2, అక్టోబర్ 2014, గురువారం

బతుకమ్మ

బతుకమ్మ బతుకమ్మ-- ఉయ్యాలో
బహుజన బతుకమ్మ--- ఉయ్యాలో

మాఊరుకు రావమ్మ ----ఉయ్యాలో
కళ్ళు షాపులు మూయించమ్మ----ఉయ్యాలో

మాఊరుకు రావామ్మ---- ఉయ్యాలో
సార షాపులు మూయించమ్మ  ---ఉయ్యాలో

మాఊరుకు రావామ్మ ---ఉయ్యాలో
బ్రాంది  షాపులుమూయించమ్మ ----- ఉయ్యాలో

మాఊరుకు రావామ్మ-- ఉయ్యాలో
బడులు పెట్టించుమ్మ  ---ఉయ్యాలో

మాఊరుకు రావామ్మ---- ఉయ్యాలో
చదువు చెప్పించుమ్మ------  ఉయ్యాలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి