17, ఫిబ్రవరి 2015, మంగళవారం

on AAP in TS and AP.

తెలంగాణా లోను ఆంద్ర ప్రదేశ్ లోను అమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం వెంకటరెడ్డి, కృష్ణంరాజు గార్లు, డిల్హిలో అరవింద్ కేజ్రివాల్ కన్న ఎక్కువ రిస్క్ తీసుకోవాలి. లేక పోతే ఆప్ తీసుకున్న కర్తవ్యం ఎలక్షన్స్ లో డబ్బు, బహుమతులు పంచే, టి. డి. పి, టి అర్ .ఎస్, వై. ఎస్. అర్ . సి. పి, బీ జె . పి కాంగ్రెస్, పార్టీలపై ఆప్ వాలంటీర్స్ కు ప్రజలకు ఒక మార్గాన్ని చూపించలేరు.

ఢిల్లీ లో ఓక విజయం వస్తే, ఆనంద పడటానికి సరి పోతుంది. నేను కూడా మా రైల్ విహార్ లో అనందింగా చాక్లేటు పంచుకున్నాము. అంతేనా.

కేజ్రివాల్ లాగ రిస్క్ తీసుకొని టి. డి. పి, టి అర్ .ఎస్, వై. ఎస్. అర్ . సి. పి, బీ జె . పి కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణా లోను ఆంద్ర ప్రదేశ్ లోను అమ్ ఆద్మీ పార్టీ నాయకత్వనికీ పోరాడే శక్తీ ఉందా అనేదే ప్రశ్న.

సోషల్ సర్వీస్ వేరు. రాజకీయ కార్య కలపాలు వేరు. ఆప్ కు బాద్యత వహించడం ఇంకా రిస్క్ తో కూడుకున్న పని. తెలంగాణా లోను ఆంద్ర ప్రదేశ్ లోను అమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం ఆ విధంగా ముందుకు పోలేకపోతే అందరి శ్రమ వృధా.

వెంకటరెడ్డి, కృష్ణంరాజు గార్ల కాకపోయినా ఎవర్ని పెట్టిన ఆ కేజ్రివాల్ కన్న ఎక్కువ రిస్క్ తీసుంటే నే అప్రజాస్వామిక ,ప్రాంతీయ పార్టీలయినా టి. డి. పి, టి అర్ .ఎస్, వై. ఎస్. అర్ . సి. పి, మరియు కాంగ్రెస్స్ , బి.జే.పి ల పై, ప్రజాస్వామిక విజయాన్ని చూపించ ఆప్ చూపించ గలదు. ఆప్ ఆ బాద్యతను మోయాలి.

లేక పొతే దేశభక్తులు, ప్రజా స్వామిక వాదులు ఇంకా కస్టపడి ఇంకొక మార్గాన్నీ తెలంగాణా లోను ఆంద్ర ప్రదేశ్ లో ఎలక్షన్స్ లో డబ్బు, బహుమతులు పంచే, టి. డి. పి, టి అర్ .ఎస్, వై. ఎస్. అర్ . సి. పి, బీ జె . పి, కాంగ్రెస్ ల పై చూపించాల్సిన కర్తవ్యం వుంది.

ఆప్ కేంద్ర నాయకత్వం తన తీసుకున్న కర్తవ్యన్నీ, నిర్వహించ గలదని ఆశిద్దాం.

కమ్యునిస్టు పార్టీలు అవినీతి వ్యతిరేక పోరాటాన్నీ వదిలి వేయడం వలన ఆప్ రావలసి వచ్చింది.ఇది వాస్తవం.

అవినీతి మన దేశానికీ పట్టిన ఒక పెద్ద కాన్సర్, దానిని శస్త్ర చికిత్స ద్వారా తీసి వేయలి. లేక పొతే మనమందరం ఆ కాన్సర్ తో బ్రతుకుతూ చావాల్సిందే.

నిజాయతీని ప్రేమించండి ----- అవినీతిని వ్యతిరేకించండి ------- దేశాన్ని కాపాడండి.

విప్లవం వర్ధిల్లాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి