31, జులై 2015, శుక్రవారం

uriteeta

ఉరితీతలు సరి అయినవే అనుకుంటే 
నాకు 25 కోట్ల ఉరితాళ్ళు కావలి..
25 కోట్లమంది తలారులు కావలి.
అవును నిజం కావలి
నాకు 25 కోట్ల ఉరితాళ్ళు కావలి..
25 కోట్లమంది తలారులు కావలి.
-----------
నాకు 25 కోట్ల ఉరితాళ్ళు కావలి
రైతులు ఆత్మ హత్యలు చేసుకోవడానకి
ఆర్ధిక విధానాలు అనుసరిస్తున్న పాలకులను
ఉరితీయదాకి,
---------
యువతులను, విద్యార్దునులను,
ఆత్మ హత్య చేసుకోవాడానికి
కారణమవుతున్న హంతకులను తయారు చేస్తున్న
సినిమా దైరేక్తర్లను , నిర్మాతలను, హీరోలను,
హీరోయిన్లను, మ్యూజిక్ డైరెక్టర్లను,
ఉరితీయడానికి,
----------
దళితులకు, బి.సిలకు,
విద్య లేకుండా చేసి
బానిసలు గ మార్చి
జోగినిలను వాళ్ళ కు బిడ్డలను ఇచ్చిన
ఆత్మ హత్య చేసు కోవడానికి కూడా
ధైర్యాన్నీ, అందించకుండా,
మానసిక వికలాంగులను చేసీ,
డబ్బు, మందు బహుమతులు పంచి
పవిత్రమయిన, పార్లమెంటు లను, అసెంబ్లీ లను
నాశనం చేస్తున్న
ప్రజాస్వామ్యాన్నీ చంపుతున్న
రాజ్యంగాన్నీ తగల బెడుతున్న
అగ్రవర్ణ, అగ్ర కుల స్తు లను , వారి బానిసలను
ఉరితీయడానికి
-------------
ఇలాంటీ వారిని బ్రతకనిస్తున్న
ఆ ముక్కోటి దేవతులను, దేవుడ్లను
ఉరితీయడానికి,
-------------
నాకు 25 కోట్ల ఉరితాళ్ళు కావలి.
25 కోట్లమంది తలారులు కావలి.
--------
ఆ 25 కోట్లమంది చస్తే, చంపితే
అపుడే
స్వాతంత్ర్య కోసం అమరులయిన
భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్, అల్లూరి
భారత దేశానికి ఒక గొప్ప రాజ్యంగాన్నీ ఇచ్చిన
ఒక సామాజిక, సమత మమత ప్రగతి, శాంతి
కోరుకున్న
బాబాసాహెబ్ అంబేద్కర్,
స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వంవహించి
మతోన్మాదుల చేతిలో చని పోయిన
మహాత్మాగాంధీ
సమ సమజం కోసం
అసువులు బాసిన,
నాయకులు, అమరవీరులు
ఆనంద పడతారు .
------
సమ సమాజం ఆశించిన
గౌతమ బుద్ధుడు,
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామీ,
మహాత్మా జ్యోతిరావు పులే
పెరియారు, నారయణ గురు
ఆనంద పడతారు.
-------
వారి ఆనందాన్నీ చూసే
నాకు ఆనందం వేస్తుంది.
సంతోషం వస్తుంది.
------
అందుకే
నాకు 25 కోట్ల ఉరితాళ్ళు కావలి.
25 కోట్లమంది తలారులు కావలి.
-------------------కామూ

26, జులై 2015, ఆదివారం

on capitla



I am a student of Sociology, reader of Marxism, Ambekdar thought, Nehru peoples approach.
Hence I have searched where is my place in Chandra Babu Nayudu nayudu- Singapore capital. I have searched for education institutions. like Central universities, IITs, IIMs leave Primary education school. .Not seen.
I have searched for agriculture since we want food to eat. We can not eat sand, Cement . Not seen.
I got a doubt how and from where food will come for the people who live in that capital.
Left parties leaders have developed Chandra babu Nayudu and his party. There is no place fro them in that Capital. If you put red flag, you will be in jail. If you do more you will die in Encounter.
Even Chandra Babu Nayudu not allowed his own ministers in discussion with Singpore people. That is the state of his own cabinet minsters .This is business.
Parliament appointed Sivaraman Committee for capital.It has submitted its report. Parliament was by passed.
No Parliament No assembly, No cabinet. .....
What a state of affair.
Leave Marx., there is no place Nehru, There is no place Ambedkar. There is no freedom movement spirit.

on Constitution

మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. పార్లిమెంట్ ఉంది. అసెంబ్లీ లు ఉన్నాయీ. ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు , మంత్రులు, ఎం.పి.లు, అసెంబ్లీ సభ్యులు ఉంటారు.
ప్రతిది చర్చించ బడాలి. ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి.
కాని ఆంధ్ర ప్రదేశ్ లో అది కనిపించదు ముఖ్యమంత్రి చివరికి తన సహచర మంత్రులను కూడా బయిటికి పంపి ఇతర దేశస్తుల తో వ్యాపర మంతనాలు.
పార్లిమెంట్ రాజధాని నిర్మాణం కోసం ఒక శివరామన్ కమిటీ ని వేసింది ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని ప్రకారం నిర్మించవచ్చు కడా. ఇంకా పార్లమేంట్ ఎందుకు. అసెంబ్లీ ఎందుకు రాజ్యంగం ఎందుకు. సింగపూర్ కు AP ని ఇచ్చి వేసి చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గర ఎక్కువ జీతంతో పని చేసకోవచ్చు
కమ్యునిస్ట్ పార్టీల నాయకత్వం AP లో ఒక TDP లాంటీ గొప్ప పార్టీని పెంచాయీ. రేపు ఇంకొక పార్టీ జగాన మోహన్ రెడ్డి పార్టీ. మీరు కమ్యునిష్టు పార్టీలు లేకుండా చేయ గలిగారు. రాజదాని ప్రాంతం లో ఒక ఎర్రజెండా ఉండదు TDP మంత్రులకే స్తానం లేదు. ఇంకా ఎర్రజెండా పట్టుకొని నిలబడితే మీరు ఎక్కడ ఉంటారు. జైల్లో ఉంటారు. ఇంకా ఎక్కవ చేస్తే ఎన్కౌంటర్ లో చచ్చి పోతారు.
ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కోసం, రాజ్యాంగ విలువలకోసం, పోరాడండి.
శివరామన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం రాజధాని నిర్మాణం కోసం పోరాడండి.
పంట భూములను కాపాడండి.
లక్షల మంది కి ఉపాధి ఇస్తున్న పంట భూములను కాపాడండి.

Kameswara Rao Velpuri's photo.

on Sri lakshi and Vanaj


శ్రీ లక్ష్మి గారు జైల్లో మగ్గి అనారోగ్యం పాలవడానికి కారణం వై.ఎస్. రాజాసేఖర రెడ్డి, ఇపుడు జగన్ మోహన్ రెడ్డి.
వనజాక్షి గారు కన్నీరు కారణం చంద్ర బాబు నాయుడు.
చంద్ర బాబు నాయుడు ఆ TDP పెరగడానికి కారణం, జగన్ మోహన్ రెడ్డి YSRCP పార్టీ పెరగడానికి కారణం, తెలుగు రాష్ట్రాలలో ని కమునిష్టు పార్టీల నాయకులు కారణం.
ఉద్యోగులను, కార్మికులను ఏ డిపిస్తున్న, ఏడిపించిన చంద్ర బాబు నాయుడు ఆ TDP పెరగడానికి కారణం, జగన్ మోహన్ రెడ్డి YSRCP పెరగడానికి కారణం. కమునిష్టు పార్టీల నాయకులు కారణం.
కమునిష్టు పార్టీలు పెరగడానికి కృషి చేయాలి గాని TDP , YSRCP పెరగడానికి కమ్యునిష్టు పార్టీలు పని చేయడం విషాద కరం.
TDP , YSRCP నాయకులు కమునిష్టు పార్టీలను వాడుకున్నాయి. తమ ఆస్తులు పెంచుకున్నాయి. కమునిష్టు పార్టీలను లేకుండ చేయ గలిగినాయి.
ఒక విషాదం.
----------------------
ఆ రోజుల్లో శ్రీలక్ష్మి గారు దాడులు చేస్తారని, చంపుతారని భయపడే వాళ్లకి సపోర్ట్ చేసి కాప్టివ్ మైనింగ్ ఫైల్ మీద సంతకం పెట్టి వుంటారు. పాపం జైలు కెళ్ళారు. . భయపడడం లో తప్పులేదు.
ఈ రోజు వనజాక్షి గారు రాజకీయ అవినీతికి సపోర్ట్ చేయను అన్నందుకు దాడులు చేసారు. ఇంకా అడ్డు అనుకుంటే రేపు చంపేస్తారు కూడా.
జండా రంగులే తేడా, లోపల రంగులు ఒకటే.
మరీ దారుణం...
ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్తితి పోకచక్కల కన్నా ఘోరం.
ఈ పరిస్థితి కి కారణం కమునిష్టు పార్టీలు.
ఎందుకంటే TDP , YSRCP పెరగడానికి కమ్యునిష్టు పార్టీలు వాటి కోసం పని చేయడం

on parties elctions.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్టాలలోఇంకా దేశం లో ఉన్న పార్టీల అద్యక్షులకు, నాయకులకు విజ్ఞప్తి.
మీరు కాంట్రాక్ట్ లు పొందండి.. వ్యాపారాలు చేసుకోండి. వేల, లక్షల కోట్లు సంపాయించు కొండి. మీ పది తరాలకు వంద తరాలకు సరిపడే డబ్బును పెంచుకోండి. సింగపూర్ లో, జపాన్ లో, స్వ్సిస్ బాంక్ లలో దాచి పెట్టుకోండి. 
కాని మా విజ్ఞప్తి మీరు మా ప్రియ మయిన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. మీరు చేసిన ప్రజా ప్రాతినిద్య చట్టాన్నీ తప్పక పాటించండి. మీరు డబ్బులు, బహుమతులు, మందు పంచకుండా ఎలక్షన్లో పాల్గొనండి.
మీరు ఎన్నికల్లో వాగ్దానాలు చేయండి. ఇంటికి రెండు ఉద్యోగాలు, డాక్టర్ ఇంటికి వచ్చి వైద్యం చేస్తారు. పిల్లలకు కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్య. ప్రతి ఒక్కరికి మూడు బెడ్ రూమ్ ల ఇల్లు, దేవాలయలు, చర్చీలకు, మసీదులకు కోట్ల రూపాయలు ఇవ్వబడుతుంది . ప్రతి కులానికి పది అంతస్తుల భవనాలు . కార్మికులకు అయిదు నెలల బోనస్. మహిళా కార్మికులకు ఎనిమిది నెలల బోనస్, నల్ల డబ్బు తీసుకు వచ్చి ఒక్కకరి ఎకౌంటు లో ఇరవై లక్షలు వేస్తానని . ..... ఇలా ఎన్నయినా వాగ్దానాలు చేయండి. మీ ఎన్నికల మేనిఫెస్టో లను కలర్ ప్రింటు లతో ప్రింట్ చేసి పంచండి.
కాని మా వాల్లకు డబ్బులు, బహుమతులు, మందు పంచకుండా ఎలక్షన్లో పాల్గొనండి. ఎందుకంటే మా వాల్లు అమాయకులు. మీరు తప్పు చేస్తున్న పోలీసులకు ఎలెక్షన్ కమిషనరు కు పట్టించలేరు. పట్టించలేరు. ఎందుకంటే మీరు మమ్మల్ని తంతారు. చంపుతారు. పోలీసులను ఎలెక్షన్ కమిషన్ ఉద్యోగులను తంతారు. చంపుతారు.
కమ్యునిస్టు పార్టీలు లోకసత్తా ఆ మ్ ఆద్మీ పార్టీలు ఏమి పని చేయలేక పోతున్నాయి. దేశ భక్తులు, ప్రజా తంత్ర వాదులు ఉన్న వారు ఏమి చేయాలేక పోతున్నారు. పేపర్ ప్రకటనలు, వ్యాసాలు రాస్తారు. కవితలు, రౌండ్ టేబుల్ మీటింగ్లు పెడుతారు. వాటికి కూడా మీరే డబ్బులు పారేస్తారు.
కావున మా విజ్ఞప్తి . ఎన్ని వాగ్దానాలయిన చేయండి.
కాని మీరు డబ్బులు, బహుమతులు, మందు పంచకుండా ఎలక్షన్లో పాల్గొనండి.
ఆ విధంగా చేయండి. ఎందుకంటే మా వాళ్లు ఇంకా తుపాకులు పట్టుకొని మిమ్మల్ని చంపలేక పోతున్నారు. బలహీనంగా ఉన్నారు.
అందుకే విజ్ఞప్తి.
ఆ శక్తి వస్తే మీకు విజ్ఞప్తి చేయక్కరలేదు. వాల్లే మీకు ప్రజాస్వామ్యం ఫై, రాజ్యాంగం ఫై, ఎలెక్షన్ల ఫై పాటాలు చెబుతారు.
సమానత్వం , స్వేఛ్చ , సౌభాతృత్వం , శాంతి, ప్రగతి సాధించు కుంటారు.
అంతవరకూ మీరు కాంట్రాక్ట్ లు పొందండి.. వ్యాపారాలు చేసుకోండి. వేల, లక్షల కోట్లు సంపాయించు కొండి. మీ పది తరాలకు వంద తరాలకు సరిపడే డబ్బును పెంచుకోండి. సింగపూర్ లో, జపాన్ లో, స్వ్సిస్ బాంక్ లలో దాచి పెట్టుకోండి.
కాని మా విజ్ఞప్తి మీరు మా ప్రియ మయిన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. మీరు చేసిన ప్రజా ప్రాతినిద్య చట్టాన్నీ తప్పక పాటించండి. మీరు డబ్బులు, బహుమతులు, మందు పంచకుండా ఎలక్షన్లో పాల్గొనండి. చాలు.
---------------------
భోదించు ------- పోరాడు ------- సమీకరించు.
------------బాబా సాహెబ్ అంబేద్కర్.

4, జులై 2015, శనివారం

on cancellation of ACB and other

ఇంకా ఎందుకు ACB , CBI, CAG , CVC ఇతర సంస్తలు ఇవన్నీ ఒక దళితుడు, ఒక బి సి , ఒక టీ బాయ్ , ఒక పేపర్ బాయ్ , ఒక అటో కార్మికుడు , ఓకే కూలి, ఒక కార్మికుడు ఉద్యోగులు తప్పు చేస్తే,. సిక్షించ డానికేనా పెద్ద వాళ్ళు తప్పు చేస్తే సిక్షలు ఉండవా.
చంద్ర బాబు నాయుడు , మోడీ ప్రభుత్వాలకు పూర్తీ మెజారిటీ ఉంది. ఎందుకు మీ కు ఈ తలకాయ నొప్పులు. వీటిని రద్దు చేసేందుకు అర్దినన్సు తీసుకు వస్తే సరి పోతుంది. ఎలక్షన్లలో కూడా అవినీతి పరులు బాగా పని చేసి వోట్లు వేయిస్తారు.
ఇంకా ఒక అంటరాని వాడు రాసిన రాజ్యాంగం ఎందుకు. ఒక చిత్త గ్రంధం. ఇంకా దాని మీద ప్రమాణం చేయడమేమిటి.
అంబేద్కర్ ను రాజ్యంగాన్నీ అబి మానించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు బాధ పడటం దేనికి. రాజ్యాంగం అవసరం లేదు. అది అవుట్ డేట్ అని తీసి వేయవచ్చు..
మీరే మీకు తోచినట్లుగా రాయడానికి చాల మంది ఉన్నారు. అలాంటి మేధావులు చాలామంది దొరుకుతారు. మీరు కోట్లు ఇవ్వగలరు. అమ్ముడు పోయే మేధావులు చాలామంది ఉన్నారు.
ప్రతి పక్ష పార్టీలు కూడ ఏమి సీరియస్ గా తీసుకోవు. ఎందుకంటే వాళ్ళకు ఇవి తలకాయ నొప్పిగానే ఉన్నాయి. అందరు డబ్బు, మందు, బహుమతులు పంచే వాళ్ళేగా.
కమ్యునిస్టు పార్టీలు ఏమి కూడా ఉద్యమాలు చేయవు. ఎందుకంటే అవినీతీ వారికి సమస్య కాదు.
కొత్త రాజ్యాంగాన్ని రాయించు కొండి.
మీకు తలకాయి నొప్పి ఉండదు. ప్రజల డబ్బు వృధా కాదు.

on corruption



నేను ఒక భొతిక వాదిగా ఇలా రాయ గూడదు. ప్రజలు పోరాటాలు చేయాలి. దుర్మార్గ రాజకీయ నాయకులకు చరమ గీతం పాడాలి. దేశాన్ని కాపాడాలి ,ప్రజాస్వామ్యాన్నీ కాపాడాలి. రాజ్యంగాన్నీ కాపాడాలి అని వ్రాయాలి. కమ్యూనిస్టులు, ప్రజా తంత్ర వాదులు, దేశభక్తులు ఆ బాద్యత నిర్వహించాలనే రాయాలి
కాని ఎందుకో ఇలా రాయాలనిపించింది. ఏమయినా ఆలోచనలు మార్పు వస్తాయేమో నని.
------------------
ప్రజలకు ఓట్ల కోసం డబ్బు మందు , బహుమతులు పంచె నాయకులను, వారి అనుచరులను.చని పోయిన తర్వాత యమ ధర్మ రాజు సల సల కాగ నూనెలో పడేస్తాడట .
ఎందు కంటే
భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ ఇంకా ఎందు కంటే ఎంతో మంది త్యాగం చేసి ఇచ్హిన స్వతంత్ర దేశాన్నీ తమ స్వార్ధం కోసం ప్రజలకు ఓట్ల కోసం డబ్బు మందు , బహుమతులు పంచుతూ నాశనం చేస్తున్నందుకు
బాబా సాహెబ్ అంబేద్కర్ బోధించు, పోరాడు -- సమీకరించు అని చెబుతూ ఒక గొప్ప రాజ్యంగాన్నీ అందిస్తే దానీ మీద ప్రమాణం చేసి రాజ్యంగ విలువలను కాపాడకుండా , వాటిని నాశనం చేస్తున్న వారిఫై పోరాటం చేయకుండా, దేశం లో ప్రజా స్వామ్యన్నీ నాశనం చేస్తున్నందుకు .
ప్రజలను విద్యావంతం చేసే చర్యలు తీసుకోకుండా ,.వారిని మద్యానికి బానిసలుగా మార్చి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకునే విధంగా చేస్తున్నందుకు .
పవిత్రమయిన పార్లిమెంటు ను, అసెంబ్లీ లను బ్రస్టు పట్టిస్తున్నందుకు.
----------
కాబట్టి రాజకీయ నాయకులారా, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు , మంత్రులు ఎం.పి, ఎం.ఎల్. ఎ లు, పార్టీల అద్యక్షులు , జాగ్రతగా ప్రజలకోసం పని చేయండి. వాళ్ళను విద్యా వంతం చేయండి. చైతన్య వంతం చేయండి.
స్వేచ్చ ,సమానత్వం , శాంతీ, ప్రేమ , పెరిగేటట్లు చేయండి.
అంతే గాని ప్రజలకు ఓట్ల కోసం డబ్బు మందు , బహుమతులు పంచకండి.
బ్రతికున్నప్పుడు మీకు శిక్షలు పడకుండా తప్పించు కున్నా చనిపోయిన తర్వాత మీకు యమ ధర్మ రాజు తీవ్రమయిన శిక్షలు వేస్తారు.
మీరు పుణ్యక్షేత్రాలు తిరుపతి, సాయిబాబా, యాదగిరి ఇంకా ఇతర దేవాలయలు తిరిగిన ఏమి ప్రయోజనం లేదు. తప్పులు, తప్పులె. అవి తీవ్రమయిన తప్పులు. యమ ధర్మ రాజు ఊరుకోడు.
---------------------------
అవినీతిని ద్వేషించండి --- నిజాయతీని ప్రేమించండి --- రాజ్యంగాన్నీ కాపాదండి.
ప్రజా స్వామ్యన్నీ కాపాడండి. ---- దేశాన్ని కాపాడండి.
వీటి కోసం పని చేసిన వారు విజయ వంతం కాపోయిన చని పోయిన తర్వాత పని చేసినందుకు దైవం లేచి వచ్చి కౌగిలించు కొని, షేక్ హ్యాండ్ ఇచ్చి తీసు కొని వెళ్ళుతుంది. యమ ధర్మ రాజు కూడా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పోతాడు.
---------------
బౌతిక వాదులు, కామేశ్వరరావు ఎందుకు ఇలా రాసారు అని అనుకోవచ్చు. ఏమిటో ఇలా ఎందుకు రాయకూడదని రాసాను. వాళ్ళ విశ్వాసాలను తీసుకొని రాయలని రాసాను.

on Communist failure strategy


16 hrs
ప్రాంతీయ తత్వాలు., కుల తత్వాలు, మత తత్వాలు రాజకీయాలలో పోవాలంటే కనీసం తగ్గాలంటే పెద్ద కష్టమయిన పనేమీ కాదు.
ఒకటే మార్గం ఎలక్షన్ కమీషన్, రాజ్యంగాన్నీ గౌరవించి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటిచేయడమే 
ఓట్లకు డబ్బు, మందు బహుమతులు పంచకుండా పోటి చేయాలి. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లు నడచు కోవడమే. 
అపుడు ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు ప్రజలకు తప్పకుండా విధానాలు, సిద్దాంతాలు , చరిత్ర, వర్తమానం , చెప్పాల్సి వస్తుంది. అదే ప్రజలకు విజ్ఞానాన్ని అందించడం అదే బాబా సాహెబ్ అంబేద్కర్ కోరుకొంది అది చేయండి. చేయించండి.
ఇది కమ్యునిస్టు పార్టీలు చేయాల్సిన అతి ముఖ్యమయిన పని.
భూస్వామ్య భావ జాలం, అగ్రకుల భావ జాలం ఇంకా ఎక్కువుగా వుంది. అది కమ్యునిస్టు పార్టీలను తినివేసింది. ఇది నిజం., .
అందుకే త్యాగాలే తప్ప, విజయాలు లేవు
త్యాగాలు కీర్తించు కోవడం, పాటలు రాసు కోవడం, కవితలు చదువు కోవడం, చరిత్ర చెప్పుకోవడమే. సంస్మరణలు జరుపు కోవడం సంతాప సభలు జరుపు కోవడం మిగిలి పోతున్నాయి.
భూస్వామ్య భావ జాలం, అగ్రకుల భావ జాలం కమ్యునిస్టులనే కాదు, చివరికి బూర్జువా పార్తీలనే -- సోషలిస్ట్ , పార్టీలను , కాంగ్రెస్ పార్టీలను కూడా తినివేసింది
కాంగ్రెస్ పార్టీ ఎపుడయితే భూస్వామ్య భావ జాలం, అగ్రకుల భావ జాలానికి సహకరించ లేక పోయిందో అది కూడా ఓడి పోయింది. అంటే కాంగ్రెస్ ఈనాటి కమ్యునిస్టు పార్టీలు భూస్వామ్య భావ జాలం, అగ్రకుల భావ జాలానికి సహకరించ గలిగితే మనుగడ. అలా చేయడం కమ్యునిస్టు మూల సిద్దాంతాలకు విరుద్దం.
అందుకే కనీసం కమ్యునిస్ట్ పార్టీలు డబ్బు మందు పంచే పార్టీ ల ఫై పోరాడటమే ప్రధాన కర్తవ్యం. దీనిని అప్రధానం చేయడం వలనే ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు మత పార్టీలు, కుల పార్టీలు పెరిగి కనీసం బూర్జువా ప్రజాస్వామ్యాన్నీ కూడా మన దేశం లో లేకుండా చేయ గలుగుతున్నాయి . చేసాయి.
అంబేద్కర్ ముందే ఊహించారు. అవసరమయితే రాజ్యంగాన్నీ అమలు చేయక పొతే నేనే రాజ్యంగాన్నీ తగల బెడతాను అని కోపంగా అన్నట్లు చదివాను.
డబ్బు మందు బహుమతులు పంచకుండా పోటీచేసి టట్లు ఉద్యమాలు చేయాలి. అదే ప్రజలకు మనం అందిచే విజ్ఞానం.

on CBN in the interest of democracy


చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా మన ప్రియమయిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి న ముఖ్యమంత్రి ----
ఓటుకు నోటు తప్పుకాదు, ట్యాపింగ్ చేయడమే తప్పు.. అనడం ఎలా ఉందంటే..
"నేను దేశ ద్రోహం చెయడం తప్పుకాదు, నువ్వు తొంగి చూడడమే తప్పు అన్నట్టు.."
---------------------------------------------------
అందుకే నేను చెబుతున్నాను
నేనే ఆ టెపులు రిలీజ్ చేసాను.
అవినీతినీ ద్వేషించే నేను,
నిజాయతీని ప్రేమించే నేను,
మన ప్రియమైన భారత దేశంలో ప్రజా స్వామ్యాన్నీ కాపాడాలని కర్తవ్యం లో భాగంగా,
ఒక చిన్న ప్రయత్నం చేసాను.
మన ప్రియమైన భారత దేశం లో ప్రజాస్వామ్యాన్నీ బ్రష్టు పట్టిస్తున్న చంద్ర బాబు నాయుడు అరెస్ట్ కావాలనే
నేనే ఆ టేపులు రిలీజు చేసాను.
ఆయన అరెస్టు అయితే మొత్తం డోoక కదలు తుందని, ప్రజల్లో, విద్యార్ధులలో, యువకుల లో , కార్మికులలో, ప్రజలల్లో ప్రజా స్వామ్యం కోసం, మన ప్రియతమ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యంగాన్నీ కాపాడాలనే భావనతో, ఆ రాజ్యంగాన్నీ పట్టుకొని, కనీసం చర్చ జరుగుతుందని నేనే రిలీజు చేసాను.
ఈ రాష్ట్రానికి, కాదు కాదు ఈ దేశానికి, కాదు కాదు కాదు ఈ ప్రపంచానికే మహా నాయకుడు చంద్ర బాబు నాయుడు మరియు వారి కోసం పని చేస్తున్న నాయక గణం పార్లిమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు ఇంకా జగన మోహన్ రెడ్డి, కే.సి అర్ చేయలేదా అని మైక్ పట్టుకొని గంటల కొద్ది అడ్డమయిన లాజిక్కులు చెబుతూ ఉపన్యాసం దంచు తారు. పార్లిమెంట్ లో, అసెంబ్లీ లో మెజారిటీ ఉన్న వారిపై అరెస్టు చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోరు. కాని మైక్ పట్టుకొని ఉపన్యాసాలు దంచుతారు.
ఆ అవినీతి డొంకా అంతా కదులుతుందని నేనే ఆ టేపులు రిలీజు చేసాను. .
మన దేశం లో ప్రజలకు డబ్బు , బహుమతులు, మందు పంచు తున్న రాజకీయ నాయకులు, ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు , ఎం.పి లు, ఎం.ఎల్ ఎ లు ప్రజా స్వామ్య వ్యతి రేకులు, రాజ్యంగ వ్యతిరేకులు, దేశ ద్రోహులు.
మన ప్రియమయిన భారత దేశం కోసం ఉరి కంబాన్నీ ఎక్కిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ స్పూర్తితో , , మన ప్రియమయిన భారత దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరల స్పూర్తితో , భోదించు , పోరాడు, నిర్మించు అని మహా ఆయుదాలు అందించి, భార దేశానికి స్వేచ్చ , సమానత్వం , సౌభాతృత్వం కావాలని, ఒక గొప్ప రాజ్యాంగాన్నీ అందించన బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తో, నేనే ఆ టేపులు రిలీజు చేశాను.
నేరమే అధికారమయి కల్లుండి చూస్తున్న , ప్రతి ఒక్కరు నేరస్తుడే. ఆ నేరన్నీ చేయకుండా ఉంటానికి నేనే ఆ టేపులు రిలీజు చేసాను.
ఎ.కే ఖాన్ గారు నన్ను అరెస్టు చేయండి. నేనే మీ కాన్ఫిడెన్షి యాల్ సెక్షన్ నుండి, హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ఇంట్లో నుంచి, స్టీఫెన్ ఇంట్లో నుంచి దొంగిలించి రిలీజు చేసాను. ఈ రాష్ట్రానికి, కాదు కాదు ఈ దేశానికి, కాదు కాదు కాదు ఈ ప్రపంచానికే మహా నాయకుడు చంద్ర బాబు నాయుడు అరెస్టు అయితే మొత్తం డోoక కదలు తుందని ప్రజల్లో, విద్యార్ధులలో, యువకుల లో , కార్మికులలో, ప్రజల్లో ప్రజా స్వామ్యం కోసం మన ప్రియతమ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యంగాన్నీ కాపాడాలనే భావనతో ఆ రాజ్యంగాన్నీ పట్టుకొని, కనీసం చర్చ జరుగుతుందని, నేనే రిలీజు చేసాను.
నన్ను అరెస్ట్ చేయండి. వీలయితే ఉరిసిక్ష వేయండి. కావాలంటే కాల్చి పారేయండి.. ----- కాని అ ప్రజస్వామిక పిశాచ గణా ల నుండి ప్రజాస్వామ్యాన్నీ ,పార్లమెంటు ను అసెంబ్లీ లను, దేశాన్నీ కాపాడండి.
అవినీతిని ద్వేషిం చండి. --- నిజాయతీని ప్రేమించండి. – దేశాన్నీ కాపాడండి.
జోహార్ భగత్ సింగ్, రాజగుర్ సుఖదేవ్, జోహార్.
మన దేశ స్వాతంత్రం కోసం అమరులయిన అమర వీరులకు జోహార్లు.
మన దేశానికి ఒక గొప్ప రాజ్యంగాన్నీ, అందించిన బాబా సాహెబ్ అంబేద్కర్ కు జోహార్లు.
మన దేశం లో స్వేచ్చ , సమానత్వం, శాంతి, ప్రగతి కావాలని ఉద్యమించి అసువులు బాసిన అమర వీరులకు జోహార్లు.
ప్రజా స్వామ్యం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి.
అగ్రకుల దోపిడీ, నియంత్రుత్వ ధోరణులు నశించాలి.
సామ్రాజ్య వాదం నశించాలి.
సమత , మమత, ప్రగతి, శాంతి వర్ధిల్లాలి.
---వేల్పురి కామేశ్వరరావు 9849008986
-------------------------------
ఎ. కే. ఖాన్ గారికి అభినందలు. మీరు చేసిన గొప్ప కృషి రేవంత్ రెడ్డి అరెస్ట్ కు చేసిన కృషి ఈ రాష్ట్రం , ఈ దేశం రాజ్యాంగం, ప్రజా స్వామ్యం , విలువల పై , కనీసం చర్చించిస్తుంది ఆనందం గావుంది.
దేశం లో ప్రతి ఒక్కరు టీ బాయ్ నుండి. రాష్ట్రపతి వరకు చర్చించే పరిస్తితి కి తీసుకు వచ్చారు. మీకు మీ సిబ్బందికి అబినందనలు. నమస్సులు.
మీరు మన రాష్ట్రానికి మరొక శంకరన్ సర్.
మరో జే.డి. లక్ష్మీనారాయణ
మీలాంటి వాళ్ళు అందరు కలసి ఒక సంఘం గా ఏర్పడి , ఈ దేశం లో ప్రజాస్వామ్యాన్నీ , రాజ్యంగాన్నీ కాపాడటానికి కృషి చేయాలని చేతులెత్తి నమస్కరిస్తున్నాము.
చేయ గలరని ఆశిస్తున్నాము.
మరొక సారి ఎ.కే. ఖాన్ కు వారి సిబ్బందికి అభినందనలు. కృతఙ్ఞతలు. నమస్సులు.
------------------------
నా ఒక్కడి వల్ల దేశం మారి పోతుందా అనుకునే
ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం లేదు. ---ఫైడెల్ కాస్ట్రో