ఆత్మహత్యలు వద్దనడం నేరమా.
ఈ కవిత తెలంగాణ రచయితల వేదిక మరియ సింగిడి అద్వర్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మార్చ్2011 మొదటివారం లో జరిగిన కవిత గోష్టి లో చదివితే మంచి రెస్పాన్స్ వచ్చినది. ఆత్మహత్యలు తప్పు అని అందరు ఫీల్ అయ్యారు. కాని ప్రముఖ రచయిత జయదీర్ తిరుమలరావు గారు ఈ కవిత ఎక్కడ చదవద్దు అని ఆర్డర్ ఇచ్చారు. అంతేకాదు కవి కాబట్టి క్షమిస్తున్నమన్నారు .కవిత మీద ఆర్టికల్ వ్రాస్తామన్నారు. నా జిజ్ఞాస తరంగాలు పుస్తకం ఇచ్చాను. నా కవిత ఆ పుస్తకంలో ఉంది. నిర్వాహకులు సింగిడి స్కై బాబా నా వద్దకు వచ్చి బాధ పడకండి అన్నారు. వారికి కూడా నా పుస్తకం జిజ్ఞాస తరంగాలు ఇచ్చాను.
రచయితగా ఆత్మహత్యలు వద్దనడం నేరమా.