46m
Shared with Public
వర్గ కుల పోరాటాలు జమిలిగా జరగాలి. ఇది తప్పదని చెప్పిన కామ్రేడ్ ఊసా గారు కరొనతో చనిపోయారని తెలిసింది.
ఏంతో వేదనగా వుంది.
బహుజన,దళిత ఉద్యమ మేధావి, సామాజిక అణచివేతను వ్యతిరికిస్తూ, పీడిత కులాల ప్రజల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి వారిమరణం సమాజానికి తీరని లోటు..
వారు రాసిన
మేం పాడుతాం
జనం పాట పాడుతాం ....
-------------
జోలాలి
పాడాలి
ఈ జోల పాటతో ఆపాలి
-------------------
అంటూ 80 వ దశాబ్దంలో జనసాహితి సంస్థలో పాడేవాళ్లం . ప్రజల్లోకి తీసుకెళ్ళేవాళ్లం .
వ్యక్తి గత పరిచయం .
4 నెలల క్రితం విశ్వకర్మల నిరాహార దీక్ష చేస్తున్న సందర్బంగా కలవడం జరిగింది. నేను రాసిన అగ్నిగోళాలు పుస్తకము ఇవ్వవడం జరిగింది.
ఆ పుస్తకము బాక్ కవర్ పేజీలో వున్నా
మావి కన్నీళ్లు కావు
తుపాకీ గుండ్లు .
మావి ఆవేదనలు కావు
అణుబాంబులు
తో వున్నా కవర్ పేజీతో ఫోటో దిగాలని కోరుకోవడంజరిగింది . కానీ అది అంత బాగారాలేదు.
ఇంటినుంచి బయటకు పోకూడదు.కదా. పుస్తకాలు చదువుతున్నాను. వారు ప్రచురించిన ఎదురీత ప్రచురణ అస్తిత్వవాదంపై రంగనాయకమ్మ రగడ కులం పై శ్రీ శ్రీ పుస్తకము చదువుతున్నాను.
ఈ రోజు చని పోయారని వార్త .
ఏమిటోగా వుంది.మెదడు బ్లాంక్ అవుతుంది.
పీడిత కులాల ప్రజల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి వారిమరణం సమాజానికి తీరని లోటు..
కా మ్రేడ్ ఉ సాంబశివరావు గారికి విప్లవ జోహార్లు
కామేశ్వర రావు
ఇండియన్ లేబర్ పార్టీ
అంబెడ్కర్ ఫుల్
అధికార ప్రతినిధి.
25.7.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి