28, ఆగస్టు 2014, గురువారం

నా  శవం చైతన్యం 

 నా శవం 
నన్ను ప్రశ్నిస్తుంది. 

నీచుట్టు దుర్మార్గులు 
ప్రజలను హింసి స్తుంటే 
మౌనంగా ఎందుకున్నావు
నా శవం 
నన్ను ప్రశ్నిస్తుంది. 

ప్రజలకు 
రాజకీయనాయకులగా 
చెప్పుకుంటున్న వాళ్ళు 
వోట్లకోసం 
డబ్బు మందు పంచుతుంటే 
ఎందుకు మౌనంగా ఉన్నావని,
ఎందుకు వాళ్ళను 
చంపలేదు అని 
నా శవం 
నన్ను ప్రశ్నిస్తుంది. 

వర్నాశ్రమ ధర్మాలు 
అగ్రకుల ఆధిపత్యాలు 
అనుసరిస్తూ 
దళితులను శూద్రులను 
స్త్రీలను 
హింసిస్తుంటే 
ఎందుకు వాళ్ళను చంపలేదని 
నా శవం 
నన్ను ప్రశ్నిస్తుంది

కార్మికులను 
బానిసలుగా చూస్తూ 
వెట్టి చాకిరి చేయిస్తున్నవారిని 
ఎందుకు వదిలి వేసవని 
నా శవం 
నన్ను ప్రశ్నిస్తుంది
నా శవం 
నన్ను ప్రశ్నిస్తుంది

కార్మికులుగా  
ఉద్యోగస్తులుగా ఉంటూ 
పేదప్రజలును 
లంచాలాకోసం 
హింసిస్తుంటే 
తుపాకి ఎందుకు పట్టలేదని 
నా శవం 
నన్ను ప్రశ్నిస్తుంది. 


చెత్త పాటలు వ్రాస్తూ 
చెత్త డయిలాగులు  వ్రాస్తూ 
చెత్త డాన్సులు వేస్తూ 
చెత్త సినిమాలు తీస్తూ 
యువతను విద్యార్దులను 
చెడగొడుతున్న 
సినిమా వాల్లను 
ఎందుకు చంపలేదని 
నా శవం 
నన్ను ప్రశ్నిస్తుంది. 


మార్పు కోసం అని 
ఆయుదాలు పట్టుకొని 
కొంతమంది గిరిజనులను, 
 పొట్టకూటి కోసం 
బ్రతకడం కోసం పనిచేస్తున్న  
ఉద్యోగులను 
చంపుతున్న వారిపై 
తుపాకి ఎందుకు పట్టలేదని 
నా శవం 
నన్ను ప్రశ్నిస్తుంది. 

నీవు బ్రతికున్న శవానివి 
నీకెందు కు చావు. 
కోమాలోనే ఉండు 
నీకు చచ్చే అర్హత లెదు. 
నీకు కొమాయే గతి. 
పో అని 
నాశవం తిడుతుంది. 

నాకు ఎవరన్న సహాయం 
చేయగలరా. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి