దండలు వేయలేను .
క్షమించండి దండలు వేయలేను
దేశం కోసం ప్రాణాలు అర్పించిన
భగత్సింగ్ రాజగుర్, సుఖదేవ్
మొదలైన అమరవీరుల
విగ్రహాలకు దండలు వేయలేను
దేశం కోసం ప్రాణాలు అర్పించిన
భగత్సింగ్ రాజగుర్, సుఖదేవ్
మొదలైన అమరవీరుల
విగ్రహాలకు దండలు వేయలేను
దేశ స్వాతంత్రo కోసం జీవితాన్ని
అంకితం చేసి హిందు మతోన్మాదుల చేతిలో
హత్య కావించబడి న
మహాత్మా గాంధి విగ్రహానికి
దండలు వేయలేను .
మన దేశానికీ రాజ్యాంగాన్నిఅందించిన
సామాజిక ఆర్ధిక విప్లవకారుడు
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి
దండలు వేయలేను .
మహానుభావులు
చదువు కోసం పాటశాల లను నిర్మించిచదువు చెప్పిన
మహాత్మా జోతిరావు పులే
సావిత్రిబాయి పులే విగ్రహాలకు
దండలు వేయలేను.
సమత కోసం, మమత కోసం, ప్రగతి కోసం
త్యాగాలు చేసిన అనేకమంది
మహానుభావుల విగ్రహాలకు
దండలు వేయలేను.
ఈమహనుభావుల విగ్రహాలకు
ఓట్ల కోసం డబ్బు, మందు పంచుతూ ,
ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న వారు,
రాజ్యాంగాన్ని తగలపెడుతున్నవారు
దండలు వేస్తుంటే
వారి చేతులు నరకలేని నేను,
ఆ మహానుభావుల విగ్రహాలకు
దండలు వేసే అర్హత లెదు.
అందుకే దండలు వేయలేను.
క్షమించండి. క్షమించండి. క్షమించండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి