15, సెప్టెంబర్ 2014, సోమవారం

points man question

ఎన్నాళ్ళో నుంచో ఈ విషయం రాయాలని ఉంది. వెంటాడుతూనే ఉంది. ఇన్నాళ్ళు,నా మెదడులో ఉంది పోయింది.

విజయ వాడ రైల్వే వాగన్  వర్క్ షాప్  నుండి, హుబ్లి అక్కడి నుండి  పూనే కి ట్రాన్స్ ఫర్ చేసారు. అదొక కక్ష సాదింపు చర్య.,  అందువలన 1991 లో పూనేలో పనిచెయల్సి వచ్చింది.   అ రోజుల్లో నాకు ఒక పాయింట్స్ మన్  నాకు సహాయం చెసాడు. అతని పెరు. రమాకాంత్. అతని ఇంట్లో కొన్నాల్లు ఉన్నాను.

మాటల్లో అప్పుడు కొంతమంది ప్రొఫెసర్ల గురించి వారి డాక్టరేట్ల గురించి మాట్లాడుతుంటే అతని అన్న మాటలు ఎందుకో నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.  నాకు అంత  హిందీ రాదు. మరాటి అసలు రాదు అయిన అర్ధమయింది

ఏమిటంటే ఎందుకు చెబుతారు వారి డాక్టరేట్లగురించి  . మా వాళ్ళ గుడె సలు, పస్తులు, అవిద్య,  ఆకలి, నివాసం లేకపోడం గురించి రాసి డాక్టరేట్లు తెచ్చు కోవడం తప్ప ఏమైనా  ఉందా.  మా జీవితాలు, వాళ్ళు రాసుకోవాదనికే,  వాల్లకి,  డాక్తరెట్లకు పనికి వస్తున్నాయి . మార్పు కొరకు ఏమి చేసారో చెప్పండి.  మాపూర్వీకులు చేసిన కృషి, పోరాటాలు ఎందుకు రాయరు.  వాల్లకు డాక్టరేట్లు కావాలి. అందుకు  మాజీవితాలు వారికి కావాలి.  మాకు మార్పు కావలి.  వాల్ల డాక్టరేటులు వాల్ల రచనలు మాకెందుకు. మాజీవితాలు మాకుతెలుసు. అన్నారు. ఆవాక్యలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
అక్కడే నేను అంబేద్కర్ చదవడం మొదలు పెట్టాను. యూనివర్సిటీ పూనే లో సెమినార్లో పాల్గొనే వాడిని. అక్కడే చాల విషయాలు తెలుసుకోవడం జరిగింది.

ఆ కామ్రేడ్ రమాకాంత్ అన్న విషయాలు నేను మరచి పోలేక పోతున్నాను. కాని డాక్టరేట్ల వలన విద్యార్ధులకు చాల మందికి చాల విషయాలు తెలిసినాయి కదా. అంటే మౌనం అయిపోయాడు. నాకు అనిపించింది ఆతను అనుకోని ఉండవచ్చు ఆయన బాధను, భావాలను . నేను సరిగా అర్ధం చేసుకోలేదని. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి