నా తలకాయ - నా సిరా
---------------------
నా తలకాయ.......
రాముడి చేతితో తెగిబడిన శంభూకుడి తలకాయ.
దొంగ దెబ్బతో చనిపోయిన వాలి తలకాయ.
అర్జునుడితో చంపబడిన కర్ణుడి తలకాయ.
ఉరితీయబడ్డ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఉద్ధం సింగ్ ల తలకాయ.
మతోన్మాది గాడ్సే చేతిలో చంపబడిన మహాత్మా గాంధీ తలకాయ.
కారంచేడు, చుండూరు, లక్షింపేట, పదిరికుప్పం.... మృతవీరుల తలకాయ.
దేశంలో మార్పుకోసం కృషిచేసిన మహానుభావులు రమబాయి, అంబేద్కర్ గారి పిల్లల తలకాయ.
శ్రామికవర్గం అధికారం లో ఉండాలని కోరుకొని కృషి చేసిన పాలకుల చేత చంపబడిన శంకర గుహ నియోగి తలకాయ.
దోపిడీ కులస్తుల దాడికి బలిఅయిన పూలన్ దేవి తలకాయ.
ఢిల్లీ నడివీదుల్లో చంపబడిన సఫదర్ హష్మీ తలకాయ.
ప్రభుత్వపు దుర్మార్హుల చేత చంపబడిన ప్రజా కళాకారిణి బెల్లి లలితక్క తలకాయ.
కుల వర్గ పోరాటాలు దేశానికి అవసరమని చెప్పిన నాయకుడు, బూటకపు ఎదురు కాల్పులలో చనిపోయిన మారోజు వీరన్న తలకాయ.
బూటకపు ఎదురు కాల్పులలో చంపబడిన అమర వీరుల తలకాయ.
స్కాలర్ షిప్ రాక హైదరాబాద్ యూనివర్సిటీ లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ తలకాయ.
మతోన్మాదుల చేతిలో చంపబడిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ తలకాయ.
రైతు ఉద్యమం లో చంపబడిన రైతుల తలకాయ.
పోరాటాలు చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న యువతీ యువకుల తలకాయ.
ఆ తలకాయల ఆలోచనలయిన సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, సోషలిజం కోసం రాస్తున్న నా కలం లో ఉన్న ఎర్రటి సిరా , తెగిబడ్డ ఏకలవ్యుని బొటన వ్రేలునుండి కారుతున్న రక్తం.
----కాము
13.10.2021