1, ఆగస్టు 2021, ఆదివారం

దేశాన్ని విముక్తి చేయాలి

 మనదేశాన్ని దేశం లో ఉన్న దేశద్రోహులనుండి దేశాన్ని విముక్తి చేయాలి..

-----------------------------------
రాజ్యాంగం లో ప్రజాస్వామ్యానికి సోషలిజనికి ఎంతో ప్రాధాన్యతని ఇచ్చారు. వాటిని దేశద్రోహులు తుంగలో తొక్కుతున్నారు.
ఎన్నికలల్లో డబ్బు మద్యము బహుమతులు పంచె వాళ్ళు నేరస్తులు , దేశద్రోహులు . ఆ పార్టీలను నిషేదించాలి. అపుడే మన దేశంలో ప్రజాస్వామ్యానికి , సోషలిజానికి పునాదులు పడతాయి
ఈ పని ఎన్నికల కమిషన్, , పోలిస్ వ్యవష్ట, గౌరవ కోర్ట్లులు చేయగలవు . చేయాలి..
కాని చేయడం లేదు.
ఇది వాస్తవం.
కారణలు కులం.
ఈ కర్తవ్యాన్ని తీసుకోవాల్సిన ఈ దేశ కమ్యునిష్టు పార్టీలు ప్రజస్వామ్య వాదులు వదిలి వేసారు. విచారకరం .
కారణం . కులం.
అయిన మార్పు ఆగదు.
మహాకవి గురజాడ అన్నట్లు దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయ్ . దేశం లో మనుష్యలు ఉన్నారు. మార్పు కోరే మనుష్యులు ఉన్నారు.
అందరూ దేశాన్ని నాశనం చేస్తున్న పీడక కులాల వాళ్ళ బానిసలు కాదు. చెంచాలు కాదు. వాళ్ళ పార్టీల తోకలు కాదు. , వాళ్ళ పార్టీల అనుచరులు కాదు.
దేశాన్ని విముక్తి చేస్తారు . పార్లమెంట్ , అసెంబ్లీ లను ఈ పీడక కులాల వాళ్ళ నుండి , ఆ పార్టీలనుండి.విముక్తి చేస్తారు.
విముక్తి చేయాలి. విముక్తి జరుగుతుంది.
నిజమయిన ప్రజస్వామ్య , సోహలిష్టు శక్తులు ముందుకు వస్తాయి
చేయాల్సిన ఎన్నికల కమిషన్, , పోలిస్ వ్యవష్ట, గౌరవ కోర్ట్లులు చేయకపోతే తుపాకులు పట్టుకోవాల్సి వస్తే పట్టుకుంటారు.. బాంబులు పట్టుకుంటారు. పార్లమెంట్ , అసెంబ్లీ లను పీడక కుల దుర్మార్గుల నుండి, పార్టీల నుండి విముక్తి చేస్తారు. దీని కొరకు తుపాకులు పట్టుకోవాల్సి వస్తే , బాంబులు పట్టుకోవాల్సి వస్తే దానికి కారణం ఎన్నికల కమిషన్, పోలిస్ వ్యవష్ట , గౌరవ కోర్టులే అవుతాయి..
అంబేద్కర్ గారే చెప్పారు. రాజ్యాంగం విఫల మయితే తనే రాజ్యాంగాన్ని తగల పెడతాను అన్నారు. రాజ్యాంగం విఫల మవడానికి కారణం రాజ్యాంగం కాదు.. దానిని అమలు చేయాల్సిన మనుష్యలు.. అంటే పార్లమెంట్ , అసెంబ్లీ ల సభ్యులు. .
ఎన్నికల కమిషన్, పోలిస్ వ్యవష్ట , గౌరవ కోర్టులు పార్లమెంట్ , అసెంబ్లీ ల లోకి డబ్బు , మద్యము , బహుమతులు పంచె వాళ్ళను అడుగు పెట్టనేయకుండా చేస్తారని ఆశిద్దాం.
లేకపోతె ఈ దేశ ద్రోహులనుండి. , దోపిడి దారులనుండి, కాపాడు కోవడానికి ప్రజస్వామ్య శక్తులు , సోషలిష్టు శక్తులు , దేశ బక్తులు నడుం బిగించాలి.. పిడికిలి బిగించాలి. ఉద్యమించాలి. పోరాటం చేయక తప్పదు . దానికి కారణం ఎన్నికల కమిషన్, పోలిస్ వ్యవష్ట , గౌరవ కోర్టులే అవుతాయి
తప్పుదు
దేశాన్ని విముక్తి చేయాలి .
డబ్బు మద్యము బహుమతులు పంచేవాళ్ళు , పార్టీలు నశించాలి.
ప్రజస్వామ్యము వర్ధిల్లాలి.
సోహలిజం వర్ధిల్లాలి
రాజ్యాంగం వర్ధిల్లాలి.
విప్లవం వర్ధిల్లాలి.
జోహార్ అమర వీరులకు జోహార్.
జోహార్ భగత్ సింగ్ , రాజగురు సుఖదేవే. జోహార్.
జోహార్ ఉద్దం సింగ్. జోహార్.
జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్.
కామేశ్వరరావు
కన్వీనర్
రాజ్యాంగ పరి రక్షణ వేదిక
2.8.2021
No photo description available.
13 Shares
Like
Comment
Share

10, ఏప్రిల్ 2021, శనివారం

wokers party

 

కొన్ని గ్రూప్ లలో వర్కర్స్ పార్టీ ఎపుడు స్తాపించ బడింది. ఎప్పటినుంచి పనిచేస్తుందని కొంతమంది కోపంతో అడుగుతున్నారు.
వాళ్ళు వర్కర్స పార్టీ పోస్టులు చూసి, కోపంతో అడుగు తున్నారు. కొంత విషయం ఈ గ్రూప్ పేస్ బుక్ లో పెట్ట్టాను.
అయిన ఇంకా కొంత వివరంగా చెప్పాలనిపించింది
1936 లోనే బాబాసాహెబ్అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని బ్రాహ్మణ ధర్మానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ విధానానికివ్యతిరేకంగా స్తాపించి 19 42 వరకు నడిపారు. తరువాత 1942 లో కొన్ని కారణాలు వలన ( రాయవచ్చు కానిరాయడం అనవసరం) మనుధర్మానికి వ్యతిరేకంగా, దళితజాతీయవాదంతో షెడ్యూల్ కేష్టు ఫెడరేషన్ మార్చారు. తరువాత 1952 లో దళితబుద్ధిష్ట్ మూవ్మెంట్ తో, దళితజాతీయ వాద దృక్పధం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను స్తాపించారు.
పశ్చిమ బెంగాల్ లో ప్రొఫెసర్ జ్యోతి భట్టాచార్య నాయకత్వంలో ఎం. .ఎన్ రాయ్ నాయకత్వంలో ఉన్న రాడికల్ డెమాక్రటిక్ పార్టీనుండి విడి, పోయి 19 43 నుండి ఉన్న డెమక్రటిక్ వాన్ గార్డ్ను వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా మార్చుకొని పని చేసారు. యునైటెడ్ ఫ్రంట్ ప్ర బుత్వంలో 19 6 7 నుండి1969 వరకు జ్యోతి భట్టాచార్య విద్యశాఖమంత్రి గా పని చేసారు. తరువాత కమ్యునిష్ట్ వర్కర్స్ పార్టీ గా వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా గా చీలి కొంతకాలం పనిచేసాయి. తరువాత కాలంలోకమ్యునిష్టు వర్కర్స్ పార్టీ, 1993 వర్కర్స్ పార్టీగా పేరుమార్చు కొని పనిచేయడం జరిగింది. 1998 లో జ్యోతిభట్టాచార్య చనిపోవడం జరిగింది. తరువాత పార్టీ కొనసాగలేదు. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా 20 11 లెఫ్ట్ ఫ్రంట్ లోఉండి శక్తీకొలది పని చేసింది. .
1947నుండి మహారాష్ట్ర లో పెజెంత్స్ అండ్ వర్కర్స్ పార్టీ కేశవ రావ్ జేడె మార్క్ సిద్ధాంతం తో స్తాపించారు . ఇప్పుడు ఈపార్టీ మహారాష్ర లోపని చేస్తుంది.
1991 మాజీ రాష్ట్రపతి వి.వి. గిరిగారు లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా ను స్తాపించి పని చేసారు.
తెలంగాణా రాష్ట్రం లో TDP, లోను TRS లోను కార్య కర్త్తగా పనిచేసిన భాస్కర్ శ్రమజీవి పార్టీని స్తాపించి తన శక్తీ కొలది పని చేస్తున్నారు.
ప్రపంచంలోబ్రిటన్ లోలేబర్ పార్టీ, డెన్మార్క్ లో, అమెరికాలో ఐర్లాండ్ లో సింగ పూర్ లో ఇంకా ప్రపంచ వ్యాపింతంగా వర్కర్స్ పార్టీలు ఉన్నాయి.
1947 డాంగేనాయకత్వంలో భారత కమ్యునిష్టు పార్టీ USSR కమ్యునిస్టు పార్టీని సలహా ల కోసంవెళితే స్టాలిన్ నాయకత్వం లో ఉన్న USSR కమ్యునిస్టు పార్టీ భారత్ కమ్యూనిష్ట్ పార్టీ నాయకులకు కమ్యునిస్టు పార్టీపేరు మార్చి లేబర్ పార్టీ గా కాని వర్కర్స్ పార్టీ గా కాని పేరు మార్చిపని చేయమని సలహా కూడా ఇచ్చారు. కాని మన నాయకులు విని వచ్చారు. కాని సలహాను స్వీకరించ లేదు. బహుశా అంబేద్కర్ అప్పటికే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి పని చేస్తున్నారు.
వర్కర్స్ పార్టీకి లేబర్ పార్టీలకు దేశంలోను ప్రపంచంలోను గొప్పచరిత్ర ఉంది. తెలుగురాష్ట్రాలలోఉన్న భూస్వామ్య వర్గాలకు వారి బానిసలకు అర్ధంకాదు. డబ్బు మందు బహుమతులు పంచె వారికి ఏమి తెలుస్తుంది.
కార్మికులు బానిసలు కాదు చైతన్య దీపాలు. మౌనంగా ఉండలేరు
నేను స్తాపించిన వర్కర్స్ పార్టీ సమానత్వం, అబివృద్ది, మమత, న్యాయం, శాంతి ఆశయాలతో పని చేస్తుంది. వర్కర్స్ పార్టీ పనిచేయడంఅంటే ఏంతోకష్టం. అందులో ఫ్యూడల్ భావ జాలం గల దేశంలోపనిచేయడం ఎంతో కష్టం. అయిన చాల మంది చేసారు. చేస్తున్నారు. మేము చేస్తాం.
విజయం ఆలస్యం అయిన దేశం కార్మికులదే . ప్రపంచం కార్మికులదే.
MY PEOPLE ALONE CAN ESTABLISH SOCIALISM IN INDIA UNDER THE RULE OF PEASANTS AND WORKERS ---- Dr. Baba Saheb Ambedkar.
అదే భావంతోవర్కర్స్ పార్టీ పనిచేస్తుంది.
వర్కర్స్ పార్టీ లు లేబర్ పార్తీలు ఇంకా పుట్టాలి. ఫ్యూడల్ భావజాలాన్నీ, సామ్రజ్యవాద భావజాలన్నీ ఓడించాలి. .
కమ్యునిస్టు పార్టీలుచేస్తే సంతోషమే. కాని వాస్తవం లో జరగలేదు. చేస్తాయని ఆశిద్దాం.
సమత, ప్రగతి, మమత, న్యాయం, శాంతి వర్ధిల్లాలి.
వర్కర్స్ పార్టీ నిర్మాణంలోబాగాస్వాములుకండి. ఫ్యూడల్ భావజాలాన్నీ, సామ్రజ్య వాద భావజాలన్నీ ఓడించ డానికి ముందుకు రండి.
దేశంలో ప్రజా స్వామ్యన్నీనెల కోల్పండి

16, ఫిబ్రవరి 2021, మంగళవారం

దేశం కోసం

 


రావనా సెందనలో ఎన్నెలో
రాజా నీకొందనలో ఎన్నెల్లో
పార్లమెంట్ అసెంబ్లీలకు ఎన్నెల్లో ఎన్నెల్లో
ఎలక్షన్లు జరుగుతాయి ఎన్నెల్లో ఎన్నెల్లో
ఆ ఎలెక్షన్లలోన ఎన్నెల్లో ఎన్నెల్లో
డబ్బులు పంచుతారు ఎన్నెల్లో ఎన్నెల్లో
మద్యము బహుమతులు ఎన్నెల్లో ఎన్నెల్లో
ఓట్లకోసం పంచుతారు ఎన్నెల్లో ఎన్నెల్లో
పంచే వాళ్ళను ఏమనాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
నేరస్తులని అనాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
నేరస్తుల్ని జైల్లో వేయాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
రావనా సెందనలో ఎన్నెలో
రాజా నీకొందనలో ఎన్నెల్లో
రాష్ట్రల లోను దేశం లోను ఎన్నెల్లో ఎన్నెల్లో
చంద్ర బాబు నాయుడు కేసీఆర్ ఎన్నెల్లో ఎన్నెల్లో
జగన్ మోహన్ రెడ్డి ఎన్నెల్లో ఎన్నెల్లో
మోడీ అమిత్ షాలు ఎన్నెల్లో ఎన్నెల్లో
ఇంకా అనేక పార్టీల వాళ్ళు ఎన్నెల్లో ఎన్నెల్లో
ఓట్లకోసం పంచుతారు ఎన్నెల్లో ఎన్నెల్లో
వీళ్లందరినీ జైల్లో వేయాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
పార్లమెంట్ అసెంబ్లీలను ఎన్నెల్లో ఎన్నెల్లో
మన ప్రియమయిన దేశాన్ని ఎన్నెల్లో ఎన్నెల్లో
మన దేశ రాజ్యాంగాన్ని ఎన్నెల్లో ఎన్నెల్లో
కాపాడు కోవాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
రావనా సెందనలో ఎన్నెలో
రాజా నీకొందనలో ఎన్నెల్లో
ఎన్నికల అధికారులు ఎన్నెల్లో ఎన్నెల్లో
కోర్టులు పోలీసులు ఎన్నెల్లో ఎన్నెల్లో
డబ్బులు పంచె వాళ్లను ఎన్నెల్లో ఎన్నెల్లో
మద్యము బహుమతులు పంచె వాళ్ళను ఎన్నెల్లో ఎన్నెల్లో
జైల్లో వేయాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
మన ప్రియమయిన దేశాన్ని ఎన్నెల్లో ఎన్నెల్లో
మన దేశ రాజ్యాంగాన్ని ఎన్నెల్లో ఎన్నెల్లో
కాపాడాలి కాపాడాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
రావనా సెందనలో ఎన్నెలో
రాజా నీకొందనలో ఎన్నెల్లో
వాళ్ళు చేయలేక పొతే ఎన్నెల్లో ఎన్నెల్లో
ఎర్ర నీలి జెండాలు పట్టుకొని ఎన్నెల్లో ఎన్నెల్లో
ప్రజా ఉద్యమాల ద్వారా ఎన్నెల్లో ఎన్నెల్లో
సామాజిక ఉద్యమాల ద్వారా ఎన్నెల్లో ఎన్నెల్లో
మనమే చేయాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
పార్లమెంట్ అసెంబ్లీలకు ఎన్నెలో ఎన్నెలో
బహుజనులు శ్రామికులే వెళ్ళాలి ఎన్నెలో ఎన్నెలో
మన దేశ రాజ్యాంగాన్ని ఎన్నెల్లో ఎన్నెల్లో
కాపాడు కోవాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
రావనా సెందనలో ఎన్నెలో
రాజా నీకొందనలో ఎన్నెల్లో
అంబెద్కర్ గారికి ఎన్నెల్లో ఎన్నెల్లో
భగత్ సింగ్ రాజగురు సుఖదేవులకు ఎన్నెల్లో ఎన్నెల్లో
అమర వీరులందరికి ఎన్నెల్లో ఎన్నెల్లో
జోహార్లు జోహార్లు ఎన్నెల్లో ఎన్నెల్లో
రావనా సెందనలో ఎన్నెలో
రాజా నీకొందనలో ఎన్నెల్లో
----కాము 14.2.2021
May be an image of 1 person and monument







దేశం కోసం

 


5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

అంబెడ్కర్ కృపా లని

 

badge icon
Admin
 February 6, 2018 Hyderabad 
బాబాసాహేబ్ అంబేడ్కర్ పార్లమెంటు నుండి బయటకు వస్తున్నాడు.
అప్పుడు, ఆచార్య కృపాలాని ఎదురై యిలా అన్నాడు..."అంబేడ్కర్ మీరు ఈ రోజు చాల సంతోషంగా కనిపిస్తున్నారు. ఏమిటి విషయం?
బాబాసాహేబ్ ఇలా అన్నారు-.''మొదట్లో రాణి కడుపు నుండి రాజులు పుట్టేవారు. నేను ఇప్పుడు రాణి కడుపులోనుండి కాకుండ
ఓట్లపెట్టె నుండి పుట్టే ఏర్పాటు చేశాను. అందుకే సంతోషం
గా ఉన్నాను... దానికి
కృపాలని ఇలా బదులిచ్చాడు...."ఐతే
మీ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు..
ఎందుకంటే, నీ ప్రజలు పేదలు,నిస్సహాయులు,అడుక్కునేవాళ్లు, అమ్ముడు పోయేవాళ్లు, మేము వారి ఓట్లను కొని
మా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాం.
నీవ్ ఏమి చేయలేవ్.....
అప్పుడు బాబాసాహేబ్ ఇలా అన్నారు--
నా ప్రజలు పేదలే,నిస్సహాయులే, అడుక్కునే వారే కావచ్చు, మీరు
వారి ఓట్లను కొని ప్రభుత్వాలను ఏర్పాటు
చేయవచ్చు.....
కాని.......
ఏ రోజు ఐతే నాప్రజలు తమ ఓటు విలువను సరిగ్గా గుర్తిస్తారో, అప్పుడు
మీ కంటే పెద్ద బిచ్చగాళ్లు ఎవరు ఉండరు..గుర్తుంచుకోండి!!!
* బాబాసాహేబ్ *
-----------------------
"నా ప్రజలు పేదలే,నిస్సహాయులే, అడుక్కునే వారే కావచ్చు, మీరు
వారి ఓట్లను కొని ప్రభుత్వాలను ఏర్పాటు
చేయవచ్చు.....
కాని.......
ఏ రోజు ఐతే నాప్రజలు తమ ఓటు విలువను సరిగ్గా గుర్తిస్తారో, అప్పుడు
మీ కంటే పెద్ద బిచ్చగాళ్లు ఎవరు ఉండరు..గుర్తుంచుకోండి!!!
* బాబాసాహేబ్ *"
ఇక్కడే నాకు చాలా బాధగా వుంది. ప్రజలకు డబ్బులు ఇచ్చేవారిని శిక్షించే విధంగా రాజ్యాంగం లో ఒక చాప్టర్ పెట్టక పోవడం బాధగా వుంది. మనువాదులు దుర్మార్గులు అని తెలిసి అలాంటిటి వారిని కట్టడి చేయడం అవసరమని అంబేద్కర్ చేయకపోవడం విచారకరం.
నేటి తరం.ఆపని చేయాలి. ప్రజలకు డబ్బులు మద్యం బహుమతులు ఇచ్చేవారిని శిక్షించే విధంగా రాజ్యాంగంలో సవరణ చేయాలి. లేకపోతే చట్టం చేయాలి.
అదే ప్రజస్వామ్య వాదుల తక్షణ కర్తవ్యం.
రాజ్యాంగం వర్ధిల్లాలి.
రాజ్యాంగ వ్యతిరేక శక్తులు నశించాలి.
కామేశ్వరరావు
రాజ్యాంగ పరిరక్షణ వేదిక.
కన్వీనర్.
Pulapola Ramnjanillu, Khasimsaheb Diguri and 1 other
1 Share
Share

1, ఫిబ్రవరి 2021, సోమవారం

election representative

 ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే UPSC, SSC, RRB, SPSCs, DSC, బ్యాంకు పరీక్షలు మొదలయిన పరీక్షలు పాసయినా, పోలిస్ క్లియరెన్స్ కావలి. ఎలెక్షన్ కమిషన్ అధికారులు, ఉద్యోగులు కూడా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే పోలీస్ క్లియరెన్స్ కావాలి.

గ్రూప్ డి పోస్టుల నుండి IAS అధికారుల వరకు పోలీసు క్లియరెన్స్ ఉంటేనే ఉద్యోగాలలో చేరగలరు.
కాని MLA, MP స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నికలకు ఎవరయినా ఎన్ని కేసులు ఉన్న పోటీ చేయవచ్చు.
వాళ్లు గెలిచిన తర్వాత PM, CM లు మంత్రు లయితే ఆ చెత్త గాళ్ళ ఫైళ్లు ప్రభుత్వ ఉద్యోగులు మోయాలి. వాళ్లను MP, MLA లను కాపాడాలి.
వాళ్ళను, ఇష్టం ఇష్టంలేకపోయినా గౌరవించాలి.
ఏమిటీ ఈ పరిస్థితి. దీనిని మార్చాలి.
ఎలెక్షన్ కమిషన్ MP, MLA, స్థానిక సంస్థల ప్రతినిధులకు పోటీ చేస్తున్న అభ్యర్థులనుండి పోలీస్ క్లియరెన్సు సరిఫికేట్ తీసుకోవాలి. ఇంకా ఇన్కమ్ టాక్స్, ACB, CBI, నుండి ఎటువంటి కేసులు లేవని సర్టిఫికెట్ తీసుకోవాలి.
క్లియరెన్స్ లేకపోతే వాళ్లకు పోటీ చేసే అర్హత లేదని ప్రకటించాలి.
గెలిచిన తర్వాత ACB, CBI, పోలీసుల కేసులలో ఉంటె మంత్రులు, MP, MLAలు వారిని వెంటనే డిస్క్వాలీఫై చేసే విధంగా చట్టం చేయాలి.
దేశాన్ని ఈ చెత్త రాజకీయ నాయకుల నుండి రక్షించాలి.
పూర్వ ముఖ్య ఎన్నికల కమిషనర్ JM లింగ్డో గారు రాజకీయ నాయకులు క్యాన్సర్లు అని అన్నారు. వారిని తొలగించడానికీ కృషి జరగాలి. పైన చెప్పిన విధంగా చేయవచ్చు. చేయాలి.
పూర్వ ముఖ్య ఎన్నికల కమిషనర్ TN శేషన్ గారు కూడ గొప్ప కృషి చేసారు.
ఇంకా చేయాలి.
పైన చెప్పిన విధంగా చేసి ఈ చెత్త రాజకీయ నాయకుల నుండి దేశాన్ని కాపాడాలి.
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.
రాజ్యాంగం వర్ధిల్లాలి.
జోహార్ బాబాసాహెబ్ అంబెడ్కర్.
కామేశ్వర రావు
గ్రూప్ అడ్మిన్
రాజ్యాంగ పరిరక్షణ వేదిక
FB గ్రూప్
30.12.2019