4, జులై 2015, శనివారం

on cancellation of ACB and other

ఇంకా ఎందుకు ACB , CBI, CAG , CVC ఇతర సంస్తలు ఇవన్నీ ఒక దళితుడు, ఒక బి సి , ఒక టీ బాయ్ , ఒక పేపర్ బాయ్ , ఒక అటో కార్మికుడు , ఓకే కూలి, ఒక కార్మికుడు ఉద్యోగులు తప్పు చేస్తే,. సిక్షించ డానికేనా పెద్ద వాళ్ళు తప్పు చేస్తే సిక్షలు ఉండవా.
చంద్ర బాబు నాయుడు , మోడీ ప్రభుత్వాలకు పూర్తీ మెజారిటీ ఉంది. ఎందుకు మీ కు ఈ తలకాయ నొప్పులు. వీటిని రద్దు చేసేందుకు అర్దినన్సు తీసుకు వస్తే సరి పోతుంది. ఎలక్షన్లలో కూడా అవినీతి పరులు బాగా పని చేసి వోట్లు వేయిస్తారు.
ఇంకా ఒక అంటరాని వాడు రాసిన రాజ్యాంగం ఎందుకు. ఒక చిత్త గ్రంధం. ఇంకా దాని మీద ప్రమాణం చేయడమేమిటి.
అంబేద్కర్ ను రాజ్యంగాన్నీ అబి మానించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు బాధ పడటం దేనికి. రాజ్యాంగం అవసరం లేదు. అది అవుట్ డేట్ అని తీసి వేయవచ్చు..
మీరే మీకు తోచినట్లుగా రాయడానికి చాల మంది ఉన్నారు. అలాంటి మేధావులు చాలామంది దొరుకుతారు. మీరు కోట్లు ఇవ్వగలరు. అమ్ముడు పోయే మేధావులు చాలామంది ఉన్నారు.
ప్రతి పక్ష పార్టీలు కూడ ఏమి సీరియస్ గా తీసుకోవు. ఎందుకంటే వాళ్ళకు ఇవి తలకాయ నొప్పిగానే ఉన్నాయి. అందరు డబ్బు, మందు, బహుమతులు పంచే వాళ్ళేగా.
కమ్యునిస్టు పార్టీలు ఏమి కూడా ఉద్యమాలు చేయవు. ఎందుకంటే అవినీతీ వారికి సమస్య కాదు.
కొత్త రాజ్యాంగాన్ని రాయించు కొండి.
మీకు తలకాయి నొప్పి ఉండదు. ప్రజల డబ్బు వృధా కాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి