22, జులై 2020, బుధవారం

ఇది నేను ఒక అవసరం కోసం రాసాను.
ఇలా రాసినందుకు ఎవరి కయిన
కోపం వస్తే క్షమించండి
జోహార్ అమర వీరులకు.
----------------------
మిత్రులారా,
నేను చని పొతే,
చంపబడితే,
అభిమానంతో
జోహార్లు చెబుతూ
కరపత్రాలు వేయాలన్న,
మీటింగులు పెట్టాలనుకున్న,
ఊరేగింపులు చేయాలనుకున్న,
పాటలు, కవితలు రాసి
పుస్తకాలు రాసి
ప్రచురించాలన్న.
మీ డబ్బుతోనే చేయండి.
ప్రజల శత్రువులయిన
అగ్ర కుల భూస్వాముల వద్ద,
పెట్టుబడి దారి విధానాన్నీ వ్యతిరేకించలేని వారి వద్ద
సమత, మమత, ప్రగతి, శాంతి వ్యతిరేకులవద్ద
ప్రజలకు డబ్బు మందు, బహుమతులు పంచె వారి వద్ద
చందాలు తీసుకొని
జోహార్లు చెప్పకండి.
కరపత్రాలు వేయకండి.
మీటింగులు పెట్టకండి.
పాటలు రాయకండి.
కవితలు రాయకండి.
.......................
అలా చేస్త నా శవం మిమ్మల్ని
పీక్కు తినుద్ది
మిమ్మల్ని నేను క్షమించను.
----------------------------
జోహార్లు అమర వీరులకు.
విప్లవం వర్ధిల్లాలి.
సమత , మమత, ప్రగతి, శాంతి,
వర్హిల్లాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి