అనేది ఆగస్టు , సెప్టెంబర్ 1947 లోనే సోవియట్ కమ్యూనిష్టు పార్టీ ల నాయకులు వేశారు. లేదా చెప్పారు.
మనం చారిత్రక భౌతిక వాదం తో పాటు. భారత దేశ చారిత్రక భౌతిక వాదం పీడిత కులాల చరిత్ర. వారి బాధలు,వారి కన్నీళ్లు, వారి కసి. వారి కోపం, వారి పోరాటాలు కమ్యూనిష్టు లనుకుంటున్న వారు చదవాలి. ఎర్రజెండా పట్టుకోవడం అంటే ఇవన్నీ చదవడం. CPSU వాళ్ళు 1947 లోనే చదివి ఎర్రజెండా పట్టుకున్న బ్రాహ్మణలకు , మను వాదులకు చెప్పారు. వాళ్ళు వినలేదు. అందుకే ఈ సమస్యలు ఇంకా మన ముందు ఉన్నాయి. తలకాయలను బద్దలు కొడుతున్నాయి CPSU కేంద్ర కమిటీ నాయకులు ఈ సమస్య ను సీరియస్ గా పట్టించు కోవాలని సెప్టెంబర్ 1947 లోనే చెప్పారు. మన బ్రాహ్మణులు పీడక కులాలు వాళ్ళు వినలేదు. ఎర్రజెండా పట్టుకొని కూడా వినలేదు. ఎందుకంటే మనువాదం ఉంది కాబట్టే.
అందుకే BJP మనువాదం అధికారం లోకి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఉద్యమాల్లో ఉన్న మనువాదులకు సమస్యలు వస్తే హాని జరుగుతుంటే అధికారం లో వున్నా మను వాదుల వద్దకు , పీడక కులస్తుల వద్దకు వెళ్లారు.
మన కమ్యూనిష్టు పార్టీల నాయకులు ఈ 1947 లో జరిగిన చర్చ లు చదివి లేరా. చదవలేడా . చదివిన క్రింద నాయకత్వానికి చెప్పలేదా. అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఈ నాయకులు CPSU కేంద్ర కమిటీ నాయకులను కుల వాదులు గా ముద్ర వేస్తారా. వేయవచ్చు . మనువాదులు కదా. రంగనాయకమ్మ గారు వారి అనుచరులు CPSU కేంద్ర కమిటీ నాయకులను కులవాదులుగా చెప్పవచ్చు. అంతే కాదు.CPSU వాళ్లకు వర్గ దృక్పధం లేదని కూడా రాయవచ్చు. సరే అది వారిష్టం. అనుకోండి.
కామ్రేడ్స్ 1947 లోనే CPSU కేంద్ర కమిట ఇచ్చిన సలహాను స్వీకరించి ఆచరించి నట్లయితే అంబెడ్కర్ ఆలోచనలను తీసుకొని వారితో కల్సి పని చేసే వారు. దేశంలో ఎపుడో ప్రజాస్వామ్యము సోషలిజం వచ్చి ఉండేవి. RPI ,BSP . బహుజన పార్టీలు , అంబెడ్కర్ పార్టీలు , కుల సంఘాలు వచ్చి ఉండేవి కావు.
TDP . TRS , YSRCP మొదలయిన పీడక కుల పార్టీలు పుట్టివుండేవి కావు .
సంపూర్ణ అక్షరాస్యత ఎపుడో సాధించి వుండే వారం . వైద్యము ప్రభుత్వ చేతిలోనే ఉండేవి . విద్య వైద్యము పూర్తిగా ప్రభుత్వ చేతిలోనే ఉండేవి. పరిశ్రమలు ప్రభుత్వ చేతిలోనే ఉండేవి. భూమి దున్నేవానికే భూమి ఉండేది. డబ్బు మద్యము బహుమతులు పంచె వాళ్ళు వుండే వారు కాదు.
ఎన్ని త్యాగాలు. ఎంతమంది నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు త్యాగాలు చేసారు చేస్తున్నారు .ఎంతమంది అమర వీరులు . కాని ప్రజస్వామ్యము సోషలిజం రాలేదు. ఆనాడే మన నాయకులూ CPSU నాయకుల చెప్పిన సూచనలు పాటించి ఉంటే విజయాన్ని అందుకునే వాళ్ళము . అందుకే ఘోరమయిన చారిత్రక తప్పిదం అని రాస్తున్నాను.
మరల మొదటి కొచ్చాము .
కామేశ్వర రావు.
ఇండియన్ లేబర్ పార్టీ
అంబెడ్కర్ ఫూలే
అధికార ప్రతినిధి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి