16, ఫిబ్రవరి 2021, మంగళవారం

దేశం కోసం

 


రావనా సెందనలో ఎన్నెలో
రాజా నీకొందనలో ఎన్నెల్లో
పార్లమెంట్ అసెంబ్లీలకు ఎన్నెల్లో ఎన్నెల్లో
ఎలక్షన్లు జరుగుతాయి ఎన్నెల్లో ఎన్నెల్లో
ఆ ఎలెక్షన్లలోన ఎన్నెల్లో ఎన్నెల్లో
డబ్బులు పంచుతారు ఎన్నెల్లో ఎన్నెల్లో
మద్యము బహుమతులు ఎన్నెల్లో ఎన్నెల్లో
ఓట్లకోసం పంచుతారు ఎన్నెల్లో ఎన్నెల్లో
పంచే వాళ్ళను ఏమనాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
నేరస్తులని అనాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
నేరస్తుల్ని జైల్లో వేయాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
రావనా సెందనలో ఎన్నెలో
రాజా నీకొందనలో ఎన్నెల్లో
రాష్ట్రల లోను దేశం లోను ఎన్నెల్లో ఎన్నెల్లో
చంద్ర బాబు నాయుడు కేసీఆర్ ఎన్నెల్లో ఎన్నెల్లో
జగన్ మోహన్ రెడ్డి ఎన్నెల్లో ఎన్నెల్లో
మోడీ అమిత్ షాలు ఎన్నెల్లో ఎన్నెల్లో
ఇంకా అనేక పార్టీల వాళ్ళు ఎన్నెల్లో ఎన్నెల్లో
ఓట్లకోసం పంచుతారు ఎన్నెల్లో ఎన్నెల్లో
వీళ్లందరినీ జైల్లో వేయాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
పార్లమెంట్ అసెంబ్లీలను ఎన్నెల్లో ఎన్నెల్లో
మన ప్రియమయిన దేశాన్ని ఎన్నెల్లో ఎన్నెల్లో
మన దేశ రాజ్యాంగాన్ని ఎన్నెల్లో ఎన్నెల్లో
కాపాడు కోవాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
రావనా సెందనలో ఎన్నెలో
రాజా నీకొందనలో ఎన్నెల్లో
ఎన్నికల అధికారులు ఎన్నెల్లో ఎన్నెల్లో
కోర్టులు పోలీసులు ఎన్నెల్లో ఎన్నెల్లో
డబ్బులు పంచె వాళ్లను ఎన్నెల్లో ఎన్నెల్లో
మద్యము బహుమతులు పంచె వాళ్ళను ఎన్నెల్లో ఎన్నెల్లో
జైల్లో వేయాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
మన ప్రియమయిన దేశాన్ని ఎన్నెల్లో ఎన్నెల్లో
మన దేశ రాజ్యాంగాన్ని ఎన్నెల్లో ఎన్నెల్లో
కాపాడాలి కాపాడాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
రావనా సెందనలో ఎన్నెలో
రాజా నీకొందనలో ఎన్నెల్లో
వాళ్ళు చేయలేక పొతే ఎన్నెల్లో ఎన్నెల్లో
ఎర్ర నీలి జెండాలు పట్టుకొని ఎన్నెల్లో ఎన్నెల్లో
ప్రజా ఉద్యమాల ద్వారా ఎన్నెల్లో ఎన్నెల్లో
సామాజిక ఉద్యమాల ద్వారా ఎన్నెల్లో ఎన్నెల్లో
మనమే చేయాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
పార్లమెంట్ అసెంబ్లీలకు ఎన్నెలో ఎన్నెలో
బహుజనులు శ్రామికులే వెళ్ళాలి ఎన్నెలో ఎన్నెలో
మన దేశ రాజ్యాంగాన్ని ఎన్నెల్లో ఎన్నెల్లో
కాపాడు కోవాలి ఎన్నెల్లో ఎన్నెల్లో
రావనా సెందనలో ఎన్నెలో
రాజా నీకొందనలో ఎన్నెల్లో
అంబెద్కర్ గారికి ఎన్నెల్లో ఎన్నెల్లో
భగత్ సింగ్ రాజగురు సుఖదేవులకు ఎన్నెల్లో ఎన్నెల్లో
అమర వీరులందరికి ఎన్నెల్లో ఎన్నెల్లో
జోహార్లు జోహార్లు ఎన్నెల్లో ఎన్నెల్లో
రావనా సెందనలో ఎన్నెలో
రాజా నీకొందనలో ఎన్నెల్లో
----కాము 14.2.2021
May be an image of 1 person and monument







దేశం కోసం

 


5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

అంబెడ్కర్ కృపా లని

 

badge icon
Admin
 February 6, 2018 Hyderabad 
బాబాసాహేబ్ అంబేడ్కర్ పార్లమెంటు నుండి బయటకు వస్తున్నాడు.
అప్పుడు, ఆచార్య కృపాలాని ఎదురై యిలా అన్నాడు..."అంబేడ్కర్ మీరు ఈ రోజు చాల సంతోషంగా కనిపిస్తున్నారు. ఏమిటి విషయం?
బాబాసాహేబ్ ఇలా అన్నారు-.''మొదట్లో రాణి కడుపు నుండి రాజులు పుట్టేవారు. నేను ఇప్పుడు రాణి కడుపులోనుండి కాకుండ
ఓట్లపెట్టె నుండి పుట్టే ఏర్పాటు చేశాను. అందుకే సంతోషం
గా ఉన్నాను... దానికి
కృపాలని ఇలా బదులిచ్చాడు...."ఐతే
మీ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు..
ఎందుకంటే, నీ ప్రజలు పేదలు,నిస్సహాయులు,అడుక్కునేవాళ్లు, అమ్ముడు పోయేవాళ్లు, మేము వారి ఓట్లను కొని
మా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాం.
నీవ్ ఏమి చేయలేవ్.....
అప్పుడు బాబాసాహేబ్ ఇలా అన్నారు--
నా ప్రజలు పేదలే,నిస్సహాయులే, అడుక్కునే వారే కావచ్చు, మీరు
వారి ఓట్లను కొని ప్రభుత్వాలను ఏర్పాటు
చేయవచ్చు.....
కాని.......
ఏ రోజు ఐతే నాప్రజలు తమ ఓటు విలువను సరిగ్గా గుర్తిస్తారో, అప్పుడు
మీ కంటే పెద్ద బిచ్చగాళ్లు ఎవరు ఉండరు..గుర్తుంచుకోండి!!!
* బాబాసాహేబ్ *
-----------------------
"నా ప్రజలు పేదలే,నిస్సహాయులే, అడుక్కునే వారే కావచ్చు, మీరు
వారి ఓట్లను కొని ప్రభుత్వాలను ఏర్పాటు
చేయవచ్చు.....
కాని.......
ఏ రోజు ఐతే నాప్రజలు తమ ఓటు విలువను సరిగ్గా గుర్తిస్తారో, అప్పుడు
మీ కంటే పెద్ద బిచ్చగాళ్లు ఎవరు ఉండరు..గుర్తుంచుకోండి!!!
* బాబాసాహేబ్ *"
ఇక్కడే నాకు చాలా బాధగా వుంది. ప్రజలకు డబ్బులు ఇచ్చేవారిని శిక్షించే విధంగా రాజ్యాంగం లో ఒక చాప్టర్ పెట్టక పోవడం బాధగా వుంది. మనువాదులు దుర్మార్గులు అని తెలిసి అలాంటిటి వారిని కట్టడి చేయడం అవసరమని అంబేద్కర్ చేయకపోవడం విచారకరం.
నేటి తరం.ఆపని చేయాలి. ప్రజలకు డబ్బులు మద్యం బహుమతులు ఇచ్చేవారిని శిక్షించే విధంగా రాజ్యాంగంలో సవరణ చేయాలి. లేకపోతే చట్టం చేయాలి.
అదే ప్రజస్వామ్య వాదుల తక్షణ కర్తవ్యం.
రాజ్యాంగం వర్ధిల్లాలి.
రాజ్యాంగ వ్యతిరేక శక్తులు నశించాలి.
కామేశ్వరరావు
రాజ్యాంగ పరిరక్షణ వేదిక.
కన్వీనర్.
Pulapola Ramnjanillu, Khasimsaheb Diguri and 1 other
1 Share
Share

1, ఫిబ్రవరి 2021, సోమవారం

election representative

 ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే UPSC, SSC, RRB, SPSCs, DSC, బ్యాంకు పరీక్షలు మొదలయిన పరీక్షలు పాసయినా, పోలిస్ క్లియరెన్స్ కావలి. ఎలెక్షన్ కమిషన్ అధికారులు, ఉద్యోగులు కూడా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే పోలీస్ క్లియరెన్స్ కావాలి.

గ్రూప్ డి పోస్టుల నుండి IAS అధికారుల వరకు పోలీసు క్లియరెన్స్ ఉంటేనే ఉద్యోగాలలో చేరగలరు.
కాని MLA, MP స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నికలకు ఎవరయినా ఎన్ని కేసులు ఉన్న పోటీ చేయవచ్చు.
వాళ్లు గెలిచిన తర్వాత PM, CM లు మంత్రు లయితే ఆ చెత్త గాళ్ళ ఫైళ్లు ప్రభుత్వ ఉద్యోగులు మోయాలి. వాళ్లను MP, MLA లను కాపాడాలి.
వాళ్ళను, ఇష్టం ఇష్టంలేకపోయినా గౌరవించాలి.
ఏమిటీ ఈ పరిస్థితి. దీనిని మార్చాలి.
ఎలెక్షన్ కమిషన్ MP, MLA, స్థానిక సంస్థల ప్రతినిధులకు పోటీ చేస్తున్న అభ్యర్థులనుండి పోలీస్ క్లియరెన్సు సరిఫికేట్ తీసుకోవాలి. ఇంకా ఇన్కమ్ టాక్స్, ACB, CBI, నుండి ఎటువంటి కేసులు లేవని సర్టిఫికెట్ తీసుకోవాలి.
క్లియరెన్స్ లేకపోతే వాళ్లకు పోటీ చేసే అర్హత లేదని ప్రకటించాలి.
గెలిచిన తర్వాత ACB, CBI, పోలీసుల కేసులలో ఉంటె మంత్రులు, MP, MLAలు వారిని వెంటనే డిస్క్వాలీఫై చేసే విధంగా చట్టం చేయాలి.
దేశాన్ని ఈ చెత్త రాజకీయ నాయకుల నుండి రక్షించాలి.
పూర్వ ముఖ్య ఎన్నికల కమిషనర్ JM లింగ్డో గారు రాజకీయ నాయకులు క్యాన్సర్లు అని అన్నారు. వారిని తొలగించడానికీ కృషి జరగాలి. పైన చెప్పిన విధంగా చేయవచ్చు. చేయాలి.
పూర్వ ముఖ్య ఎన్నికల కమిషనర్ TN శేషన్ గారు కూడ గొప్ప కృషి చేసారు.
ఇంకా చేయాలి.
పైన చెప్పిన విధంగా చేసి ఈ చెత్త రాజకీయ నాయకుల నుండి దేశాన్ని కాపాడాలి.
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.
రాజ్యాంగం వర్ధిల్లాలి.
జోహార్ బాబాసాహెబ్ అంబెడ్కర్.
కామేశ్వర రావు
గ్రూప్ అడ్మిన్
రాజ్యాంగ పరిరక్షణ వేదిక
FB గ్రూప్
30.12.2019