8, ఆగస్టు 2015, శనివారం

నాకు భారత రత్న ఇవ్వాలి.


నాకు వేల భారత రత్నలు ఇవ్వాలి.
మన ప్రియమయిన 
భారత దేశంలో 
మన ప్రియమయిన 
ప్రజాస్వామ్యాన్నీ రాజ్యంగాన్నీ 
కాపాడ టానికి,

డబ్బు మందు, బహుమతులు
పంచేటట్లు చేసి, పంచి,
ప్రధానమంత్రి , ముఖ్యమంత్రులు. మంత్రులు,
పార్లమెంట్, అసెంబ్లీ సభ్యులను
అయిన వాళ్ళను,.
కాల్చి చంపిన నాకు
ఉరి శిక్ష కాదు
వేయాల్సింది.
భారత రత్న ఇవ్వాలి.
ఒకటి కాదు,
పది వేల భారత రత్నాలు ఇవ్వాలి.
----------
భారత ఎన్నికల ప్రధాన అధికారి,
రాజకీయ నాయకులే
ఈ దేశానికి కేన్సర్లన్న
మాజే ఎన్నికల ప్రధాన అధికారి.
జే.ఎం.లింగ్డో గారు,
ఎన్నికల్లో డబ్బు మందు బహుమతులు
ఉండ గూడదు, పంచ కూడదు అంటూ
పోరాడుతున్న
పార్టీలు, నాయకులు, ప్రజలు,
దళితులు , బి.సిలు
రచయితలూ కళాకారులు, జర్నలిస్టులు,
వ్యక్తులు, సంస్థలు,
నాకు ఉరి శిక్ష కాదు
వేయాల్సింది.
భారత రత్న ఇవ్వాలి
అని రికమెండ్ చేయాలి.
-------------
బ్రతికున్న,
పద్మశ్ర్రిలు, పద్మ విభూషన్లు , భారత రత్నలు,
నాకు ఉరి శిక్ష కాదు
వేయాల్సింది.
భారత రత్న ఇవ్వాలి
అని రికమెండ్ చేయాలి.
--------------
నాకు భారత రత్న ఎవార్డ్ ఇవ్వాడానికి
రాష్ట్రపతి అర్హుడు కాదు.
ఎందుకంటే వారిని కూడా
డబ్బు, మందు , బహుమతులు
పంచిన వాళ్ళే ఎన్నుకున్నారు.
కాబట్టి మీరే ......
మన ప్రియ మయిన
ప్రజా స్వామ్యం కోసం, రాజ్యంగం కోసం
తపన పడుతున్న
భారత ఎన్నికల ప్రధాన అధికారి,
రాజకీయ నాయకులే
ఈ దేశానికి కేన్సర్లన్న
మాజే ఎన్నికల ప్రధాన అధికారి.
జే.ఎం.లింగ్డో గారు,
ఎన్నికల్లో డబ్బు మందు బహుమతులు
ఉండ గూడదు, పంచ కూడదు అంటూ
పోరాడుతున్న
పార్టీలు, నాయకులు, ప్రజలు,
రచయితలూ కళాకారులు, జర్నలిస్టులు,
వ్యక్తులు, సంస్థలు,
నేను భారత్ రత్న ను అని ప్రకటించాలి.
ఎందుకంటే
నాకు భారత రత్న ఎవార్డ్ ఇవ్వాడానికి
రాష్ట్రపతి అర్హుడు కాదు.
ఎందుకంటే వారిని కూడా
డబ్బు, మందు , బహుమతులు
పంచిన వాళ్ళే ఎన్నుకున్నారు
---------
అపుడే
స్వాతంత్ర్య కోసం అమరులయిన
భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్, అల్లూరి
భారత దేశానికి ఒక గొప్ప రాజ్యంగాన్నీ ఇచ్చిన
ఒక సామాజిక, సమత మమత ప్రగతి, శాంతి
కోరుకున్న
బాబాసాహెబ్ అంబేద్కర్,
స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వంవహించి
మతోన్మాదుల చేతిలో చని పోయిన
మహాత్మాగాంధీ
సమ సమజం కోసం
అసువులు బాసిన,
నాయకులు, అమరవీరులు
ఆనంద పడతారు .
------
సమ సమాజం ఆశించిన
గౌతమ బుద్ధుడు,
చార్వాకులు, లోకాయతులు
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామీ,
మహాత్మా జ్యోతిరావు పులే
పెరియారు, నారయణ గురు
ఆనంద పడతారు..
-----------------
కామూ.
9 .8. 15
-----------------
నా ఈ కవిత
అణుబాంబుల వలన
హిరోషిమా నాగసాకి
చని పోయిన ప్రజలకు అంకితం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి