8, నవంబర్ 2014, శనివారం

కరంటు కోసం.

మూడేళ్ళ దాక కరెంటు కస్టాలు తప్పవు. --- ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. -9.11.14 ప్రజా శక్తీ లో చదివాను. అన్ని పేపర్లో వచ్చి ఉంటుంది. 

ఒక రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి ఈ విదంగా మాట్లాడవచ్చా అనే ప్రశ్న వస్తుంది. తెలంగాణ ఒక రాష్ట్రం. భారత దేశంలో ఒక అంతర్భాగం. రాజకీయ పార్టీల మద్య వైరుద్యాలు ఉంటాయి. అది ప్రజల కోసం కాదు. వాల్ల అధికారం కోసం. తరువాత డబ్బులు, కాంట్రాక్టర్ల, వ్యాపారాలకోసం.( అన్ని పార్టీలు కాకాపోవచ్చు)
ఎన్ని వైరుద్యాలవున్న పాలనలోకి వచ్చిన తర్వాత అందరితోటి మాట్లాడక తప్పదు. మనకు నచ్చిన నచ్చక పోయిన.
తెలంగాణ రాష్ట్రానికి కరంటు కస్టాలు మూడేళ్ళ దాక తప్పవు అని ఒక ముఖ్యమంత్రి గా చెప్పడం సరి అయినది కాదు. . ప్రభుత్వాలు చేస్తుంది వ్యాపారాలే కదా. మాట్లాడాలి తప్పదు.ప్రక్క రాష్ట్రాలతో మాట్లాదాలి. కేంద్రంతో మాట్లాడాలి. తీవ్రంగా ప్రయత్నించాలి. అవసరమయితే పోరాడాలి. తెలంగాణ ప్రజలకు పోరాటాలు ఎవరు చెప్పనవసరం లేదు. తెలియంది వ్యాపారం మాత్రమె. తప్పదు నేర్చుకోవాలి. తెలంగాణ లో సోషలిస్ట్ ప్రభుత్వమేమి కాదు.
దేశాలే మాట్లాడు కుంటున్నాయి. మాట్లాడు కోవాలి. ఎవరి కోసం ప్రజల కోసం.
ఇది పేరుకె ఒక ప్రజాస్వామ్యదేశం. ఇష్టం ఉన్న లేకపోయినా అనేక పార్టీలు ఉంటాయి. అందరిని కూర్చబెట్టి ప్రయత్నించాలి. తప్పదు. ప్రజలకోసం తప్పదు.
ఆ విధంగా ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వ్యక్తి ఆలోచించాలి. మార్గాలు చూడాలి.
పోరాటాలే కాదు మాట్లాడటం కూడా చేయాలి. తప్పాడు. అది ప్రజల కోసమే. కరంటు కోసం ప్రయత్నాలు చేయాలి. మార్గాలు అన్వేషించాలీ.
తెలంగాణలో మేధావులు తక్కువ కాదు. నిజాయితిపరులు తక్కువ కాదు.
ప్రజలకు పోరాటాలే తెలుసు. అవే నేర్పారు. కాబట్టి ప్రభుత్వం లో ఎవరున్న పోరాటం చేస్తారు. కె. సి ఆర్ ముఖ్యమంత్రి ఉన్నారని పోరాటాలు తెలంగాణ ప్రజలు మానరు. ఎందుకంటే వారికి తెలిసింది పోరాటాలే. కాని పోరాటాల ఫలితాలు వారికి రాకపోయినా పోరాటాలు చేస్తారు.
కరంటు కోసం ప్రయత్నాలు చేయాలి. మార్గాలు అన్వేషించాలీ. కష్టం కాదు.
ముఖ్యమంత్రి, టి.అర్.ఎస్ కాదు, అన్ని రాజకీయ పార్టీలు. మేధావులు, ఇంజనీర్లు సలహాలు ఇవ్వాలి. మార్గాలు చూపాలి. ప్రయత్నాలు చేయాలి. అవసరమయితే పోరాటాలు చేయాలి.
అహాలు చంపు కోవాలి. ప్రజలకోసం అహాలు చంపు కోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి