7, జులై 2020, మంగళవారం

ులను ఎదురుకాల్పులు పేరుతో చంపుతున్నారు. ఇంతకాలం ఓర్చుకున్నాను, సహించాను.
ఇక నేను తట్టుకోలేక పోయాను. అందుకే మీకు గుణపాఠం నేర్పటానికే, ప్రజల్లో సమానత్వం తీసుకొని రావాలని,ఒక సోషలిస్టు భావజాలంను నమ్మిన వైరస్ గా మారి చెడిపోయిన సోషలిస్టు దేశమైన చైనాలో ఉదయించాను,(క్యూబా,వియత్నం జోలికి వెళ్ళలేదు.) ,జన్మించాను.
అందుకే విప్లవ వ్యతిరేకులు,సోషలిస్టు వ్యతిరేకులు.అభ్యుదయ వ్యతిరేకులు, పెట్టుబడి ,ధనిక దేశాల్లోకి,అమానవీయం మూర్తీభవించిన దేశాల్లోకి ప్రవేశించాను.అందుకే ఇప్పుడు అమెరికాకు చెమటలు పట్టిస్తున్నాను. బ్రిటన్ని లొంగదీసుకున్నాను. యూరోపియన్ దేశాలను వణికిస్తున్నాను.
ఇండియా లో భరత మాత అని గొప్పగా చెప్పడమే తప్ప స్త్రీలపై హత్యాచారాలు అత్యాచారాలను నిర్ములించలేకపోతున్నారు దోషులను వెంటనే శిక్షించలేకపోతున్నారు .
కేరళ ఒకటే సోషలిష్ట్ దృక్పధం తో ఉండటం వలన నన్ను కేరళ ల లోకి రాకుండా చూచు కోగలిగింది.
వైద్యాన్ని వ్యాపారంగా మార్చి ప్రభుత్వ వైద్యాన్ని నిర్మూలించారు. నిర్మూలిస్తూన్నారు. మిమ్మల్ని వదలను.
విద్యా, వైద్యాన్ని వ్యాపారం చేసారు. మిమ్మల్ని వదలను.
అసమానతలు అశాంతికి మూలం అని తెలుసుకొనేదాకా వదలను.
దేవాలయాలు, చర్చీలు, మసీదులు అసమానతలు పెంచే కేంద్రాలు. అందుకే వాటిని కూడా వదలలేదు. చివరికి అవే నా పెంపుకు ఉపయోగ పడినాయి. పడుతున్నాయి. మూత వేసుకోవాల్సి వచ్చే టట్లు చేసాను.
విద్యార్థులను, యువకులను ఆలోచించకుండ చేస్తున్న, హంతకులుగా, రేపిస్టులుగా, చేస్తున్న సినిమా హాల్స్ ను మూత బడేటట్లు చేసాను.
మనువాద భావజాలంతో విర్రవీగుతున్న పీడక కులస్థులను వారి బానిసలను వదలను.
ఏదో స్వామీజీలు, బాబాలు, యోగులు ఏదో చేస్తారని అనుకుంటున్నారా నన్ను ఏమి చేయలేరు. వాళ్ళే వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళను వదలను.
బాబా సాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి అయిన ప్రజాస్వామ్యాన్ని, సోషలిజాన్ని తుంగలో తొక్కిన మిమ్మల్ని, మీ బానిసల్ని, వదలను.
మీలో సోషలిజం, ప్రజాస్వామ్యము, సమ భావం వచ్చేవరకు మిమ్ము వదిలే ఛాన్స్ లేదు .బై బై
ఇట్లు.
కరోనా,ముద్దుపేరు,
కోవిడ్ 19.S/0 ,D/౦ SARS 1,SARS
29.6.2020.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి