అమ్మ నాన్నలకు కంటనీరు వద్దు.
ఏ ఆందోళనలలో
ఆత్మహత్యలు చదివారు?
ఏ పోరాటాలలో
ఆత్మహత్యలు చూచారు?
మహాత్మా గాంధీ నడిపిన
సత్యాగ్రహ పోరాటం లోన,
భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్ సాగించిన
విప్లవ పోరాటంలోన,
కొమరం భీమ్, అల్లూరి సాగించిన
గిరిజనుల విముక్తి పోరాటాలలోన,
భారతరత్న అంబేద్కర్ నడిపిన
సాంఘిక పోరాటాలలోన
నేతాజీ శుభాష్ చంద్ర భోస్ నిర్మించిన
ఆజాద్ హిందూ ఫోస్ సైనిక శక్తి లోన
భూమికోసం, భుక్తికోసం,విముక్తి కోసం సాగిన
సుధ తెలంగాణా పోరాటంలోన
సోషలిస్ట్ వ్యవస్థల కోసం సాగిన
ఫ్రెంచి, సోవియట్ విప్లవాలలోన
లాంగమార్చ్ నిర్వహించ సోషలిజం స్తాపించిన
చైనా విప్లవలోన
అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని గడగడ లాడించిన
వియత్నాం,క్యూబా విప్లవాలలోన
ప్రజలకు ప్రశ్నలను పోరాటాలను నేర్పిన
నక్సల్బరి శ్రీకాకుళ పోరాటాలలోన
ఈ దేశ దళితులకు సంఘర్షణ నేర్పిన
కారంచేడు, చుండూరు పోరాటాలలోన
ఎక్కడ చూచారు? ఎక్కడ చదివారు?
ఆత్మహత్యలు పోరాటరూపాలు కాదు
నిరసనలు కాదు బలహీన చర్యలు
అవి అమ్మనలకు కంటనీరు
అవి దోపిడీ పాలకులకు నిచ్చెనమెట్లు
సమతకోసం మమతకోసం ప్రగతికోసం
సోషలిస్ట్ తెలంగాణకోసం పోరాడండి
విజయ పతకాన్ని ఎగురవేయండి.
కామేశ్వర రావు
రచయిత ఫ్రీలాన్సు జర్నలిస్ట్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి