సారా వ్యతిరేక ఉద్యమకారిణి దూబగుంట రోశమ్మ 7.8.2016న నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంటలో కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. కిడ్నీ వ్యాధితో, ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో వైద్యానికి దూరమయి చనిపోయారు.
మనదేశం లో ఇదొక విషాదం.
మద్యనిషేధ ఉద్యమ రూపకర్త
1990ల్లో సారా వ్యతిరేక ఉద్యమం ఉప్పెనగా మారడానికి రోశమ్మే కారణం. నెల్లూరు జిల్లాలోని దూబగుంట నుంచి ఆమె 1992లో పూరించిన సారా వ్యతిరేక ఉద్యమ శంఖం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించింది. ఈ క్రమంలో ఆమెకెన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. సారా మాఫియా ఆగడాలు, పోలీసు కేసులు, పెద్దల బెదిరింపులెన్నింటినో తట్టుకుని ఉద్యమంలో ముందుకుసాగారు. జిల్లాలోనేగాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారు. 1994నాటి ఎన్నికల సందర్భంగా టీడీపీ అధికారంలోకొస్తే సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తానని ఆనాటి టీడీపీ అధినేత ఎన్టీఆర్ ప్రకటించడానికి రోశమ్మ ఉద్యమమే ప్రధాన కారణం. ఇచ్చినమాట ప్రకారం 1995 జూన్ 1నుంచి సంపూర్ణ మద్యనిషేధం అమలుచేస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఎన్టీఆర్ తొలి సంతకం చేశారు. ఈ నిషేధం 1997 మార్చి వరకు కొనసాగింది. చంద్రబాబు అధికారపగ్గాలు చేపట్టాక మద్యనిషేధాన్ని ఎత్తివేశారు. ఇది
చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గమయిన చర్య.
ఈనాడు తెలుగు రాష్ట్రాలలో మద్యం ఏరులయి పారుతుంది.
బడులు ఎక్కువ లేవుగాని మద్యం షాపులు ఎక్కువ వున్నాయి.
మద్యపాన వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇంకా జరగాలి.
మద్యం బందు కావాలి.
సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి.
జోహార్ సార వ్యతిరేక ఉద్యమకారిణి రోశమ్మ జోహార్ర్.
మద్య పాన వ్యతిరేక ఉద్యమాలు వర్ధిల్లాలి.
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
కామేశ్వరరావు
అధికార ప్రతినిది
ఇండియన్ లేబర్ పార్టీ
(అంబేద్కర్, పులే)
My writings, comments and opinions on social, political, literary and cultural issues. -- Velpuri Kameswara Rao
వ్యాసాలు - రచనలు
6, ఆగస్టు 2020, గురువారం
దూబగుంట రోశమ్మ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి