ఈ రోజు మా పెండ్లిరోజు అని గుర్తులెదు పేపర్ చూడంగానే ఉమర్ ఖాలిద్, అనిర్బన్ లకు బెయిల్ ఇచ్చారనే వార్త నాకు ఎంతో ఆనందాన్నీఇచ్చింది. అందుకే ఒక రకమయిన ఉ ద్వేగంలో ఉందిపోయాను. నామిస్సేస్ రాజేశ్వరి గుర్తు చేసిందాకా గుర్తులేదు. నేను ఎపుడు అంతే ఎదో పేస్ బుక్ ఉంది గదా ఎదో రాద్దామని ప్రయత్నిస్తున్నాను. ఆ స్టవ్, మా పెండ్లికి ముందు ఆ తర్వాత వాడిన స్టవ్. ఆ స్టవ్, మాక్సింగోర్కీ అమ్మ, మహాప్రస్తానం, దిగంబరకవుల సాహిత్యం, సృజన, ప్రజాసాహితి అరుణతార మొదలయిన పుస్తాకా లే నాతోడూ. పెండ్లితర్వాత కూడ అవే నా తోడూ. నాకు కందుకూరి చెప్పినల్ట్లు చినిగి పోయిన చొక్కనయిన తొడుక్కొని మంచి పుస్తకం కొనుక్కో అనేది ఎపుడు. మనసులో ఉండేది. రైల్వే ఉద్యోగం. విజయవాడలో కీర్తిశేషులు జోస్యభట్లసత్యనారాయణ గారి ఇంట్లో ఉండే వాళ్ళం. జోస్యభట్ల గారు, వారిశ్రీమతి సుబమ్మ గారు ఎంతో ఆదరంగా చూసే వారు.వారు కమ్యునిష్టు పార్టీలో పని చేసేవారు. వారి అల్లుడు కీర్తిశేషులు రంగారావు గారు సౌజన్య పత్రిక నడిపేవారు. ఆ పత్రికకు విశాలాంధ్రకు రాస్తుండే వాడినే. వారి ప్రోత్సాహం ఉండేది. జీవితంలో అనేక విజయాలు, చూసాం. కష్టాలు చూసాం. ఓటములు లేవు. వున్నా అవి ఓటములు కావు. విజయవాడ రాయనపాడు వర్క్ షాప్ లో పనిచేస్తున్నప్పడు కొంతమంది అదికారుల వలన . ఉద్యోగంలో కక్ష సాధింపు చర్యలు వలన బదిలీలు.అవ్వ వలసివచ్చింది. కుటుంబానికి దూరం. అవడం జరిగింది. నాకు అని పిస్తోంది వారికి తప్పలేదు కాబట్టే నన్ను ట్రాన్స్చేఫర్లు చేసారని పిస్తోంది.నాకు ట్రాన్స్ ఫర్లు వచ్చినప్పుడు మిత్రులు నైతికంగా ఏంతో సహాయం చేసారు
నన్ను చాల మంది మంది అధికార్లు,, కార్మికులు ప్రేమతో చూసారు. బహుశా వారికి నా నిజాయతి నచ్చి ఉండవచ్చు. ఏమయినా రైల్వే మా కుటుంబానికి ఎంతో ఇచ్చింది. నేను రైల్వేకు చేయాల్సిన పనిని నిజాయతీతో, కార్మక ఉద్యమంతో పాటు చేశాను. మాకు మా రైల్వే అంటే గర్వం.
సృజన, రాహుల్ ఇద్దరు. పిల్లలు.
రాసింది చాలు అనుకుంటాను బోరుకొడితే క్షమించండి.
మా స్టవ్ మాకు ఏంతో సేవ చేసింది. దానికి కృతజ్ఞతలు ఇప్పటికి దానిని జాగ్రత్తగా ఉంచుకున్నాం.
.